Tuesday, July 28, 2026

వ్యాస పౌర్ణమి -. 2026

వ్యాస పూర్ణిమ – గురుపౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారు?
సదాశివ సమారంభాం    
  వ్యాస శంకర మధ్యమామ్ అస్మదాచార్య పర్యంతాం         
  వందే గురు పరంపరామ్॥

ఈ శ్లోకం భారతీయ గురు-శిష్య పరంపర యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే—ఈ జగత్తులో జ్ఞానప్రవాహం పరమేశ్వరుడైన సదాశివుని నుండి ప్రారంభమై, వేదవ్యాస మహర్షి ద్వారా ప్రపంచానికి వ్యాపించి, ఆది శంకరాచార్యులు వంటి మహనీయుల ద్వారా విస్తరించి, చివరకు మనకు జ్ఞానాన్ని అందించిన మన గురువుల వరకు నిరంతరాయంగా కొనసాగుతోంది.
ఈ అఖండ గురు పరంపరకు మన నమస్కారం🙏

అందుకే ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ లేదా గురు పౌర్ణిమగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

"గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః॥"
భారతీయ సంస్కృతిలో గురువుకు దేవునికంటే ఉన్నతమైన స్థానం కల్పించారు. తల్లిదండ్రులు శరీరానికి జన్మనిస్తే, గురువు జీవితానికి అర్థాన్ని, ఆత్మకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే "మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ" అని వేదాలు బోధించాయి.

వ్యాస మహర్షి మానవాళికి చేసిన సేవ అపూర్వమైనది. ఒకే మహా వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి, వేదజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మహాభారతాన్ని రచించి, అందులో భగవద్గీత అనే అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి అందించారు. అష్టాదశ పురాణాలను రచించి సనాతన ధర్మాన్ని శాశ్వతంగా నిలబెట్టారు. అందువల్లే ఆయనను జగద్గురుగా సన్మానిస్తారు.

"గు" అంటే అంధకారం, "రు" అంటే దానిని తొలగించేవాడు. కాబట్టి గురు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు.

గురు పౌర్ణిమ అనేది కేవలం ఒక పండుగ కాదు; అది కృతజ్ఞతా మహోత్సవం.
 మన జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులను స్మరించే రోజు. మనకు విద్య, వినయం, వివేకం, సంస్కారం, ధర్మం నేర్పిన ప్రతి గురువుకు నమస్కరించే పవిత్రమైన సందర్భం.

శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి, శ్రీకృష్ణుడికి సాందీపని మహర్షి, ఛత్రపతి శివాజీ మహారాజుకు సమర్థ రామదాసు, స్వామి వివేకానందకు శ్రీరామకృష్ణ పరమహంస గురువులుగా నిలిచి ప్రపంచ చరిత్రను మార్చిన మహనీయులను తీర్చిదిద్దారు.

ఆధ్యాత్మికంగా గురువు అంటే పరమాత్మను చేరుకునే మార్గాన్ని చూపించే దివ్య దీపస్తంభం. గురుకృప లేకుండా ఆత్మజ్ఞానం సిద్ధించదని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే గురువును పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధిస్తారు.

ఈ పవిత్రమైన వ్యాస పూర్ణిమ రోజున మనమందరం మన గురువులను స్మరించి వారి ఆశీర్వాదం పొందాలి. మంచి గ్రంథాలను అధ్యయనం చేయాలి. 
 జ్ఞానాన్ని సమాజానికి  పంచాలి. ధర్మమార్గంలో నడవాలని సంకల్పించాలి.

వ్యాస మహర్షి మనకు ఇచ్చిన సందేశం ఒక్కటే – జ్ఞానమే నిజమైన సంపద; గురువే ఆ సంపదకు ద్వారం.

సమస్త గురు పరంపరకు శతకోటి వందనాలు🙏...
గురు పౌర్ణిమ శుభాకాంక్షలు🙏!
:~ సదా వెంకట్, GSF.

