Sunday, April 30, 2023

I K I G A I gifted by Rajesh

Rajesh_Lakshyam camp-2014 student, resident of Vikarabad district, currently working in Mumbai.
A person who pursues higher education amid many difficulties and has high goals. He is determined to give back to society. He presented this book together after many years..
He said that it will be close to your life, read it sir.. The name of the book is I K I G A I _ the japanese secret to a Long and Happy Life. When to read this book of 195 pages with 9 chapters.
Thank You Rajesh.
2014 లక్ష్యo శిబిరం విద్యార్థి, వికారాబాద్ జిల్లా వాసి, ఉద్యోగరీత్యా ప్రస్తుతం ముంబాయిలో ఉoటున్నాడు.
అనేక ఇబ్బందుల మధ్య ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత లక్ష్యాలను కలిగినవాడు. తను ఎదినాక సమాజానికి తిరిగి ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్నాడు. చాన్నాళ్ళ తరువాత కలిసి ఈ పుస్తకాన్ని అందజేశాడు..
మీ జీవితానికి దగ్గరగా ఉంటుంది, చదవండి సార్ అని అన్నాడు.. 
పుస్తకo పేరు I K I G A I _ the japanese secret to a Long and Happy Life.
9 చాప్టర్ ల తో 195 పెజీలున్న ఈ పుస్తకం ఎప్పుడు చదవాలో.



Saturday, April 22, 2023

భగవద్గీత _ Bhagavadgeetha

Facebook post of 23.04.2023
#Bhagavadhgeetha. #భగవద్గీత
పవిత్ర గ్రంథమని పూజాగదిలో పెట్టి పూజించడానికి కాదు #భగవద్గీత .
సారంతో గీతను చదివి తెలుసుకుంటే మనిషి పరిపూర్ణుడు అవుతాడు...#సౌశీల్యవంతుడవుతాడు..
వ్యక్తినిర్మాణం జరిగి #దేశం #ప్రగతిప్రథంలో  ముందుంటుంది..
గీత... మనిషి ప్రశాంతతకో, దేవుని స్థుతికోసమో కాదు..  వ్యక్తికి ధైర్యాన్ని, బలాన్ని కూడా ఇచ్చి కర్తవ్యాన్ని పరిపూర్ణంగా తెలుపుతుంది...
ఇది #నిద్రపుచ్చేపుస్తకంకాదు. అందర్నీ కర్తవ్యనిర్వహణలో ఇంకా ఎక్కువ బాధ్యతతో, ఒక #ధ్యేయంతో #సామాజికఅభివృద్దికి నిర్ధిష్టమైన నిర్ణయాలను తీసుకునేలా చేస్తుంది..
ఎందుకంటే గీత అన్నిరకాల బోదనల లాగ దేవాలయాలలోనో, అడవిలోనో, ప్రశాంతమైన ప్రదేశంలోనో చెప్పబడలే... #యుద్ధరంగంలో చెప్పబడింది. కల్లోలంగా ఉన్న ప్రదేశంలో బోధించబడింది. అక్కడ సన్నివేశం చాలా బీకరమైనది. చెప్పిన వ్యక్తి అసమానమైన #బలం, #కారుణ్యం ఉండి సృష్టికే కారకమైనవాడు.
పైకా ఇంకోక అసమానమైన  వ్యక్తి ఐన అర్జునిడికి బోధించబడింది..
:~ #స్వామిరంగనాథనంద.

పఠిద్దాం... పాటిద్దాం... ఆచరిద్దాం.

ఎప్పుడో 25 ఏండ్ల క్రితం , పసివయసులో #తాత బలవంతంగా చదవడం నేర్పిన కారణంగా కొంత అబ్బింది. అప్పుడు #18అద్యాయాలు కంఠతహా వచ్చేవి. ఇప్పుడు మల్లీ మొదలెడితే కొంత కొత్తగా ఉంది. అక్కడక్కడ కొన్ని ఉచ్చారణ దోషాలు దొర్లుతున్నాయి. సరిచేసుకుందాం..
మల్లీ మొదలెట్టాం రోజూ 3 చొప్పున.
 కరోనా కాలంలో మల్లీ పూర్వవైభవం సాధిద్దాం..
Repeatedly
#Bhagavadhgeetha @ #LOCKDOWN Time

