Facebook post of 05.04.2021
ఏడూ కొండలవాడా కనరా మమ్మూ..
నీ నామంబు కొలిసేటి నిరుపేదమూ..
#బండపైకొండకు...అంటే #తిరుపతి నుండి #తిరుమల.
ఏమిటో అదో ఆనందం..
వయసు పెరిగేకొద్ది ఈ సోకులెక్కువైయ్ అన్నట్టుంది కథ😂....ఎవరన్నా ఏమన్నా అనుకోని మనకైతే భలే మజాగా ఉంటది. విమానంలో పోయినా ఆ అనందం రాదు. అదీ ఎండాకాలం, పొద్దు పొద్దునా చల్లటి గాలిలో,
#18కిలోమీటర్లు, వంకర తింకరుల ఘాట్ రోడ్డులో తిరుగుతూ....
కుదిరినప్పుడు రోడ్డు మూలల నుండి కిందికి చూస్తే ఆ లోయల్లో చెట్లూ, కొండలూ... అవకాశం తీసుకొని మద్యలో కాసేపు ఆగి... మల్లా ప్రయాణం మొదలుపెట్టి
రయ్ రయ్ మంటూ #కొండెక్కితే
ఆ కిక్కె వేరప్పా..
తిరుపతి వచ్చిన ప్రతీ సారి ఇలాంటి అవకాశమే కావాలని ఆశిద్దాం🙏.
ఏడు కొండల వాడ వెంకట రమణ గోవిందా...గో వింద....
గోవిందా.....గోవింద..
20 నిమిషాల్లో తిరుపతి నుండి కొండపైకి...
పిలుపించుకునే తీరే వేరయ్యా...
ఓ రెండు రోజులూ కొండమీదే......
తిరుమల గల్లీలన్నీ బైక్ మీద రయ్ రయ్..
ఏమో అంతా నీ లీలయ్యా...
దిమ్మరులం... అల్పానందపరులం..
No comments:
Post a Comment