Monday, July 27, 2026

దాశరథి సినారే జయంతి 2026

అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ద్వారా ముగ్గురు రచయితల ద్వారా రచించిన మూడు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనే అవకాశం రావడం అదృష్టమే..
కేవలం తెలుగు బాష పట్ల ఉన్న అభిమానమే అనేకమంది తెలుగు సాహితీ వేత్తలు, రచయితలు, తెలుగు పండితులు పాల్గొనే వేదికపై అతిథిగా పాల్గొనే అవకాశం వచ్చిందనటo సందేహం లేదు. అలాంటి అవకాశాలను అందించిన సాధన కుటీర్ వేదికకు కృతజ్ఞతలు..
ఈ వేదిక ద్వారా తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు భద్రంగా అందిద్దాం అనే సదాశయంతో *ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు *పద్యాల తోరణం* నిర్వహించ బడుచున్నది. అందరం బాగస్తులమవుదాం.
సదా వెంకట్ ల్, GSF.

Sunday, July 26, 2026

ధర్మో రక్షతి రక్షతః

*ధర్మో రక్షతి రక్షితః*
ధ‌ర్మం... 
*ఆవేశ‌ ప‌డేవారికి, ఆయాస‌ ప‌డేవారికి, ఆక్రోశ‌ ప‌డేవారికి కాదు!*
ధ‌ర్మం...
*స‌త్యం, స‌హ‌నం, సాహ‌సం గ‌ల‌వారికి మాత్ర‌మే!*
                        ***
యుద్ధం అంటే కోలాటం కాదు! 
క‌త్తులతో సావాసం!

ధ‌ర్మం అంటే దంచి కొట్టే ఉప‌న్యాసం కాదు!
ప్రాణాల‌తో చెల‌గాటమాడే విన్యాసం!

శ్రీరాముడు ధ‌ర్మం వైపు నిల‌బ‌డ్డాడు...
భార్య‌ను రాక్ష‌సుడు ఎత్తుకు వెళ్లాడు!
యుద్ధంలో త‌మ్ముడు మూర్ఛ‌పోయాడు!
ఇప్ప‌టికీ ప‌నికిమాలిన‌, దిక్కుమాలిన వెధ‌వ‌ల చేత...
రాముడు నానా మాట‌లు ప‌డుతూనే ఉన్నాడు!

పాండ‌వులు ధ‌ర్మం ప‌క్షాన నిలిచారు...
భార్య‌ని కాపాడుకోలోక‌ పోయారు...

కొడుకులైన ఉప పాండ‌వుల్ని చంపుకున్నారు...

సాక్షాత్తూ శ్రీకృష్ణుని మేన‌ల్లుడైన అభిమ‌న్యుడు నేల‌కూలాడు...

భీముడి కొడుకు ఘ‌టోత్క‌చుడు కురుక్షేత్రంలో బ‌ల‌య్యాడు... 

ద్రౌప‌ది పుట్టింటి వారు కూడా ర‌ణ‌రంగం నుంచీ తిరిగి రాలేదు...
శ్రీకృష్ణుని స్వంత వంశం కొడుకులు, మ‌న‌వ‌ళ్ల‌తో స‌హా...
ప‌శ్చిమ స‌ముద్ర తీరంలో చూస్తుండ‌గానే కొట్టుకుపోయింది!
ధ‌ర్మం ప‌ట్టుకున్నందుకు...
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పాండ‌వులే మూల్యం చెల్లించారు!
మ‌నం ఎంత‌? మ‌న‌కు ఎదుర‌య్యే చిన్నపాటి ఓట‌ములెంత‌? 
వెనుదిరిగామా? వెన‌క్కిత‌గ్గామా? రెండూ వేర్వేరు!
గెలిచింది ధ‌ర్మ‌మా? ధ‌ర్మ‌మే గెలుస్తుందా? అన్నీ ఒక్క‌టి కాదు!
ధ‌ర్మం గెలిచేదాకా... ఎన్నైనా, ఎవ‌రైనా గెల‌వ‌వ‌చ్చు...
కానీ, *అంతిమంగా ఏది గెలుస్తుందో, ఏది నిలుస్తుందో... అదే ధ‌ర్మం*!
*ధ‌ర్మంతో... ధ‌ర్మం కోసం... చేసే ప్ర‌యాణం*...
ఉద్యానవ‌నంలో ఉరుకులు, ప‌రుగులు కాదు!
ఎడారి ఎర్ర‌టి ఇసుక‌లో... ఎండ‌లో... ఏమీలేని...
న‌గ్న పాదాలు చేసే న‌డ‌క అనే వీర పోరాటం!
ధ‌ర్మం... 
*ఆవేశ‌ప‌డేవారికి, ఆయాస‌ప‌డేవారికి, ఆక్రోశ‌ప‌డేవారికి కాదు!*
ధ‌ర్మం...
*స‌త్యం, స‌హ‌నం, సాహ‌సం గ‌ల‌వారికి మాత్ర‌మే!*

*ధర్మో రక్షతి రక్షితః*

సేకరణ SM🚩

Wednesday, July 1, 2026

మన సంకల్పమే మన ఆయుధం

మన సంకల్పమే మన ఆయుధం.. అదే  నిజమైన బలం.
 వ్యక్తుల కోసం కాదు, వ్యవస్థ కోసం సేవ/బాధ్యత.