Shelter at Sadhana Kuteer

Saturday, April 15, 2023

ధర్మం కోసం శాస్త్రం -శస్త్రం

కాషాయo కట్టిన వాళ్ళంతా కమండలం పట్టి ముక్కు మూసుకుని ధ్యానం చేయాలి కదా ఇదేంది ఈయన ఇట్లా కత్తి కట్టి కచరా సాఫ్ చేస్తున్నాడు అనే అనుమానం రావడం సహజమే.. 
కానీ శాస్త్రం స్పష్టంగా చెప్పింది
 ఇదం శాస్త్రం - ఇదం శస్త్రం అని.. 
అంటే ధర్మాన్ని అధర్మం నాశనం చేస్తున్నప్పుడు దర్మంకోసం శాస్త్రంలో దీర్ఘం మాత్రం పక్కన్న పెట్టి శస్త్రం పట్టుమన్నది. కాషాయం అంటే త్యాగానికి, శౌర్యానికి ప్రతీక అని తెలుసుoడాలి లేదా తెలుసుకోవాలి..

🚩ధర్మం  తప్పదు కత్తుల వేట;
💥💥
తప్పు ఒప్పేదో సంహారం తరువాత..
రణమున భగవద్గీత, 
చదివింది మన గత చరిత;🚩
రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంట..


రాచకొండలో రామకళ్యాణం @2016








FB post of 16.04.2016 

రాజ(చ)కొండలో ""రామ కళ్యాణం"" కమణీయం:
రాత్రివేళలో @11pm  -12am  రాచకొండలో రాములోరి కళ్యాణం కమణీయం   ..

పాలకుల పలకరింపు లేదు, అధికారుల మందలింపూ అసలే  లేదు....
అయితేం....కారుచీకటిలో... కనీస సౌకర్యాలు మాకేం అవుసరం లేదు...
మాకు, మన కొండకు అండదండగా ఉంటున్న ఆ కోదండ రామునికి మేమే అండగా ఉంటాం, అనుంగులుగా ఉంటాం ...  రామ బంటులమవుతాం అని ఆ చుట్టు పక్కల ఊర్లూ, తండాలు వాల్లు ఏకమై నిర్వహించిన కళ్యాణం..... కమణీయంగా, అద్బుతంగా జరిగింది.... రాత్రంతా  సీతారాములను కొనియాడుతూ భజనలతో రాచకొండంతా మార్మోగింది.  
జయయో... జోహార్లు  సోదరులారా .. మీ భక్తికి, మీ శ్రద్దకీ... 
ఈ యేడేకాదు....  ఇలా ప్రతియేడు నిర్వహిస్తున్న మీకు .. ఆ రామయ్య ఇంకా శక్తినిచ్చి,,  ముందుకాలంలో మరింత వైభవంగా నిర్వహించే శక్తిని   అనుగ్రహించాలని బలంగా ఆకాంక్షిస్తూ ....
మన పాలకులకు, అదికారులకు కనివిప్పు కలగాలని కూడా ఆశిద్దాం ..
   
తెలంగాణకే మణికిరీటం.....ఒకప్పటి పాలనా కేంద్రం ... మన రాచకొండ... పూర్వవైభవం ఆశిద్దాం.

Thursday, April 13, 2023

శ్రీరామ నవమి _2019

శ్రీ #సీతారాములకల్యాణo 
జననమేలేని పరమాత్మ లోక క్షేమంకోసం నరజన్మ తీసుకున్నాడు.....
శ్రీరాముని తత్వం, శ్రీరాముడి  గురించి  ఎవరు ఏ రకంగా వర్ణించినా .. వాల్మీకి హృదయం ప్రకారం పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో, ధర్మపాలన ఎలా సాగాలొ తెలియజేసేందుకు అవతరించినవాడు #శ్రీరాముడు.
#రాముడు దేవుడిగా ధర్మాచరణ, ధర్మసంస్థాపన చెయ్యలేదు. మానవునిగా ఈ లోకంలో చరిస్తూ అందరిలో తాను ఒకడై కష్టాలననుభవిస్తూ ప్రపంచానికి మార్గదర్శకుడయ్యాడు. రాముడు సామాన్య మానవునిగా ప్రవర్తించిన సందర్భాలు అనేకం రామాయణంలో కనిపిస్తాయి. దైవత్వం, మానవత్వం కలగలిసి క్రొమ్మెరుగుకులు దిద్దబడిన అవతార పురుషుడు. ధీరోదాత్త నాయకుడిగా ఎల్లలోకాలలోనూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. 

