Thursday, April 13, 2023

శ్రీరామ నవమి _2019

శ్రీ #సీతారాములకల్యాణo 
జననమేలేని పరమాత్మ లోక క్షేమంకోసం నరజన్మ తీసుకున్నాడు.....
శ్రీరాముని తత్వం, శ్రీరాముడి  గురించి  ఎవరు ఏ రకంగా వర్ణించినా .. వాల్మీకి హృదయం ప్రకారం పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో, ధర్మపాలన ఎలా సాగాలొ తెలియజేసేందుకు అవతరించినవాడు #శ్రీరాముడు.
#రాముడు దేవుడిగా ధర్మాచరణ, ధర్మసంస్థాపన చెయ్యలేదు. మానవునిగా ఈ లోకంలో చరిస్తూ అందరిలో తాను ఒకడై కష్టాలననుభవిస్తూ ప్రపంచానికి మార్గదర్శకుడయ్యాడు. రాముడు సామాన్య మానవునిగా ప్రవర్తించిన సందర్భాలు అనేకం రామాయణంలో కనిపిస్తాయి. దైవత్వం, మానవత్వం కలగలిసి క్రొమ్మెరుగుకులు దిద్దబడిన అవతార పురుషుడు. ధీరోదాత్త నాయకుడిగా ఎల్లలోకాలలోనూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. 

అలాంటి రాముడు ఆదర్శంగా రాజ్యపాలన జరగాలని ఎందుకు కోరుకోరు!!...అందరూ  కోరుకుంటారు. 

పాల్గొన్న  *సీతారామ కళ్యాణ మహోత్సవాలు" 
14.04.2019, ఆదివారం.

1. హరిహర క్షేత్రం, మoచాల,

2. గుడిబండ రామలింగేశ్వర ఆలయం రంగాపూర్..

3. శ్రీ సీతారామలయం, రాచకొండ.
     రాత్రిపూట జరిగే కళ్యాణం.. 

హంపీవిద్యారణ్య పీఠం తరపున పూజ్యశ్రీ #విద్యారణ్యభారతిస్వామిజి ఆశీస్సులతో...

*200 మీటర్ల ఎత్తులో,  300 ఎకరాలలో ఏకశీలపై పరుచుకున్న
 శ్రీశ్రీశ్రీ #గుడిబండరామలింగేశ్వరఆలయం* , #రంగాపూర్ గ్రామం, #మంచాల మం. రంగారెడ్డి జిల్లాలో  జరిగే *సీతారామ కళ్యాణ ఉత్సవానికి*"  *పట్టువస్త్రాలు* అందించబడుతున్నాయి. 

#హంపీపీఠం ద్వారా  మొదటి సారిగా నాకు ఆ ఆవకాశం కలగడం ఆనందంగా  వుంది🙏. ఈ లాంటి కార్యక్రమo నాకు మొదటి సారి.. ఆ ఆలయానికి పట్టు వస్త్రాలు ఇవ్వడం మొదటిసారే.

రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఆలయం ఒక గొప్ప క్షేత్రంగా వెలుగొందుతుంది.
అందరం బాగస్వాములం అవుదాం_మనవంతు సహాకారాన్ని అందిద్దాం.
సాహసం చేసి మొదటిసారి ఆ కోదండరాముడి విషయంలో నాలుగు మాటలు నలుగురిలో పంచుకున్నా. 

No comments:

Post a Comment