ఒక  సంకల్పాన్ని స్వీకరించిన తర్వాత ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని అపార్థాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా చివరి వరకు నిలబడగలిగిన వారే నిజమైన ధీరులు.
 పరిస్థితులను బట్టి మారిపోయేవారు, పారిపోయే వారు కాదు, సిద్ధాంతాన్ని బట్టి నిలబడేవారే ఏ సంస్థకైన వెన్నెముకలా ఉంటారు.

ఏ వ్యవస్థ /సంస్థలోనైనా పనిచేసే ప్రతి వ్యక్తి పరిపూర్ణుడు కావాల్సిన అవసరం లేదు. 

లోపాలు, భిన్నాభిప్రాయాలు ,పరిమితులు సహజమే. 
కానీ వాటిని అధిగమిస్తూ, వ్యక్తులను కాకుండా లక్ష్యాన్ని గొప్పదిగా భావిస్తూ, నిజాయితీతో, నిబద్ధతతో, కీర్తి కాంక్ష లేకుండా, ఫలాపేక్ష లేకుండా సేవ చేయడం ఎంతో ఉన్నతమైన గుణం.

సంస్థను ముందుకు నడిపేది వ్యక్తుల ప్రతిభ ఒక్కటే కాదు;
వారి త్యాగం, సహనం, క్రమశిక్షణ, పరస్పర విశ్వాసం, సేవాతత్వం. అందుకే చివరి వరకు వ్యవస్థ/ సంస్థతో కలిసి నడిచిన వారే దాని చరిత్రలో బాగస్తులవుతారు. మధ్యలో విడిచిపెట్టినవారు కారణాలు చెబుతారు; చివరి వరకు నిలిచినవారు ఫలితాలు చూపిస్తారు.

తన అసమర్థతకు, తమ అనాసక్తికి ఇతరులను బాధ్యులుగా చూపడం బలహీనతకు సంకేతం. 
కానీ తన బాధ్యతను గుర్తించి, తన వంతు కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించడం నిజమైన కార్యకర్త లక్షణం.

గుర్తింపు కోసం కాదు... కర్తవ్యం కోసం పనిచేయాలి.
ప్రశంసల కోసం కాదు... పరమార్థం కోసం నిలబడాలి.
వ్యక్తుల కోసం కాదు... వ్యవస్థ కోసం అంకితమవ్వాలి.
 ఆటు పోట్లు ఎన్ని వచ్చిన చివరి వరకు నిలబడిన వారే నిజమైన కార్యకర్తలు... 
వారే నిజమైన సేవకులు... 
నిజమైన విజేతలు.

మైమరచి చేసే నిస్వార్థ సేవ ద్వారా రావాల్సినంత పేరూ/కీర్తి వస్తుంది.
ఎప్పటికి అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం...
సమాజ హితం కోరి సంకల్పించిన ఏ ఒక్క కార్యo కూడా నీవు, నేను లేకున్నా ఆగదు గాక ఆగదు.. అవకాశం తీసుకుని మనమే భాగస్తులమవుతే అదృష్ట వoతులం లేదు, కాదు, కూడదు అంటే దురదృష వoతులం.. 
కాబట్టి ఉన్న సమయంలో కొంత, సంపదలో కొంత సమాజ హితం కోసం సమర్పణ(ప్రతిఫలం ఆశించక) బావంతో చేస్తే, మిగతాది ప్రకృతి చూసుకుంటుంది.. ఇది అక్షరాల కూర్పు కాదు, చరిత్ర చెప్పిన నిజం.

Wednesday, June 24, 2026

NEVER GIVE UP _ ముత్యం కథ

ముత్యం కథ
బాధ కలిగించిన ఇసుకరేణువే... ముత్యం పుట్టడానికి కారణమైంది."
ఒక రోజు సముద్రపు అడుగున ఉన్న ఒక చిన్న ముత్యపు చిప్ప లోకి ఇసుకరేణువు ప్రవేశించింది.