అలాంటి రాముడు ఆదర్శంగా రాజ్యపాలన జరగాలని ఎందుకు కోరుకోరు!!...అందరూ  కోరుకుంటారు. 

పాల్గొన్న  *సీతారామ కళ్యాణ మహోత్సవాలు" 
14.04.2019, ఆదివారం.

1. హరిహర క్షేత్రం, మoచాల,

2. గుడిబండ రామలింగేశ్వర ఆలయం రంగాపూర్..

3. శ్రీ సీతారామలయం, రాచకొండ.
     రాత్రిపూట జరిగే కళ్యాణం.. 

హంపీవిద్యారణ్య పీఠం తరపున పూజ్యశ్రీ #విద్యారణ్యభారతిస్వామిజి ఆశీస్సులతో...

*200 మీటర్ల ఎత్తులో,  300 ఎకరాలలో ఏకశీలపై పరుచుకున్న
 శ్రీశ్రీశ్రీ #గుడిబండరామలింగేశ్వరఆలయం* , #రంగాపూర్ గ్రామం, #మంచాల మం. రంగారెడ్డి జిల్లాలో  జరిగే *సీతారామ కళ్యాణ ఉత్సవానికి*"  *పట్టువస్త్రాలు* అందించబడుతున్నాయి. 

#హంపీపీఠం ద్వారా  మొదటి సారిగా నాకు ఆ ఆవకాశం కలగడం ఆనందంగా  వుంది🙏. ఈ లాంటి కార్యక్రమo నాకు మొదటి సారి.. ఆ ఆలయానికి పట్టు వస్త్రాలు ఇవ్వడం మొదటిసారే.

రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఆలయం ఒక గొప్ప క్షేత్రంగా వెలుగొందుతుంది.
అందరం బాగస్వాములం అవుదాం_మనవంతు సహాకారాన్ని అందిద్దాం.
సాహసం చేసి మొదటిసారి ఆ కోదండరాముడి విషయంలో నాలుగు మాటలు నలుగురిలో పంచుకున్నా. 

Wednesday, April 12, 2023

Dr.B.R.అంబేద్కర్ సాహిత్యం


డా. అంబేద్కర్ జీవితం త్యాగమయం, కర్మమయం, తపోమయం. ఆయన పలుకు, ఆయన వ్యవహరణ తీరు, ఆయన నాయత్వం లక్షణం, ఆయన సంఘటనా దక్షత, అందరినీ కలుపుకుంటూ ముందుకుపోవడంలో ఆయన చూపిన ప్రతిభ, ఆయన పాండిత్యం - అన్నీ విలక్షణమైనది. అట్టడుగు కుటుంబంలో జన్మించి తన సంకల్ప బలంతో మహామనిషిగా ఎదిగిన వ్యక్తి ఆయన.
అంబేద్కర్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించి ఆయన వ్యక్తిత్వాన్ని,ఆయన కార్యాన్ని, ఆయన సిద్ధాంతాలను సమాజానికి తెలియ జెప్పడంలో సరైన సాహిత్యాన్ని ఎన్నుకోవాలి..
ఆ ప్రయత్నంలో నాచే కొంత సాహిత్యం చదించాలనుకున్న మిత్రులకు ధన్యవాదాలు... చదువుదాం, కొంత.. ఇంకొoత.. సాధ్యమైనoత...పూర్తిగా..

JALIYANWALA BAGH Visit @2019

100+4 year for
#JALIYANWALABAGH Incident
#Vandhematharam #BharathmathakiJai
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట. ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.ఈ దారుణ ఘటన జరిగి నేటికి 100 సంవత్సరాలు..

ఆ స్థలాన్ని సందర్శించి అమరులకు ఆత్మ నివాళులు అర్పించి, వారి పోరాట పటిమకు వందనం చేసే అవకాశం దక్కింది..

ఇంక్విలాబ్ జిందాబాద్... భారత్ మాతాకి జై.

Monday, April 10, 2023

Education for Nation @ SCHOOL

FACEBOOK post of 11.04.2019.
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

Thanks for your Invitation as a Spl Guest to Farewell party of Krishaveni Talent School @ Yamjal
#EducationwithCharacter #EducationwithMorality #EducationForNation

పాఠశాల విద్యార్థుల అభినందన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా అహ్వానించినందుకు ధన్యవాదాలు. @కృష్ణవేణి విద్యాలయం, తుర్కయంజాల్. 
9 రాష్ట్రాలలో  400 శాఖలుండి 5000వేల మంది సిబ్బందితో సుమారు 125000 మంది విద్యార్థులకు ప్రతి ఏటా విద్యాబుద్దులు నేర్పుతున్న విద్యాసంస్థ.. కృష్ణవేణి.

