Wednesday, April 12, 2023

JALIYANWALA BAGH Visit @2019

100+4 year for
#JALIYANWALABAGH Incident
#Vandhematharam #BharathmathakiJai
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట. ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.ఈ దారుణ ఘటన జరిగి నేటికి 100 సంవత్సరాలు..

ఆ స్థలాన్ని సందర్శించి అమరులకు ఆత్మ నివాళులు అర్పించి, వారి పోరాట పటిమకు వందనం చేసే అవకాశం దక్కింది..

ఇంక్విలాబ్ జిందాబాద్... భారత్ మాతాకి జై.

No comments:

Post a Comment