ఆ చిన్న ఇసుకరేణువు వల్ల ముత్యపు చిప్పకు చాలా అసౌకర్యం కలిగింది.

రోజులు గడిచినా...
ఆ ఇసుకరేణువు బయటకు వెళ్లలేదు.
అప్పుడు ముత్యపు చిప్ప ఆలోచించింది.
💭 "ఈ బాధను ఎలా తొలగించాలి?" అని.

ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.

కానీ ముత్యపు చిప్ప ఓడిపోలేదు.

ఆ ఇసుకరేణువు చుట్టూ ఒక ప్రత్యేకమైన మెరిసే పదార్థాన్ని కప్పడం ప్రారంభించింది.

ఒక పొర...మరొక పొర...ఇంకో పొర...

రోజులు నెలలయ్యాయి.

నెలలు సంవత్సరాలయ్యాయి.

చివరికి...

ఆ ఇసుకరేణువు చుట్టూ అందమైన ముత్యం ఏర్పడింది.

ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది.

🤔 **"ఇసుకరేణువే ముత్యంగా మారిందా?"**

లేదు.

ఇసుకరేణువు ముత్యంగా మారలేదు.

కానీ...

🐚 **ముత్యం పుట్టడానికి కారణం మాత్రం అదే ఇసుకరేణువు.**

ఆ ఇసుకరేణువు రాకపోయి ఉంటే...

ఆ ముత్యం కూడా పుట్టేది కాదు.

అప్పుడు ప్రకృతి ఒక గొప్ప పాఠం చెబుతుంది.

మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు...

కొన్ని అవమానాలు..కొన్ని నిరాశలు...

మనకు బాధను కలిగిస్తాయి.

ఆ సమయంలో అవి శాపంలా అనిపిస్తాయి.

కానీ...
వాటినే ధైర్యంగా ఎదుర్కొంటే...

అవే మన ఎదుగుదలకు కారణమవుతాయి.

అవే మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి.

అవే మన విజయానికి పునాది అవుతాయి.

 ఇసుకరేణువు ముత్యంగా మారలేదు...

 కానీ ముత్యం పుట్టడానికి కారణమైంది.

అలాగే...
🌿 ప్రతి కష్టం విజయంగా మారకపోవచ్చు...

🌿 కానీ ప్రతి విజయం వెనుక ఒక కష్టం మాత్రం తప్పకుండా ఉంటుంది.

✨ బాధ కలిగించిన ఇసుకరేణువే... ముత్యం పుట్టడానికి కారణమైంది.

ప్రకృతి చెప్పే పాఠాలు 🌿
జీవిత పాఠాలు 📖

Never GiveUp ✨

Monday, June 22, 2026

CLOSENES @ నమ్మకం

మన క్లోజ్ పీపుల్ ఎవరైనా మన దగ్గరకు వచ్చి నీ గురించి వాళ్లు అలా నెగటివ్ గా మాట్లాడుతున్నారు అని చెప్పారే అనుకోండి......

ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది వేరే మనిషి మన గురించి ఏం మాట్లాడారో అది పక్కన పెట్టండి 

కానీ ఆ మనిషి నీ దగ్గర నా గురించి నెగిటివ్ గా మాట్లాడడానికి అంత  కంఫర్ట్ ఎలా ఫీలయ్యారు.... 
హౌ ఇస్ ఇట్ పాసిబుల్... 

ఎందుకంటే ఇన్ కేస్ నా క్లోజ్ ఫ్రెండ్స్ గురించి ఎవరైనా నా దగ్గర నెగిటివ్ గా మాట్లాడే ధైర్యం కూడా చేయరు ఎందుకంటే నేను వారికి అలా నా ఫ్రెండ్స్ గురించి ఎవరైనా మాట్లాడితే ఇచ్చి పడేస్తాను.....

 అలాంటిది  నీకు చెప్పే వారి దగ్గర వేరే వ్యక్తి నీ గురించి నెగటివ్ గా మాట్లాడడానికి అంత కంఫర్ట్ ఎలా ఫీలయ్యారు...