ఎక్కడకెల్లినా చెప్పెదోక్కటే..

ఉపాద్యాయులకు: గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి_ తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి...
  

విద్యార్థులకు: మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి, మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి.. అందుకే ప్రపంచం మీకోసం ఎదురుచూసేలా మీరెదగాలి..

అల్లిదండ్రులకు::  చదువు, సంస్కారంతో పాటు ఎదిగే పిల్లలకు సామాజిక భాద్యత కూడ చాలా అవుసరం.. అందుకు అమ్మఒడి మొదటి బడి.. అందుకే పిల్లలను మన కుటుంబంతో పాటు సమాజానికి భాద్యతగా ఉండేలా ప్రోత్సహించాలి.

చెప్పేది ఈ మూడు ముక్కలే.
#EducationwithCharacter #EducationForNation   #MoralValues

Sunday, April 9, 2023

వివేకవాణి శిరసా నమామి

నమ్మిన కార్యంకోసం/ సంస్తకోసం కార్యకర్త ఎలా పనిచేయాలి అనే విషయంలో హనుమాన్ నీ ఆదర్శంగా తీసుకోమన్న స్వావిన. 
*వివేకవాణి శిరసా నమామి*
 
నన్ను గుర్తించకోయినా పరవాలేదు, నా భావాలను అంగీకరిస్తే చాలు, కామకాoఛనాలను జయించిన సాధువులైనా కీర్తి, ప్రతిష్టల వలలో చిక్కుకుపోవడం జరుగుతుంది. సంపూర్ణమైన నిష్కామకర్మ చేయాలి. ప్రజలు మనను ఏ విధంగానైనా భావించవచ్చు, నిందించవచ్చు, ప్రశంసిoచవచ్చు  కానీ మన ఆదర్శాలను వదలకుండా పనిచేయాలి.

మహావీర హనుమాన్ ని మీ ఆదర్శంగా స్వీకరించాలి. రామజ్ఞతో మహాసాగరాన్ని మరణం అన్న ఆలోచన లేకుండా అవలీలగా దాటాడు. పరిపూర్ణమైన ఇంద్రియనిగ్రహం, అద్భుతమైన ధీశక్తి కలిగిన మహావీరుడు. అటువంటి గొప్ప సేవ, ఆదర్శాలు ఆధారంగా మీ జీవితాలు నసుపుకోవాలి. అప్పుడు మెల్లమెల్లగా మిగిలిన ఆదర్శాలనీ మీ జీవితాలలో వ్యక్తమవుతాయి. గురువుపట్ల సంపూర్ణ విధేయత, బ్రహ్మచర్యం.. ఇదే విజయ రహస్యం. ప్రపంచాన్ని అబ్బురపరిచే సేవాతత్పరత, సింహ సదృశ శౌర్యం, రామకార్యానికై ప్రాణత్యాగానికైనా వెనకాడని ధీరత్వం, రాముని సేవపట్ల తప్ప ఇతర విషయాలపై నిరాసక్తత, బ్రహ్మ, శివ పదాన్నైనా పొందడానికి విముఖత, రామ కార్యాచరణే జీవిత లక్ష్యంగా గల మహావీరుడి లాంటి హృదయ పూర్వక భక్తి కావాలి.
:~ స్వామీ వివేకానంద.

Thursday, April 6, 2023

చైత్ర పౌర్ణమి@హనుమాన్ విజయోత్సవం

లంకలో రావణాసుర వధ అనంతరం విభీషణుడికి రాజ్య పట్టాభిషేకం గావించి 
శ్రీరామచంద్రుడు సీతమ్మ, లక్ష్మణ, హనుమత్ సమేతంగా అయోధ్యకు చేరుకుంటాడు. 
చైత్ర శు.దశమి నాడు రాముడి పట్టాభిషేకం జరుగుతుంది..
రావణుడిని జయించి ధర్మరక్షణ గావించిన ఆనందం, శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైన హనుమంతుడు  వేలాది సహచర వానరులతో కలిసి చైత్ర పున్నమి నాడు అయోధ్యా నగరంలో విజయ మహా యాత్ర పేరుతో పెద్ద శోభాయాత్రను నిర్వహించాడట..
ఆనాడు హనుమంతుడు నిర్వహించిన శోభాయాత్రను ఈ కలియుగంలో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణమి నాడు మనం వీరహనుమాన్ విజయ యాత్ర పేరుతో నిర్వహించుకుంటున్నాము.

