Monday, December 27, 2021

#దండయుద్ధ


 చాన్నాళ్ల తరువాత అలా ఓ సారి దండయుద్ధ..
అప్పటికప్పుడు అవసరం అనిపించి చేయాల్సివచ్చింది.. అదీ అడ్డపంచతోనే.. ఓ 20 ఏoడ్ల క్రితం ఇష్టంగా, విశేషంగా చేసేవాళ్ళం.... 
అదోరకమైన శారీరక వ్యాయామం, ఏమాత్రం ఖర్చులేని ఓ యుద్ధకల.. గన్నులు,రాకెట్లు వాడే ఈ కాలంలో ఈ దండయుద్ధతో  ఏ మాత్రం ఆవసరం లేదు...కానీ ఆత్మవిశ్వాసం విపరీతంగా పెంచుతుoది.. నిరంతర అబ్యాసం అవసరం.

Wednesday, December 8, 2021

అవి వీర మరణాలు

మనం...
వ్యాధులు ముదిరితేనో
తెల్లవారుజాము నిద్రలోనో
హాస్పిటల్ బెడ్ పైనో
శ్వాస విడుస్తాం...

యోధులు కార్యక్షేత్రంలోనో యుద్ధరంగంలోనో దేశంకోసం ఆరాటపడుతూ పోరాడుతూ ఛిద్రమైన దేహాలతో అమరులవుతారు ...
వారికి ఉషోదయపు ఉల్లాసాలుండవు
సాయంకాలపు విరామాలుండవు
సాధారణ మరణాలూ ఉండవు...
     *వారివి వీర మరణాలు*

జోహార్ జనరల్ బిపిన్ రావత్ & All

Monday, December 6, 2021

స్నేహం / బంధం.

ధర్మో రక్షతి రక్షిత: అని చదివి, కంఠస్తం చేసి ఇంకో పదుగురికి ఉచితంగా చెప్పమని కాదు.... ఆ అక్షరాలను పెద్ద ప్లెక్సీ చేసి గూట్లో పెట్టుకుని రోజూ అగరొత్తులు ముట్టిస్తూ పూజ చేయమని  అసలే కాదు...
మంచిని కాపాడటం కోసం, ధర్మాన్ని రక్షించడంకోసం దైవాన్ని నిందిచకా...  ఎంతకైనా తెగించమని అర్థం.   ధర్మాన్ని కాపాడే క్రమంలో 99℅ మన ప్రయత్నానికి   ఆ దైవం 1% కలిపి పరిపూర్ణం చేస్తాడని అర్థం.

Sunday, December 5, 2021

*ధర్మో రక్షతి రక్షిత:

ధర్మో రక్షతి రక్షిత: అని చదివి, కంఠస్తం చేసి ఇంకో పదుగురికి ఉచితంగా చెప్పమని కాదు.... ఆ అక్షరాలను పెద్ద ప్లెక్సీ చేసి గూట్లో పెట్టుకుని రోజూ అగరొత్తులు ముట్టిస్తూ పూజ చేయమని  అసలే కాదు...
మంచిని కాపాడటం కోసం, ధర్మాన్ని రక్షించడంకోసం దైవాన్ని నిందిచకా...  ఎంతకైనా తెగించమని అర్థం.   ధర్మాన్ని కాపాడే క్రమంలో 99℅ మన ప్రయత్నానికి   ఆ దైవం 1% కలిపి పరిపూర్ణం చేస్తాడని అర్థం.

Saturday, November 27, 2021

అల్పత్వం, అమాయకత్వం..మూర్ఖత్వం

రాజకీయ క్షేత్రంలో ఉండి పాలకుడివైనంత మాత్రాన...మిగతా రంగాలైన @ అద్యాత్మిక, సామాజిక & ఇతర రంగాలనూ శాసించాలకోవడం అల్పత్వం,అమాయకత్వo,మూర్ఖత్వం... 
పరిమితుల్లో ఉండి,పరిపక్వతతో మసులుకోవడం నీ క్షేత్రానికే శోభనిస్తది..
కాదు, కూడదు అంటే చరిత్ర చదవుకోవాలి మరి. .

