Tuesday, April 4, 2023

GUDI BANDA Temple @Rangapur

FACEBOOK post of 04.04.2019.

చరిత్రకు అందని చైతన్య దీపాలెన్నో... 
అవి అందలేదా, అందుకోలేదా లేక అందించబడలేదా అన్నది అలోచించిస్తూనే.. మన చరితను మనమే రాసుకోవాలి.. సమాజానికి అందివ్వాలి.
అలాంటిదే 300 ఎకరాలలో ఒకే బండపై నిండుగా పరుచుకున్న  #గుడి.. 
అదే *#గుడిబండరామలింగేశ్వరదేవాలయం*, #రంగాపూర్, #మంచాల్ మం. #రంగారెడ్డిజిల్లా. 
హైదరాబాద్ కు ఆమడ దూరంలో ఉన్నా ఆశించినంత అభివృద్ధి జరగని ప్రాంతంలో ఉంది.
చిన్న గ్రామమే అయినా నిండుమనస్సుతో ఊరంతా ఏకమై కొండమీదున్న ఆ దేవ దేవున్ని నిత్యం కొలుస్తున్న వారికి శుభాబినందనలు. 
 ఊరంతా ఏకమై ఉన్నంతలో గొప్పగా నిర్వహించాలని *#శ్రీరామనవమి* ఉత్సవానికి  ఏర్పాట్లు చేస్తున్నారు...
భూమికి 1000 పీట్ల లోతు బోర్లు వేసినా చుక్క నీరు కంటికి కనబడని నేటికాలంలో,  
ఎంతో ఎత్తున మొత్తం బండై పరుచున్న కొండపై ఉన్న చిన్న చిన్న కొనేరుల్లో ఎప్పుడూ ఉండే  నీటిని చూసి ఆ దేవదేవుని ఆశీర్వాదంగా ఆనంద పడుతున్నారు పరిసర గ్రామాల ప్రజలు...
అవుసరాల్లో, ఆపదలో జనాలందరికీ అభయమిచ్చే 
ఆ దేవుడి స్థావరాన్ని ఒక గొప్ప క్షేత్రoగా చేయాలనే నిండు సంకల్పంతో ఉన్నారు. 
 శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్యలు,  పూజ్యశ్రీ #హంపీ విరూపక్ష #విద్యారణ్యభారతి స్వామీజి మార్గదర్శంకోసం ఆశతో చూస్తున్నారు.. 
ఆ ఆశ తప్పక నెరవేరుతుంది.   తప్పక అదో గొప్ప క్షేత్రమూ అవుతుంది. పరిసర ప్రాంతానికి గొప్ప వెలుగునిస్తుంది.

ఆలయాలంటే కేవలం పూజలకు మాత్రమే నిలయాలు కావు.. అవి నిత్య చైతన్య కేంద్రాలు, సామాజిక సమరసతా నిలయాలు, జ్ఞాన బాండాగారాలు, అభాగ్యుల అభయహస్తాలు, అన్నదాన సత్రాలు, ఊర్లను కలిపే సంధానాలు, జాతరలతో జాతిలో చైతన్యం నింపే ప్రేరణా కేంద్రాలు... దేశభక్తిని చాటే ఆవాసాలు.. 
మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు_ ఆ పరంపరను కొనసాగిద్దాం.

#SaveTemples  #RangaPur #RRDist

#GudiBandaTemple

No comments:

Post a Comment