జనరల్ గా ఫ్రెండ్షిప్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి వాటిలో చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే నీ  absence లో నిన్ను defend చేయగలగడం.... నీ absence  లో నీకు స్టాండ్ తీసుకోగలగడం... ముందర ఎవరైనా మంచిగానే ఉంటారు.... 

నీ ఆబ్సెన్స్ లో నిన్ను డిఫెండ్ చేయలేని వ్యక్తి… నీ ఎదుట ఎంత స్నేహంగా ఉన్నా, ఆ స్నేహాన్ని మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

అందుకే ముందు  ఇలాంటి ఫ్రెండ్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి...
🖌️

Friday, June 5, 2026

స్థిరత్వం

*ఆజ్ కి బాత్ అజమ్ కర్లో*
ఎవడికి బాగుపడే లక్షణాలు ఉన్నాయో వాడు మాటల్లో కాదురా, పనుల్లో కనిపిస్తాడు”.
 అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. *మనిషి బాగుపడతాడా లేదా అనేది డిగ్రీలు, డబ్బు చూసి చెప్పలేం. అది వాడి లోపలి లక్షణాల్లో కనిపిస్తుంది*.

1. *బాధ్యత తీసుకోవడం*..దానిని కోసం  శత శాతం ప్రయత్నం చేయడం..

వేదాల్లో ఋషులు చెప్పింది ఒక్కటే – “కర్మణ్యేవాధికారస్తే”. ఫలితం నీ చేతిలో లేదు, కానీ కర్తవ్యం నీదే.

బాగుపడే మనిషి పొరపాటు చేస్తే “నాదే తప్పు” అంటాడు. పడిపోయే మనిషి “పరిస్థితి బాగాలేదు” అంటాడు.

*మైథాలజీలో రాముడు కష్టం వచ్చినప్పుడు అరణ్యం వెళ్లాడు, కానీ బాధ్యత వదల్లేదు*. 
అదే లక్షణం.
*బాధ్యత తీసుకోకుండా ఫలితాలు ఆశించలేం....అలా ఆశించడం మూర్ఖత్వం.*

2. *నేర్చుకోవాలనే ఆకలి*..

పూర్వం గురుకులంలో శిష్యుడు గురువు దగ్గరికి వెళ్లి “ఇంకా నేర్పండి” అనేవాడు. ఈ రోజు మనం డిగ్రీ తీసుకున్నాక పుస్తకం మూసేస్తాం.

*బాగుపడే మనిషి ప్రతి దెబ్బ నుంచి ఒక పాఠం తీస్తాడు. ఫెయిల్ అయినా “ఓహో, ఇలా చేయకూడదు” అంటాడు*.

ఆధునిక సైకాలజీ దీన్నే
 *‘గ్రోత్ మైండ్‌సెట్’* అంటుంది. *కరోల్ డ్వెక్ రీసెర్చ్ ప్రకారం, నేర్చుకుంటా అనే మనిషే చివరికి నిలబడతాడు.*

3. *స్థిరత్వం, అంటే ‘టిక్’ చేసే గుణం✓*

భగవద్గీతలో కృష్ణుడు అంటాడు -
*“యోగస్థః కురు కర్మాణి”*. *ఫలితం మీద ఆశ లేకుండా పని చేసేవాడే యోగి.*

*బాగుపడే మనిషి రోజూ అదే పని, అదే సమయానికి చేస్తాడు. మూడ్ బాగుంటే చేస్తా, లేకుంటే లేదు అనేవాడు ఎక్కడికీ వెళ్లడు.*

*ఒక ఊర్లో ఒకాయన ఉండేవాడు, రోజూ ఉదయం 5 గంటలకు గుడి తుడిచేవాడు. ఎవరూ చూడకపోయినా. ఈ రోజు వాడి పిల్లలు డాక్టర్లు. అదే స్థిరత్వం*.

4. *ఎదుటి వాడి బాగు కోరడం…మనఃపూర్వకంగా*

ఉపనిషత్తుల్లో  *“సర్వే భవంతు సుఖినః”* అంటారు. నేను బాగుపడితే చాలు అనేవాడు ఒంటరిగా మిగిలిపోతాడు.

*బాగుపడే మనిషి తనతో పాటు నలుగురిని లాక్కుపోతాడు.* బిజినెస్‌లో కూడా ఇదే నిజం. కస్టమర్‌కి నష్టం తెచ్చే డీల్ చేసేవాడు తాత్కాలికంగా గెలుస్తాడు, కానీ నిలవడు.