Wednesday, November 17, 2021

HAMPI trip_ 2020

అవును ఇక్కడి #ప్రతీరాయి #మౌనంగా మాట్లాడుతుంది....
 #చరిత్రకు #మౌనసాక్షిగా నిలుస్తాయి ఇక్కడి రాళ్లు.. ..
ఇక్కడ రాళ్లలో మహత్తు ఉన్నది.....అవి మార్గాలు  చూపుతాయి.. 
త్రేతాయుగపు సుందర రామాయణ చరితను చరిత్రకు అందించే అద్బుతాలు ఆ రాళ్లలోనే నిగూడంగా నిక్షిప్తం....
   #భారతీయ గత వైభవ ఆనవాళ్ళను గుర్తుచేస్తూ భవిష్యత్తుకు దారిచూపుతాయి... అవును ఇక్కడి రాళ్ళకు రతనాలతో సమాన గుర్తింపు ఉండెనట...
#గుడులను_ గుడుల్లోని #దేవతల ఆశీర్వాదాలను, #శాస్త్రాలు_శాసనాలు, నదులు-జీవనదులకు,
దారులు_రహదారులన్నిటికీ ఇక్కడి రాళ్లే దివిటీలు..
ఇక్కడ నేలపై పారే నీటికే కాదు, కొండలపై #జీవనదులుల్లా పారే నీటికీ ఇక్కడి రాళ్ళే  
 సజీవ సాక్షాలు..రతనాల రాశుల వ్యాపారాలకు ఇక్కడి రాళ్ళే సిపాయిలుగా నిలిచాయంట....
ఈ రాల్లను రమణీయంగా  మలిచేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయక,  ఆ బండరాళ్ళను బద్రపరచి, సజీవ సాక్షులుగా మలుచుటకు జీవితాలను దారపోసిన ఆ #కళాహృదయాలు ఎంత గొప్పవో......

అందుకే ఇక్కడ ప్రతీ రాయి మౌనంగా మాట్లాడుతుంది..  చరిత్రకు 
#మౌనసాక్షిగా నిలుస్తుంది.

రాల్లకే కాదు ఇక్కడి జంతువులకూ, ఈ నేల పట్ల శ్రద్ద ఎక్కువే అని చరిత్ర చెప్పిన పాఠం. ఇక్కడి కుందేళ్ళు వేటకుక్కలను సైతం తరిమితే.....  
ఆ స్ఫూర్తితోనే #విద్యారణ్యస్వామిజి భారతజాతి #పూర్వవైభవం కోసం ప్రతిన చేసి, #విజయనగరసామ్రాజ్యానికి బీజం వేశాడు..
అలాంటి ఈ నేలను  ఎన్నిసార్లు సందర్సించినా.. ప్రతీసారి కొత్త శక్తిని తోడిచ్చి పంపుతుంది...మౌనంగానే గత చరిత్రను నెమరేయిస్తాయి......
ఆ రమణీయ రత్నాల రాళ్ళ నగరమే #హంపీక్షేత్రం, #కర్ణాటక....
ఇప్పటికైనా #భారతప్రభుత్వo ఈ క్షేత్ర #గతవైభవాన్ని గుర్తించి, రేపటి #చరిత్రకు సజీవ సాక్షంగా నిలుపవచ్చు.

#HampiTrip2020 #HAMPI  #హంపీ 

#PM0 #govtofindia #IndianHeritage

https://www.facebook.com/100002143544899/posts/3461467003934717/


Sunday, October 17, 2021

పని-సామర్ధ్యం

భుజానికెత్తుకున్న పనిని సంపూర్ణం చేయడానికి వేయి కారణాలను వెతుకు, కానీ తప్పించుకోవడానికి ఒక్క కారణం కూడా మనసులోకి రానీయకు.. అప్పుడే విజయమ్మ దీవిస్తది.

విజయలక్ష్మి దీవెన

భుజానికెత్తుకున్న పనిని సంపూర్ణం చేయడానికి వేయి కారణాలను వెతుకు, కానీ తప్పించుకోవడానికి ఒక్క కారణం కూడా మనసులోకి రానీయకు.. అప్పుడే విజయమ్మ దీవిస్తది.

జాతిమరిచిన వీరుడు- చరిత్ర కెక్కని యోధుడు సర్దార్ #ఉద్దాంసింగ్.

#జాతిమరిచినవీరుడు #ఉద్దాంసింగ్  #UddamSingh

నేటి తరానికి  అస్సలు తెలియని అంశం...

#జలియన్ #వాళాబాగ్ లో 13 ఆప్రిల్, 1919 రోజున శాంతియుతంగా నిరసన తెలుపుతున్న   భారతీయ సిక్కు కుటుంబాలను ( 2000వేల మందికి పైగా) పిట్టల్లాగా  కాల్చిన సంఘటనను ఎలా మర్చిపోగలం.  కాకుంటే ఈ విషయం నేటితరం వారికి చాలా మందికి తెలియక పోవచ్చు. తెలుసుకోవలసిన అవసరం, తెలపాల్సిన అవసరం ఉన్నది.

ఆ సంఘటనను కల్లకు అద్దినట్టు చూపున చిత్రం #సర్దార్ #ఉద్దాం.  దేశం మీద గౌరవం ఉన్నవారందరూ తప్పక చూడాల్సిన చిత్రం.

