శ్రీరామచంద్రుడు సీతమ్మ, లక్ష్మణ, హనుమత్ సమేతంగా అయోధ్యకు చేరుకుంటాడు.
చైత్ర శు.దశమి నాడు రాముడి పట్టాభిషేకం జరుగుతుంది..
రావణుడిని జయించి ధర్మరక్షణ గావించిన ఆనందం, శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైన హనుమంతుడు వేలాది సహచర వానరులతో కలిసి చైత్ర పున్నమి నాడు అయోధ్యా నగరంలో విజయ మహా యాత్ర పేరుతో పెద్ద శోభాయాత్రను నిర్వహించాడట..
ఆనాడు హనుమంతుడు నిర్వహించిన శోభాయాత్రను ఈ కలియుగంలో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణమి నాడు మనం వీరహనుమాన్ విజయ యాత్ర పేరుతో నిర్వహించుకుంటున్నాము.
ఈ ఉత్సవ లక్ష్యం సమాజసంఘటన, ధర్మ రక్షణ..
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఈ రోజున హనుమంతుడి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు..
No comments:
Post a Comment