  ఈ ఉత్సవ లక్ష్యం సమాజసంఘటన, ధర్మ రక్షణ..

భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఈ రోజున హనుమంతుడి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు..

Wednesday, April 5, 2023

హనుమాన్ విగ్రహం దర్సనం@నర్కుడ

 
Facebook Post of 06.04.2022
నవవ్యాకరణ కోవిదుడు, సర్వ శక్తిమంతుడు, 
అతి బలవంతుడు, కార్యదక్షుడు,
దృఢ సంకల్పుడు వంటి అనేక సుగుణాల సమ్మిళితుడు  అయినప్పటికీ ధర్మానికి దాసుడైన హనుమాన్ జీవితమే మనకు #ఆదర్శం, #ప్రేరణ...

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తనకిమ్ వద
రామదూత కృపాo సిoదో మమకార్యం సాధయ ప్రభో🙏*.
నర్కుడ గ్రామంలో #అభయాంజనేయ స్వామి విగ్రహావిష్కరణలో #వీరపట్నంఅఖండ బృందం..

జైభజరంగభలీ- తోడ్ దుష్మన్ కి నలీ*.
Hanuman 

Veerapatnam Akhanda

Tuesday, April 4, 2023

బండిపై తిరుమల కొండకు


Facebook post of 05.04.2021

ఏడూ కొండలవాడా కనరా మమ్మూ..
 నీ నామంబు కొలిసేటి నిరుపేదమూ..
#బండపైకొండకు...అంటే #తిరుపతి నుండి #తిరుమల.
.వచ్చిన ప్రతీసారి ఇదో అలవాటుగా మారింది, షోకయ్యిందిగా😀😀....
ఏమిటో అదో ఆనందం..
వయసు పెరిగేకొద్ది ఈ సోకులెక్కువైయ్ అన్నట్టుంది కథ😂....ఎవరన్నా ఏమన్నా అనుకోని మనకైతే భలే మజాగా ఉంటది. విమానంలో పోయినా ఆ అనందం రాదు.  అదీ ఎండాకాలం, పొద్దు పొద్దునా చల్లటి గాలిలో, 
#18కిలోమీటర్లు, వంకర తింకరుల ఘాట్ రోడ్డులో తిరుగుతూ....
కుదిరినప్పుడు రోడ్డు మూలల నుండి కిందికి చూస్తే ఆ లోయల్లో చెట్లూ, కొండలూ... అవకాశం తీసుకొని మద్యలో కాసేపు ఆగి... మల్లా ప్రయాణం మొదలుపెట్టి
రయ్  రయ్ మంటూ #కొండెక్కితే 
ఆ కిక్కె వేరప్పా..
తిరుపతి వచ్చిన ప్రతీ సారి ఇలాంటి అవకాశమే కావాలని ఆశిద్దాం🙏.

ఏడు కొండల వాడ వెంకట రమణ గోవిందా...గో   వింద....
గోవిందా.....గోవింద..

20 నిమిషాల్లో తిరుపతి నుండి కొండపైకి...
ఏమయ్యా వెంకయ్యా నీవు 
పిలుపించుకునే  తీరే  వేరయ్యా...

ఓ రెండు రోజులూ కొండమీదే......
 తిరుమల గల్లీలన్నీ బైక్ మీద రయ్ రయ్..
ఏమో అంతా నీ లీలయ్యా...
అయినా మా లాంటివారు యాడున్నా ఒకటేగా
   దిమ్మరులం... అల్పానందపరులం..