  #జలియన్ #వాలాభాగ్ సంఘటన ద్వారా మనస్సు చలించిన #ఉద్దాంసింగ్ పగతో ఆరేళ్ల పాటు కాపు కాసి, ఆ కాల్పులకు కారకుడైన  #General #Dyer ని  లండన్ లో కాల్చిచంపడం, ఆ తరువాత #ఉద్దాంసింగ్ #UddamSingh అనుభవించిన చిత్రహింసలు, అతని #ఉరి తీసే వరకు సాగిన తతంగం అద్బుతంగా చిత్రీకరించారు...
మన స్వేశ్చా వాయువులకోసం అంతటి చిత్రహింసలను భరిస్తూ, నవ యవ్వనంలో #నవ్వుతూ.. #నవ్వుతూ #దేశంకోసం #ప్రాణాలొదిలిన 
#వారిత్యాగాల #పునాదుల మీద మనం #జీవిస్తున్నాం, విలాసాలను #అనుభవిస్తున్నాం.
 వారి త్యాగం వృదా కారాదు.. 
భావి తరాలకు అందిద్దాం...

#త్యాగమూర్తులనుస్మరించుకుందాం_భావితరాలకుస్ఫూర్తినందిద్దాం.

భారత్ మాతాకి జై.

Tuesday, October 12, 2021

#శ్రీశ్రీశ్రీదేవిశరన్నవరాత్రి ఉత్సవాలు-2021

శ్రీశ్రీశ్రీ దేవి 
#శరన్నవరాత్రిఉత్సవాలు_2021

    Gnana Saraswathi Temple Nandiwanaparthy 

#ఆరవరోజు: 12.10.2011

#మూలానక్షత్రo సందర్బంగా నిజరూప అలంకరణలో #జ్ఞానసరస్వతిమాత.

!సరస్వతీ నమ:స్తుభ్యం
వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా🙏🏼!!

శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి
నందివనపర్తి నగర నిలయే
జ్ఞానసరస్వతీ నమ్మోస్తుతే 🙏🏼🙏🏼!!

#మాహమేశక్తిదే🙏🏼న రుక్ నే కా - న ఝక్ నే కా.

https://youtu.be/uNw50U4Uic4

 #subscribethechannel

#సదావెంకట్

Tuesday, October 5, 2021

Statue of Unity

బడే మియా కే పాస్ చోటే మియా😀  నిజాయితీగా జరిగే ఏ పనైనా నిటారుగా నిలబలదుతుంది. ఒడుదుడులతో  కాస్త ఆలస్యమైనా తప్పక గుర్తింపు పొందుతుంది.  దేశ సమగ్రతకోసం  నిజాతీగా పనిచేసిన సర్దార్ పటేల్ గారికి వారి సమయంలో తగిన గుర్తింపు అందలేదన్నది నగ్నసత్యం. 
దేశంలో మేము బాగం కామని మొండికేసిన అనేక సంస్థానాల రాజులను తనదైన శైలితో చక్కదిద్ది సమృద్దభారతం వైపుగా నిలిపిన సర్ధార్ పటేల్ గారి పనిని ప్రపంచం గుర్తించేలా చేయడం అభినందనీయం..వందనీయం.. వారి పనిని స్మరించుకుంటూ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని సమైక్యతకు చిహ్నంగానిలపడం అద్బుతం.

Wednesday, September 29, 2021

Bharath Dharshan Yatra_2021

*Thx to team for wonderful Coordination*...

Successfully Completed *Bharath Dharshan Yatra*

*Gujarath Trip_2021*.

*Air✈️ Way 2200 & 3500 Road🚘 way*.

Visited.

*Ambaji Matha  Gabbar Pahad*

*Mount abu(Rajasthan)*

*Nadabet Indo Pak Border*

*Lakhpath Boarder*

*The Rann of Kutch*
*Mandvi Beach*
 *Dwaraka*
 *Nageshwar Jyothi kung*
*Somnath Manchir*
 *Junaghad Abhaji Matha*(ShakthiPeet)

*Salangpur Hanuman Temple*

*Gir National Park*

 *Gujarath  Science City*

 *World's Tallest Statue_ Unity of Statue, Ahmadabad*...


అనుగ్రహించిన దైవానికి, సహకరించిన ప్రకృతికి, మంచి సమన్వయంతో తోడున్న సహచరులకు దన్యవాదాలు..

*పది రోజుల పాటు సాగిన భారత్ దర్శన్ యాత్రలో బాగంగా గుజరాత్ రాష్టంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక, చారిత్రాత్మ స్థలాల సందర్శన సంపూర్ణం*..

*మన దేశ ఆద్యాత్మిక ,సాంసృతిక వారసత్వ సంపదను సృష్టించి వాటికి కాపాడే క్రమంలో తమ జీవితాలను ధారబోసిన నాటితరం వారికి, ఆ పరంపరను కొనసాగిస్తున్న నేటితరం వారదులకు వినమ్రపూర్వక ప్రణామాలు*.

*దైవభక్తి సమ్మిళిత దేశభక్తి పెంపొందించేలా యాత్ర రచన చేసి మార్గదర్శనం చేసిన పెద్దలకు ప్రత్యేక దన్యవాదాలు*...