5. *అసౌకర్యాన్ని భరించే శక్తి.*.

*ఆధునిక న్యూరోసైన్స్ చెబుతుంది – బ్రెయిన్ కంఫర్ట్ జోన్‌లో ఉంటే ఎదగదు*.

*బాగుపడే మనిషి కష్టం వచ్చినప్పుడు తప్పించుకోడు.*
*“అబ్బా కష్టంగా ఉంది” అనుకుంటూనే చేస్తాడు.*

*మహాభారతంలో అర్జునుడు యుద్ధం చేయాలంటే వణికిపోయాడు. కానీ నిలబడ్డాడు. ఆ నిలబడటమే బాగుపడే లక్షణం*.

6. *నిజాయితీ, చిన్న విషయాల్లో కూడా*..

పది రూపాయలు దొరికినప్పుడు తిరిగి ఇచ్చేవాడు, పెద్ద డబ్బు వచ్చినప్పుడు కూడా నిజాయితీగానే ఉంటాడు.

పురాణాల్లో హరిశ్చంద్రుడు రాజ్యం పోయినా సత్యం వదల్లేదు. అదే కథ మనకి నేర్పేది.

మరి గుర్తించడం ఎలా?.. ఇప్పుడైతే దుర్భిని పెట్టి వెతకాల్సి వస్తుంది

మనిషిని మాటలతో కాదు, మూడు సందర్భాల్లో చూడు:

1. *వాడికి నష్టం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు?*

2. *ఎవరూ చూడనప్పుడు ఏం చేస్తాడు?*

3. *వాడి కంటే తక్కువ స్థాయిలో ఉన్నోడితో ఎలా మాట్లాడతాడు?*

ఈ మూడు చూస్తే వాడు బాగుపడతాడో, బాగుపడినా నిలబడతాడో అర్థమవుతుంది.

చివరిగా...

*బాగుపడటం అంటే కోట్లు సంపాదించడం కాదు.*

*పడిపోయినా మళ్లీ లేచే గుణం, తప్పు ఒప్పుకునే ధైర్యం, నేర్చుకునే ఆకలి – ఇవే నిజమైన లక్షణాలు.*

*మనిషి బాగుపడతాడో లేదో అనేది వాడి సర్టిఫికెట్లలో కాదు, వాడి రోజువారీ చిన్న నిర్ణయాల్లో రాసి ఉంటుంది.*

*మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లలో ఈ లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయి? గమనించాలి.*
:~ SM.

Thursday, March 26, 2026

ఇక్కడుoది నమో🔥

ఇక్కడుంది మోదీ 💪🔥
హార్మోజ్ నుండి నౌకలు వస్తూనే ఉంటాయి…
గ్యాస్ సిలిండర్ ఇవ్వాళ కాకపోతే రేపు దొరుకుతుంది…
కానీ…
సింహం దొరకదు…

పెట్రోల్ కోసమో… గ్యాస్ కోసమో…
సింహాన్ని వదిలేసి గాడిదను తెచ్చుకోం…

ఇది సాధారణ నాయకత్వం కాదు…
ఇది గర్జించే ధైర్యం…
ఇది దేశ గౌరవం…
ఇది తలవంచని నాయకత్వం…

సరిహద్దుల దగ్గర సైనికుడిలా…
ప్రపంచ వేదికపై సింహంలా…
ప్రపంచానికి పెద్దన్నలా…
శత్రువులకు సింహ గర్జనలా…

తన దేశం కోసం నిలబడే వాడు…
నిజమైన నాయకుడు…
దేశ ప్రయోజనాల కోసం సేవకుడిలా…
సాగుతున్న నిఖార్సైన నాయకుడు…

దేశం కోసం… దేశ ప్రయోజనాల కోసం
వ్యక్తిగత లాభాలు పక్కన పెట్టి…
ప్రజల కోసం నిర్ణయాలు తీసుకునే ధైర్యం…
దేశ గౌరవం కోసం తలవంచని స్వభావం…

సౌకర్యాలు వదిలి…
సంకల్పంతో ముందుకు నడిచే నాయకత్వం…
అది మాటల్లో కాదు, చర్యల్లో కనిపించే దేశభక్తి…
రాజకీయం కాదు… అది బాధ్యత… ధర్మం…

