Facebook Post of 01.04.2019.
Where there is a #will there is a Way & #Success
Big Congratulations dear Amgoth Tukaram Pawar..
Wish You All the best to your journey #MountEverest
You have Courage, Potential, Patience, Calmness grit to execute in right way and right direction.
After 60days, Your foot mark will on 8848m highet and Proud movement to Everyone.
Thanks to all who behind your journey.
#RuralGenius #RuralTalent
*సంకల్పానికి ఆత్మీయ ప్రోత్సాహం*
సాధించాలనే సంకల్పం మెండుగా ఉన్నప్పుడు, సమస్యలెన్ని అడ్డువచ్చినా పట్టుదలతో ముందుకు వెళితే *ఎవరెస్ట్ శిఖరాన్నైనా* ఎక్కవచ్చు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ మన *తుకారాం*....
పుట్టి పెరిగింది ఒక మారుమూల గ్రామానికి అనుబంధంగా ఉన్న గిరిజన తండాలో , తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళు కాదు, ఆర్థిక స్థితిమంతులు అసలే కాదు. కుటుంబం సజావుగా నడవడానికే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు....
అయితేనేం *ఎవరెస్ట్ శిఖరాన్ని* ఎక్కాలనే ధృఢసంకల్పంతో ముందుకెళుతున్నాడు ఈ యువకిషోరం ....
ఆడిన అన్ని ఆటలు_ లగోరి, లంగడి, NCC, మళ్ళకంబలలో ప్రావీణ్యతను చాటడo తన శ్రద్ధను గుర్తుచేస్తుంది.. ఆదే స్పూర్తితో పర్వాతారోహనపై ఆసక్తిని పెంచుకుని, ప్రయత్నం మొదలుపెట్టి ఈ మద్యే #MountKilumanjaro అధిరోహించాడు.
తనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుని , గొప్ప లక్ష్యాన్ని సాధించి దేశం గర్వించే విధంగా ఎదగడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ దిశగా ముందుకు వెళుతూ *ఎవరెస్ట్ శిఖరం_ #MountEverest పై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించి , ప్రపంచ రికార్డును నెలకొల్పుతాననే విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు.
లక్ష్యం దిశగా ముందుకెళ్లే క్రమంలో తనకు ఎదురైన అవమానాలు, ఆటంకాలు, అవరోదాలను పట్టించుకోకుండా,కొందరి సహకారంతో ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు తనను ప్రోత్సహించి వెన్నంటి ఉన్నవారికి ధన్యవాదాలు తెలుపుతున్నాడు.
ఇకముందు కూడా తనను ప్రోత్సహిస్తే భారతం దేశం గర్వపడేలా మరిన్ని రికార్డులు నెలకొల్పగలననే ఆత్మస్థైర్యంతో *ఏప్రిల్ మొదటి వారంలో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని* అధిరోహించడానికి బయలుదేరనున్నాడు ఈ మట్టిలో మాణిక్యం....
ఈ సందర్భంగా తమ సంస్థ సభ్యునికి #GSF *ఆత్మీయ అభినందన* తో అతనికి ఆత్మస్థైర్యాన్ని, ప్రేరణను ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఎవరెస్టు శిఖరయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసి జన్మస్థలానికి, దేశానికి గర్వకారణం కావాలని తుకారంని అందరం ఆశీర్వదిద్దాం.
అవును నిజమే.. గొప్ప ఆలోచనలు, గొప్ప ప్రయత్నాలన్నీ అనుమానం, అవమానం అవహేళనతోనే మొదలవుతాయి..
కాని ముగింపు మాత్రం ముల్లోకాలకు స్ఫూర్తినిస్తాయి.
_____________________________
No comments:
Post a Comment