  భారత దేశంలోని అన్ని చారిత్రాత్మక స్థలాల సందర్శనకోసం  సాగే ఈ భారత్ దర్శన్ యాత్రలో ఇంకా మిగిలిన స్థలాల సందర్శనకూ ఇంతే ఉత్సాహాన్ని, మార్గదర్శనాన్ని ఇవ్వాలని ఆ ప్రకృతిని వేడుకుంటూ...  భారత్ మాతకి జై.

:~ సదా వెంకట్.

Saturday, September 18, 2021

Chardham Yatra_2019

#BharathDharshan_2019
#Uttarakand Trip
#CHARDHAMYATRA
Day6

On the way to #KEDHARNATH MANDHIR  by #HORSERIDING for 23km #GHATROAD and 11755fts Hight.
Finally reached. 
Thanks to #NATURE for Support.

     ఉదయం 5గం. లకు ప్రారంభమైన యాత్ర, 23Kms  11755 fts ఎత్తులో ఉన్న కేదార్ నాథ్ ఆలయం చేరడానికి 6 గo.ల ప్రయాణం..
వెళ్లడానికి నాలుగు రకాలు పద్ధతులు..
హెలికాప్టర్, గుర్రం, తొట్టెల, నడక...
ప్రకృతిని ఆస్వాదించడానికి
గుర్రమే మేలని ఎక్కేసాం..
నడిచే వాళ్ళను చూస్తే #స్ఫూర్తి, 
ఆరోగ్య రీత్యా నడవలేని, గుర్రమెక్కలేని 
భక్తులను మోసేవాళ్లను చూస్తే ఒకింత జాలి...
అది వారి కూడు, గుడ్డకోసం ఖచ్చితంగా కాదు.
భగవంతుని నిర్ణయం అంతే.
గుర్రంతో పాటు నడిచే యువకులను చూస్తే ఇంకా కావలసినంత స్ఫూర్తి..

నిజమే బులావ ఉంటేనే వెళ్తారు దర్శనానికి..

ఝలక్ ఇచ్చి సహకరించిన ఆరోగ్యానికి దండాలు. 
సేఫ్ గా చేరిక.

Friday, September 17, 2021

పూల మాలకు తలలు వంచక

పూల మాలకు తలలు వంచక_పొగడ్తలకై పరుగులిడక అమ్మ భారతి సేవ చేయగ కదులవోయ్ సోదరా...అనే పాట వింటూ వింటూ... ఆ రకంగా నిరంతర పనిలో కొనసాగుతున్న వారిని చూస్తూ, వారితో కలిసి పనిచేసిన కారణంగా ఈ సన్మానాలు_శాలువలూ  అందుకోవడం చాలా ఇబ్బంది అనిపించేది, అనిపిస్తుంది. అయినా అక్కడక్కడ తప్పదు. 2010 లో లోయపల్లి పభుత్వ పాఠశాల వార్షికోత్సవం, నీటి శుద్ది పరికరం అందించిన కారణంగా ఆ పాఠశాల ఉపాద్యాయులు ఎంత వారించినా, బలవంతంగా ఈ శాలువా సన్మానం. అప్పటికీ చాలా తప్పించుకున్నా ఇదే మొదటిసారి శాలువా కప్పుకోవడ. ఇప్పటికీ ఆ శాలువాలు చూస్తే అంతే భయం. అయినా అక్కడక్కడ తప్పట్లేదు.. పూలమాలకు తలలు వంచక- పొగడ్తలకై పరుగులిడక అమ్మ భారతి సేవ చేయగ సాగవోయి సోదరా...

విమోచనం @ సెప్టెంబర్ 17

తెలంగాణ రాకముందు గోలుకొండా కిల్ల కిందా నీ ఘోరి కడ్తం కొడుకో నైజాం సర్కలోడా అంటూ గజ్జకట్టి జజ్జనకరే గంతులేసిన గొంతులేమైనయ్...ఈ గొంతులను ఉసిగొల్పిన పెన్నులేమైనయ్,  గన్నులు పట్టుక ఊగిన ఆ అరణ్య  సప్పుడులేమైనయ్, మేదావులనుకొని మైకుల్లో ఊకదంపుడు ఉపన్యాసలు దంచిన ఆ గాండ్రిప్పులేమైనయ్, చర్చల్లో రచ్చ రచ్చ చేసిన ఆ అరదిమాకులేమైనయ్ ఇప్పుడు.... అవసరానికో మాట, ఆపదకోమాట మాట్లాడి సెప్టెంబర్ 17 కోసం పోరాడిన యోధులను అగౌరవపరచమేనా.. తూ మీ బతుకులు చెడ అని ఊరూరా తిడుతున్నరుగా జనాలు... జర పైలం.

Thursday, September 16, 2021

నిస్వార్థ శక్తిమంతుడు.