🔥 దేశం కోసం…
🔥 దేశ ప్రయోజనాల కోసం…
జీవించేవాడు నాయకుడు కాదు…
జాతి గర్వం…

అదే
Narendra Modi – The Lion 🦁🔥
🇮🇳 ధైర్యానికి రూపం…
🇮🇳 నాయకత్వానికి నిదర్శనం…
🇮🇳 భారత్ గర్వించే సింహం 🔥

Copied Message 

Tuesday, March 17, 2026

పర్ణశాల @ సాధన కుటీర్

అంతరించి పోతున్న నాటక రంగానికి పునఃజీవం పోయాలనే మహత్తర సంకల్పంతో ముందుకు సాగుతున్న అనంత సాహితీ కళా వేదిక నిజంగా అభినందనీయం👏
ఆదరణీయ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ అనేక వ్యవప్రయాసలను అధిగమిస్తూ, అనేక మందిని ఈ కళా ప్రయాణంలో భాగస్వాములను చేస్తూ అద్భుతంగా రెండు నాటికలను సిద్ధం చేసి ప్రదర్శనలు ఇస్తున్నారు.
శ్రీ దొరవేటి గారి మార్గదర్శకత్వంలో నిరంతర సాధన చేస్తున్న కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు 💐*

ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు, ఇతర వృత్తుల్లో ఉన్నప్పటికీ ప్రవృత్తిగా కళామాత సేవలో తరిస్తున్న ప్రతి ఒక్కరూ నిజంగా ఆదర్శప్రాయులు 🙏

🎭 మొదటి నాటకం: *“అజరామరం” — గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రదర్శనలతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది

🎭 రెండవ నాటకం: *“శ్రీరామ దర్శనం”* — భక్తి, భావం, శ్రద్ధల సమ్మేళనం
రాబోయే శ్రీరామ నవమి నాటికి అందరికీ చేరేలా బృందం పడుతున్న కృషి ఖచ్చితంగా గొప్ప ఫలితాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది ✨
*ఈ నాటకాల అభ్యాసం, రికార్డింగ్‌కు సాధన కుటీర్ వేదిక కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం 🙏*
*తెలుగు భాషను, కళామాతను భవిష్యత్తు తరాలకు అందించే మహత్తర సేవ చేస్తున్న శ్రీ దొరవేటి చెన్నయ్య గారికి మరియు వారి బృందానికి ప్రణామాలు, హృదయపూర్వక అభినందనలు 🌺*
~:సదా వెంకట్, GSF.

DO B4 DIE

ఇది అందరికీ వర్తిస్తుంది.. 
ఆఖరి మజిలీ నిశ్శబ్దపు కేకలు విన్పిస్తున్న వేళ..
బూడిద రంగు పులుముకున్న ఈ లోకం,చెప్పకనే చెబుతోంది.. 
అంతా క్షణభంగురం అని!
ఒకవైపు ఆరని మంటలు..
మరోవైపు మోయలేని కట్టెల బరువు..
జీవిత చక్రంలో ఇదొక చేదు నిజం.
కష్టపడి సంపాదించినా, కోట్లు కూడబెట్టినా,చివరికి మిగిలేది 
ఈ ఐదడుగుల ఆకాశమే..
చేరుకునేది ఈ కాలపు ఒడిలోనే!
నిన్నటి వరకు నవ్విన ముఖం,
నేడు నిశ్శబ్దమై.. 
అగ్నికీలల్లో కలిసిపోతుంటే,
గుండె బరువు ఎక్కక మానదు.
ప్రకృతి ఒడిలో పుట్టి.. ప్రకృతిలోనే కలిసిపోయే ఈ ప్రయాణంలో,
మనం మిగిల్చేది కేవలం 
మంచి జ్ఞాపకాలు.
అందుకే పోయే లోపు ఏమైనా చేయ్. Do Before DIE

Monday, February 16, 2026

శివాజీ విగ్రహావిష్కరణ @ ముచ్చర్ల

   జై భవాని ...... వీర శివాజీ 🚩

చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ మహోత్సవ ఆహ్వానం 
గ్రామం ముచ్చర్ల , కందుకూరు  మండలం రంగారెడ్డి జిల్లా.

తేదీ: 19.02.2026 గురువారం రోజున 
సమయం:  సాయంత్రం 6:30 నిమిషాలకు.

