FB post of 16.04.2016
రాత్రివేళలో @11pm -12am రాచకొండలో రాములోరి కళ్యాణం కమణీయం ..
పాలకుల పలకరింపు లేదు, అధికారుల మందలింపూ అసలే లేదు....
అయితేం....కారుచీకటిలో... కనీస సౌకర్యాలు మాకేం అవుసరం లేదు...
మాకు, మన కొండకు అండదండగా ఉంటున్న ఆ కోదండ రామునికి మేమే అండగా ఉంటాం, అనుంగులుగా ఉంటాం ... రామ బంటులమవుతాం అని ఆ చుట్టు పక్కల ఊర్లూ, తండాలు వాల్లు ఏకమై నిర్వహించిన కళ్యాణం..... కమణీయంగా, అద్బుతంగా జరిగింది.... రాత్రంతా సీతారాములను కొనియాడుతూ భజనలతో రాచకొండంతా మార్మోగింది.
జయయో... జోహార్లు సోదరులారా .. మీ భక్తికి, మీ శ్రద్దకీ...
ఈ యేడేకాదు.... ఇలా ప్రతియేడు నిర్వహిస్తున్న మీకు .. ఆ రామయ్య ఇంకా శక్తినిచ్చి,, ముందుకాలంలో మరింత వైభవంగా నిర్వహించే శక్తిని అనుగ్రహించాలని బలంగా ఆకాంక్షిస్తూ ....
మన పాలకులకు, అదికారులకు కనివిప్పు కలగాలని కూడా ఆశిద్దాం ..
తెలంగాణకే మణికిరీటం.....ఒకప్పటి పాలనా కేంద్రం ... మన రాచకొండ... పూర్వవైభవం ఆశిద్దాం.
No comments:
Post a Comment