జనహితం కోసం సంకల్పం చేసిన
సామాన్యుడు సాహసికుడై,  నిస్వార్ధ శక్తిమంతుడై పుట్టుక నాది_ చావు నాది జీవితమంతా సమాజానిది అని భరితెగించి దేశంకోసమే పనిచేసే స్వాప్నికుడి కల సాకారం కాకుండా దేవతలూ ఆపగలరా.. పుట్టించిందే అందుకు కదా అనీ వారేతల గోక్కోరా... నమో నమ:

చైత్ర @ ఆత్మహత్య

చలో.... తుపాకీకి ఏ మరకా అంటకుండా కామ్ కథం...

గుడ్ ఐడియా సర్ జీ.
10 లక్షలూ మిగిలినయ్... కానీ పసిపాప ప్రాణo తిరిగిరాదు..

ఇంతకు ముంచి ఇంకేదో జరగాలి, రెండువైపులా ఇంత రోదన అవసరం లేదు.

అందాల్సిoది సంస్కారo, అది మొగ్గలోనే అందాలి..

అందాలసింది భక్తి-భయము, అదీ మొగ్గలోనే అందాలి..

ఆ వైపుగా ఆలోచనలు, ఆచరణలు ,సంస్కరణలు ఉండాలి.






#Dedication

నన్ను, నా పనిని ఎవరూ గుర్తిస్తలేరు, నా పనికి ఎవరూ చప్పట్లు, తాళాలు కొడుతలేరని ఆశపడి బాదపడేంత బలహీన మనస్సుతో ఏ పనీ చేయకు....నిజాయితీతో జరిగే ఏ పనికైనా ప్రకృతి తలవంచి సహకరిస్తదనేంత 
శ్రద్దతో పనిలో ఉండు.

Tuesday, September 14, 2021

#BharathDharshan Yatra_2021

చలో యాత్రాకి తయారి హోజాయే...
ఈ సెప్టెంబర్ మాసంలో ఏదో మాయ ఉన్నట్టుంది... ప్రతీసారి దేశం తిప్పుకొస్తది... ఒక్కో యాడాది ఒక్కో క్షేత్రం తిప్పి వచ్చే యాడదికల్లా ఇంకా ఉత్సాహాన్ని పెంచి నిలబెడుతది. ఈ సారి అదే జరుగుతుంది... 2020 కరోనా ఆపింది అంతె.. ..హోజావో తయ్యార్ సాతియో ఓ జావో తయ్యార్...

Sunday, September 12, 2021

Bhajan @ Vinayaka 2021

 చప్పట్లు_ తాలాలు కొట్టుడేనా మీకు ఏమన్న వచ్చా అనే సందేహం అసలేం వద్దు..  మా స్థాయిలో మేం పాడగలం, పాడించగలం.. పే  ద్ద గాయకులం కాకపోయినా, అవుతలోల్లకు ఇష్టం ఉన్నా-లేకున్నా, విన్నా-వినకపోయినా మా పాట, మా భజన మేం చెప్పేస్తాం. మిగతాది అవుతలోల్ల ఇష్టం..... అవును దేవుని దగ్గరా దేశభక్తి పాటలూ పాడుతం..అంతేగా దైవ భక్తి కన్నా దేశభక్తి వేయిశాతం ఎక్కువ ఉండాలని చెప్పిన పెదల మాటలు గౌరవిస్తాం...

వినాయక భజన @ 2021

అద్బుతం..... యువకులచే భజన @ సాధన కుటీర్ _మూడవరోజు.
సామాన్యులే సాధకులు, చైతన్య శక్తులు... సంస్కృతి_సాంప్రదాయాలకు వారసులు.. దేవుడి పూజ అంటే  ఖరీదైనది అనుకోవడం  పెద్ద తప్పు- ఉన్నంతలో ఉన్నతంగా ఆలోచించి ఉత్సాహంగా సమర్పణ చేయడమే ఆ దేవుడికిష్టం...అందుకే గణేశ్ నవరాత్రులు సామూహికం, సాదారణం, చైతన్యవంతం అయినాయి.... దూరపు కొండలు నునుపూ అన్నరు... జీన్స్ పాంటులు, ట్ షర్ట్స్ వేసుకున్నోలంతా నవతరం, వాల్లకు ఈ భజనలు, బాగోతాలు తెలవదు అసల్ రాదు వాల్లకు అనుకోవడం అమాయకత్వం..ముప్పూటలా స్నానం, పూజలు చేసిబ్ సమాజానికి అవసరమైనా గప్పున ఇంట్లో ఉండే వాల్లకంటే, సమాజానికి, సామూహిక చైతన్యానికి వారదులుగా నిలుస్తున్న ఇలాంటి యువతే ఆదరనీయం, ఆచరనీయం..