ఇద్దరమ్మల దర్శనం @28th March

ఎన్నాల కెన్నాల్ల కెన్నాల్లాకూ...
ఏడుపాయల దుర్గమ్మ దరి చెంతకు...
ఏండ్ల తరబడి వినడమే కానీ దర్శనం చేయకుండే ఏడుపాయల దుర్గమ్మ ఆలయం @మెదక్.
వాళ్ళ పిలుపు ఉండాలే కానీ.. అన్ని అడ్డంకులు అధిగమించి అల్గగా పోవచ్చు.
ఇదో నా ఏడుపాయల దుర్గమ్మ దర్శనం అట్లనే జరిగింది..
అందునా ఇద్దరమ్మల దర్శనం ఒకేసారి, అదీకూడా అద్భుతమైన అతిథి మర్యాదలతో జరగడం అదృష్టo.
అందునా ఆ రోజున @28th March  జరిగిన అన్ని కార్యాలు ఆకస్మికంగా, అద్భుతంగా జరిగినవే.
అందుకే అంటారు వాళ్ళ పిలుపు ఉంటే అన్ని ఆటంకాలు తోసేసి అద్భుత దర్శనం ఇస్తారని.
ఆ రోజు ఎడుపాయల దుర్గమ్మ దర్శనానికి ముందే నూతన ప్రతిష్ట జరిగిన సరస్వతి మాత దర్శనం ఆ వెంటనే ఏడుపాయల దుర్గమ్మ ఆలయంలో అద్భుత దర్శనం జరిగింది..
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే..

GUDI BANDA Temple @Rangapur

FACEBOOK post of 04.04.2019.

చరిత్రకు అందని చైతన్య దీపాలెన్నో... 
అవి అందలేదా, అందుకోలేదా లేక అందించబడలేదా అన్నది అలోచించిస్తూనే.. మన చరితను మనమే రాసుకోవాలి.. సమాజానికి అందివ్వాలి.
అలాంటిదే 300 ఎకరాలలో ఒకే బండపై నిండుగా పరుచుకున్న  #గుడి.. 
అదే *#గుడిబండరామలింగేశ్వరదేవాలయం*, #రంగాపూర్, #మంచాల్ మం. #రంగారెడ్డిజిల్లా. 
హైదరాబాద్ కు ఆమడ దూరంలో ఉన్నా ఆశించినంత అభివృద్ధి జరగని ప్రాంతంలో ఉంది.
చిన్న గ్రామమే అయినా నిండుమనస్సుతో ఊరంతా ఏకమై కొండమీదున్న ఆ దేవ దేవున్ని నిత్యం కొలుస్తున్న వారికి శుభాబినందనలు. 
 ఊరంతా ఏకమై ఉన్నంతలో గొప్పగా నిర్వహించాలని *#శ్రీరామనవమి* ఉత్సవానికి  ఏర్పాట్లు చేస్తున్నారు...
భూమికి 1000 పీట్ల లోతు బోర్లు వేసినా చుక్క నీరు కంటికి కనబడని నేటికాలంలో,  
ఎంతో ఎత్తున మొత్తం బండై పరుచున్న కొండపై ఉన్న చిన్న చిన్న కొనేరుల్లో ఎప్పుడూ ఉండే  నీటిని చూసి ఆ దేవదేవుని ఆశీర్వాదంగా ఆనంద పడుతున్నారు పరిసర గ్రామాల ప్రజలు...
అవుసరాల్లో, ఆపదలో జనాలందరికీ అభయమిచ్చే 
ఆ దేవుడి స్థావరాన్ని ఒక గొప్ప క్షేత్రoగా చేయాలనే నిండు సంకల్పంతో ఉన్నారు. 
 శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్యలు,  పూజ్యశ్రీ #హంపీ విరూపక్ష #విద్యారణ్యభారతి స్వామీజి మార్గదర్శంకోసం ఆశతో చూస్తున్నారు.. 
ఆ ఆశ తప్పక నెరవేరుతుంది.   తప్పక అదో గొప్ప క్షేత్రమూ అవుతుంది. పరిసర ప్రాంతానికి గొప్ప వెలుగునిస్తుంది.

ఆలయాలంటే కేవలం పూజలకు మాత్రమే నిలయాలు కావు.. అవి నిత్య చైతన్య కేంద్రాలు, సామాజిక సమరసతా నిలయాలు, జ్ఞాన బాండాగారాలు, అభాగ్యుల అభయహస్తాలు, అన్నదాన సత్రాలు, ఊర్లను కలిపే సంధానాలు, జాతరలతో జాతిలో చైతన్యం నింపే ప్రేరణా కేంద్రాలు... దేశభక్తిని చాటే ఆవాసాలు.. 
మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు_ ఆ పరంపరను కొనసాగిద్దాం.

#SaveTemples  #RangaPur #RRDist

#GudiBandaTemple