నమ్మిన కార్యంకోసం/ సంస్తకోసం కార్యకర్త ఎలా పనిచేయాలి అనే విషయంలో హనుమాన్ నీ ఆదర్శంగా తీసుకోమన్న స్వావిన.
*వివేకవాణి శిరసా నమామి*
నన్ను గుర్తించకోయినా పరవాలేదు, నా భావాలను అంగీకరిస్తే చాలు, కామకాoఛనాలను జయించిన సాధువులైనా కీర్తి, ప్రతిష్టల వలలో చిక్కుకుపోవడం జరుగుతుంది. సంపూర్ణమైన నిష్కామకర్మ చేయాలి. ప్రజలు మనను ఏ విధంగానైనా భావించవచ్చు, నిందించవచ్చు, ప్రశంసిoచవచ్చు కానీ మన ఆదర్శాలను వదలకుండా పనిచేయాలి.
మహావీర హనుమాన్ ని మీ ఆదర్శంగా స్వీకరించాలి. రామజ్ఞతో మహాసాగరాన్ని మరణం అన్న ఆలోచన లేకుండా అవలీలగా దాటాడు. పరిపూర్ణమైన ఇంద్రియనిగ్రహం, అద్భుతమైన ధీశక్తి కలిగిన మహావీరుడు. అటువంటి గొప్ప సేవ, ఆదర్శాలు ఆధారంగా మీ జీవితాలు నసుపుకోవాలి. అప్పుడు మెల్లమెల్లగా మిగిలిన ఆదర్శాలనీ మీ జీవితాలలో వ్యక్తమవుతాయి. గురువుపట్ల సంపూర్ణ విధేయత, బ్రహ్మచర్యం.. ఇదే విజయ రహస్యం. ప్రపంచాన్ని అబ్బురపరిచే సేవాతత్పరత, సింహ సదృశ శౌర్యం, రామకార్యానికై ప్రాణత్యాగానికైనా వెనకాడని ధీరత్వం, రాముని సేవపట్ల తప్ప ఇతర విషయాలపై నిరాసక్తత, బ్రహ్మ, శివ పదాన్నైనా పొందడానికి విముఖత, రామ కార్యాచరణే జీవిత లక్ష్యంగా గల మహావీరుడి లాంటి హృదయ పూర్వక భక్తి కావాలి.
:~ స్వామీ వివేకానంద.
No comments:
Post a Comment