Thursday, September 9, 2021

Rachakoda Ganesh

శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు  సృష్టికే అందాలు తెచ్చినారు అనే మాటపాటలు నిజమే..
 జనంసంచారం లేని ప్రాంతంలో, గుట్టల్లో, దారి మద్యలో ఉన్న రాళ్లకు రమణీయమైన బొమ్మలు చెక్కడం అద్బుతం. మన సంసృతీ, సాంప్రదాలను భావితరాలకు చేరవేయాలన్న వారి నిస్వార్ధ, త్యాగ బావననే వారిచే ఆ పని చేయించింది....అద్భుతమైన కళా సంపదకు, ఆ నిస్వార్ధ సేవాగుణం కారణంగా ఇలాంటి కళాకండాలు మనం చూడగలుగుతున్నాం... 
ఎవరి చెక్కిన శిలనో సృష్టి... రాచకొండలో గణపతిగా మనకు దర్శనమిస్తాడు.. వినాయక చతుర్దిరోజున ఆ గజానునికి మొక్కుతూ.. ఆ అజ్ఞాత శిల్పికి ప్రణమిళ్ళుదాం.
వినాయక చవితి@ 2021 : చిత్రం తీసింది 2015

Tuesday, September 7, 2021

గులాబీల పోటీ @ సాధన కుటీర్.

ఆరోగ్యకరమైన పోటీ ఎక్కడైనా మంచిదే..
మనుషుల్లో, జంతువుల్లో, పక్షుల్లో,  మొక్కల్లో చివరకి పూలల్లో కూడా....

సాధన కుటీర్ లో భారత మాత హారతికోసం నాటిన పూలమొక్కల్లో..    కాశ్మీరి గులాబి, బాగ్యనరి గులాబీలు పోటాపోటీన పూస్తున్నయ్ . మేమంటే మేమని... నిన్నటి వరకు కాశ్మీరి గులాబి ఎక్కువ పూసి హారతికొచ్చే... మేమెందుకు రావద్దని బాగ్యనగరి గులాబీలు గులాబించే... కాశ్మీరీలో ఒకే రంగుంటే, భాగ్యనగరిలో రంగురంగులున్నాయ్.. చూద్దాం చివరికంటూ ఎవరుంటారో....

Wednesday, September 1, 2021

గులాబీ @ సాధన కుటీర్

*అరే ఓ సాంబా*...
మార్కెట్ లో గులాబి పూల రేటేముందో కనుక్కోరా......
*కుల్లా అయితే ఎంత? కిలో లెక్క ఎంతా?*...
*శంషాబాద్ గులాబి రేటేంది ? కాశ్మీరి గులాబీ రేటేంది?*...
*వచ్చి కొనుక్కుంటే ఏo రేటు? ఇంటికే సప్లై చేస్తే ఏమి రేటు?*...
*తోటలో కూలీలు పెంచిన గులాబి ఏం రేటు?*  *ఇంటిమనుషులు హృదయంతో పెంచిన గులాబీ ఏం రేటు*...
*అరె ఓ సాంబా... రేట్లు కనుక్కోని వస్తొస్తా కాశ్మీరి గులాబీలకోసం బాక్సులు మరిచిపోకు*.. బాక్సుల్లో బద్రపరుద్దాం..
"" *ఇవి హృదయంతో సాగుచేసిన సాధన కుటీర్ లో కాశ్మీరి గులాబీలు...భారతమాత పాదాలకే అంకితం*.. *అని అన్ని రేట్లు తెలుసుకున్నాక దండోరా వేద్దాం*..... అరే ఓ సాంబా..
చలో చలో.....

Friday, June 18, 2021

ఆత్మీయులందరికీ ధన్యవాదాలు @ 2021

#ఆత్మీయులందరికీ #ధన్యవాదాలు..

అనామకులమైన మనలాంటివారిచే కొన్ని కార్యాలకోసం సంకల్పాలను చేయించి తనకు కావాలసిన పనులు చెయించుకుంటుంది ఆ ప్రకృతి..
అలాంటి అవకాశం వచ్చిన వారంత అదృష్టవంతులే...

సంకల్పించిన  కార్యాల సిద్దికై అనుగ్రహిస్తున్న దైవానికి,  సహరిస్తున్న ప్రకృతికి, అన్ని వేళలా అండగా నిలుస్తున్న ఆత్మీయులకు హృదయపూర్వక దన్యవాదాలు*..

*అసాద్య సాధక స్వామిన్ అసాధ్యం తనకిమ్ వద  రామ దూత కృపాం సిందో మమకార్యం సాధయ ప్రభో🙏🏼*....
సంకల్పించిన కార్యాలు పూర్తయ్యే వరకు చేసే పనిలో నిజాయితీని సడలనివ్వని శక్తినిమ్మని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ🙏🏼... జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
 #ఆత్మీయులందరికీ #శుభాబినందలు💐💐.