ముఖ్య అతిథి:-  గౌరవ శ్రీ సదా వెంకట్ గారు ( జ్ఞానసరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు )

ముఖ్య వక్త : - గౌరవ శ్రీ వెంకట్ నివాస్ గారు ( తెలంగాణ ప్రాంత గో సేవ ప్రముఖులు)

విశిష్టత అతిథులు :-

1. రేవల్లి రాజు శర్మ గారు ( భక్తి టీవీ కోటి దీపోత్సవం పూజారులు , శ్రీమాతా చండీ ఉపాసకులు )

 2. మెగా మురళి గారు ధ్యానర్షి PPS ( రిటైర్డ్ ఏజీ ఆఫీసర్ )

 _మాననియ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పెద్దలు & విశ్వహిందూ పరిషత్ పెద్దలు ( RSS- VHP )_

_గడప లోపలే కులం_
_గడప దాటితే హిందువులం_

హిందూ బంధువులందరూ ఆహ్వానితులే

🙏🚩🕉️
ఆహ్వానించువారు 
శ్రీకాంత్ మొగిళ్ళ 
చత్రపతి శివాజీ నిర్మాణ కమిటీ - ముచ్చర్ల 
కుమ్మరి వెంకటేష్ ( అధ్యక్షులు ) & సభ్యులు

Monday, January 26, 2026

దైవం యుద్ధం చేయడానికి రాడు

కష్టాన్ని కష్టం గానే ఇష్టపడాలి, ఇష్టాన్ని కూడా కష్టంగానే వదలాలి.
కష్టం అని తెలిసినా కష్టాన్నే ఎంచుకుని,
వంగకుండా… విరగకుండా… 
ఎదిరించి నిలబడాలి.
కష్టం పారిపోవడానికి కాదు, తనని తాను తెలుసుకోవడానికి.*
ఇష్టం విడిచిపెట్టడం ఓటమి కాదు,
ఆత్మ గెలుపు.

*తెలిసీ తెలిసీ భరించే కష్టం బాధ కాదు…                     ఒక సాధన*,
విరగకుండా నిలిచే మనసే
జీవితానికి నిజమైన సమాధానం.

*వంగని ఆత్మకు ఓటమి లేదు*,
*ఎదిరించిన ప్రతి కష్టంలో ఒక కొత్త నేను నన్ను నేను కలుసు కుంటాను* *తెలుసు కుంటాను*✍️

Friday, January 16, 2026

పద్యాల తో రణం

🌹జ్ఞానసరస్వతి పౌండేషన్ ఆధ్వర్యంలో  తెలుగు భాషోపాధ్యాయులు, పద్యాభిమానుల ఆత్మీయ సమ్మేళనం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 తెలుగు భాషామ తల్లి కంఠ సీమనలంకరించిన దివ్య మణిమాల పద్యం.  కావ్యం, శతకం, ప్రబంధం, నాటకం, ఖండకావ్యం మొ॥న ప్రక్రియల ద్వారా వేయి సంవత్సరాలుగా అపారమైన సారస్వతాన్ని మనకందిస్తున్న సాధనం పద్యం. ఇటువంటి *పద్యాన్ని ఆరాధించే, ఆదరించే వారందరూ ఒకచోట కలవాలనే లక్ష్యం తో, తెలుగు భాషను భవిష్యత్తుకు భద్రoగా అందించాలనే ఆశయంతో, విద్యార్థులకు పద్యాల పట్ల అభిరుచిని పెంచడం కోసం "పద్యాల తోరణం"  కార్యక్రమ సమాలోచన కోసం కోసం*..

 *01-02-2026 ఆదివారం* ఉదయం 8:30గంటలకు జరుగనున్న సమావేశానికి  పద్యాభిమానులందరికీ సాదర స్వాగతం. 
*స్థలం:- సాధన కుటీర్, జ్ఞానసరస్వతి ఫౌండేషన్, వీరపట్నం*

*ఈ కార్యక్రమం అభినవ దాశరధి దోరవేటి చెన్నయ్య గారు మరియు తెలుగు ఉపాధ్యాయుల నిర్వహణలో కొనసాగుతుంది*

మరిన్ని వివరాలకు:  
+919704139144,
+919951392714,
+919640755648.

*ఆహ్వానించు వారు*:
🙏🏼సదా వెంకట్ రెడ్డి గారు,  వ్యవస్థాపకులు.
 *జ్ఞానసరస్వతి ఫౌండేషన్*.
9553234351, 9441054351.