*భారత్ మాతకి జై*.
#సదావెంకట్*

Saturday, June 12, 2021

చేనేత కుటుంబం @ భూదాన్ పోచంపల్లి

*అరగంట బేరం చేసి ఐదువేలకు కొనుక్కునే చేనేత చీర తయారి కోసం ఒక కుటుంబం మూడు రోజులు అతి జాగ్రత్తగా పనిచేయాలి*.. 
అతి పలచని దారంపోగుకు కావాల్సిన రంగులద్దీ, కావలసిన బొమ్మలను కూడా ఏమాత్రం తేడా రాకుండా అల్లాలి. 
మరయంత్రంలో ఒకసారి డై వేస్తే ప్రతీసారి తేలికగా అచ్చువేయొచ్చు. 
కానీ మనుషులచే నేయబడే చేనేత కలకార్మికుల స్థితులు, పరిస్థితులు వేరు.
 ఆ చేనేత కుటుంబాల శ్రమ, శ్రద్ధ దగ్గరగా చూస్తేగాని అర్థం కాదు... 
వారు నేచిన వస్త్రం దరను వారు నిర్ణయించే అవకాశం లేదు. వీళ్ళ కష్టానికి దర నిర్ణయించేది వస్త్ర దళారులే. నేతన్న నేచిన చీర దర వినియోగదారునికి చేరేవరకు రెండింతలవుతుoది.
 బాగా లాభపడేది మాత్రం దళారులే.. అందుకే ప్రత్యక్షంగా చేనేతనే ప్రోత్సహించాలి.. అవుసరమైతే ప్రభుత్వం వారిని అండగా వుండాలి.
*భూదాన్ పోచంపల్లిని సందర్సించి, నలుగురు  సబ్యులన్న ఒక చేనేత కుటుంబాన్ని, ఆ వారి పనిని  దగ్గరగా చూసినప్పుడు కలిగిన బావన*.
   చేనేత వస్త్రాలు నేస్తూ, సంవత్సరాల పాటు అమ్మ పసుతున్న కష్టం చూడలేక...,     *చిoతకింది మల్లేషం అమ్మపేరున సృష్టించిన లక్ష్మీ ఆశు యంత్రం ఇప్పుడు ఆ చేనేత కుటుంబాలకు కొంత చేయూతనిస్తుంది*. 
 చేనేత కుంటుంబాల బాదలకు కొంత విముక్తి కల్పించిన  ఆశుయంత్ర తయారీదారు #ChintakiMdiMallesham  గారిని కేంద్ర ప్రభుత్వం  *పద్మశ్రీతో* గౌరవించింది.

https://en.m.wikipedia.org/wiki/Chintakindi_Mallesham

*చేనేతకు చేయుతనిద్దాం_ ఆ కుటుంబాల శ్ర్రమను గౌరవిద్దాం*.

Thursday, June 3, 2021

గోఠీలాట..

కరోనా సెకండ్ వేవ్ లో ఏమి నేర్చుకున్నావ్ అంటే..  మర్చిపోయిన గోఠీలాట మల్ల నేర్చుకున్నాం అంటా.. అంతే అంతే...

Monday, May 24, 2021

అద్భుత కళ @ అమ్మవారి విగ్రహం

అద్బుతం..
ఆ కాళా నైపుణ్యం..

మరయంత్రంతో పోటీగా మనిషి హస్తం... ఇంకా అంటే అంతకు ఎక్కువే..
అచ్చువేసినట్టే అమ్మవారి విగ్రహం..

ఆ విగ్రహంలో అమ్మవారు ఆవహిస్తే అచ్చంగా ఆమే రూపమే.. అది మహా అద్బుతమే..

అ స్థలంలో అమ్మవారి విహ్రహo   వేయించాలనే ఆలోచన వచ్చినప్పుడే...
వేస్తే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనుకున్నా...
ఆ శిల్పికి ఒకటికి 10 మార్లు వేయాల్సిన బొమ్మ చిత్రం చూపించి జాగ్రత్తలు చెప్పాను. అవి జాగ్రత్తలు అనేకంటే భయపెట్టడం అనొచ్చోమో. అంతలా జాగ్రత్త చేప్పాను..  ఇక ఆ విగ్రహం తయారు చేయడం మెదలు పెట్టీన రోజు నుండి ప్రతీ రెండు రోజులకు వస్తున్న మార్పులు గమనిస్తూన్నాము.
ఆ విగ్రహం పూర్తయ్యాక కొంత సంతోషం,  మనం చెప్పిన మాదిరిగానే అచ్చం అలాగే చేశాడు శిల్పి..
ముఖ్యంగా ముఖ వర్చసు మీద కొoత ఆందోళన ఉండేది ఎలా చేస్తారో అని.. అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఒక్క ముఖమేమిటీ ప్రతీ చిన్న విషయాల పట్ల జాగ్రత్త పడి అమ్మవారి విగ్రహo చేశారు..

ఆ తరువాత ఆ విగ్రహనికి వేయాల్సిన రంగులూ మనమే నిర్ణయం చేసాము. ఆ బొమ్మే కేవలం మన ఆలయానికే ఉంటుంది.
ఎప్పుడు రంగులు పూర్తి చేస్తారా అన్నంత ఆతృత ఉండేది...

ఎట్టకేలకూ విగ్రహం బాగ రావడమే కాక రంగులూ బాగా వేశారు..
ఆలయ గర్బగుడిలో వెలసిన అమ్మవారిని దర్శించుకునే కంటే ముందే, గుడి మెట్లదగ్గరే ఈ అమ్మవారు దర్శనం ఇస్తుంది..
ఇంతా చెప్పి ఇదెక్కడా అని అడిగేంత అవాకాశం ఏమీ ఇవ్వను..

*ఇది మన జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి అలయంలో...
అందర

*ఇంత శ్రద్ధతో, చాలా ఓపికగా తమ అద్భుత కళా నైపుణ్యంతో అమ్మవారి విగ్రహాన్ని అందించిన ఆ  కళాకారుల కళను గౌరవిస్తూ, వారిని అబినందిద్దాం, ప్రోత్సహిదాం*.

జూన్ 5వ తేది ఆలయ బ్రహ్మోత్సవాల సందర్బంగా వచ్చినప్పుడు దగ్గరగా దర్సిద్దాం..

*బోలో సరస్వతి మాతకి జై*.

;~ సదా వెంకట్.

Friday, May 21, 2021

వ్యవసాయ క్షేత్రం @ తారమతిపెట్

లాక్ డౌన్ అందించిన మరో అవకాశం.
*అద్బుత #వ్యవసాయక్షేత్ర సందర్సన*

అక్కడ ప్రతి #మొక్క, ప్రతి #చెట్టూ, ప్రతీ #తీగ, ప్రతి #రాయి, ప్రతి బొమ్మ ...ఒకటేమికి అక్కడ అన్నీ అద్భుతాలే.. అదొక #శ్రద్దాక్షేత్రం.

ఈ లాక్ డౌన్ సమయంలో పూజ్యశ్రీ #విద్యారణ్యభారతిస్వామిజీ తో పాటు కలిసి ఆ క్షేత్రం సందర్శించే అవకాశం రావడం ఒక అద్భుతం.

ముప్పై సంవత్సరాల #సాధన... 
ప్రకృతి సేవకుడై,
అదే యావతో నిరంతర శ్రమ. 
మట్టిని, శ్రమను నమ్మి, అదే ఆశను ఆశయంగా చేసుకుని సాధనతో  #మట్టిలోమాణిక్యాలు తీస్తు ఎందరికో మార్గదర్శకుడైన #శ్రామికుడు,..

  ఉన్నత విద్యార్హతలు కలిగి, ప్రకృతి మీద ఉన్న మమకారంతో 
17 ఎకరాల పొలంలో ఏమాత్రం 
కాలి స్థలం లేకుండా అన్ని రకాల #పూలమొక్కలను, #పండ్లమొక్కలను నాటి, వాటిని మొక్కలుగా చూసి, వాటిని పూర్తి #సేoద్రీయఎరువులతో వృక్షాలుగా, మహా వృక్షాలుగా మలచిన #మహాసాధకుడు.
తన నిరంతర శ్రమకు ఎన్నో అవార్డులు వచ్చినా,  ఆయన శ్రద్దముందు అవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి. 

 ఎప్పడూ బిజీగా ఉంటూ, ఒక్క నిమిషం కూడా వృధా చేయక తన క్షేత్రాన్ని అద్భుతoగా తీర్చిదిద్ది, అదొక ప్రయోగశాలగా మార్చిన    వారి కృషి అభినందనీయం. అందుకే అదొక సందర్శనశాలగా మారింది. రేపటి తరం సాధకులకు దిక్ఛూచి అయ్యింది. ఆయన జీవితం నేటి విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా మారింది...
ఆ సాధకుడు #నాగరత్నంనాయుడు, ఆ క్షేత్రం తారమతిపేట్, అబ్దుల్లాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా.

link:  https://www.theweekendleader.com/Success/2371/model-farmer.html

Thursday, May 20, 2021

రాచకొండలో అఖండజ్యోతి శివ అనుగ్రహమే

ఒక కారణమంటూ లేకుండా ఏ కలయిక జరగదు....

కొన్ని ప్రకృతి ప్రసాదిత నిర్ణయాలు ఇంకా ఖచ్చితంగా జరుగుతాయి..

 అనుమానమే అక్కరలేదు..
మన సంకల్పం మంచిదైతే  శక్తి వెతుక్కుంటా వస్తుందనేది పచ్చినిజం..

సంకల్ప సాకారానికి  ఎవరున్నా,లేకున్నా  చిట్టచివరి వరకు నీ దారిలో అడుగులు నీవు వేస్తే....ఎవరిని ఎప్పుడు కలపాలో, ఎవరిని ఎప్పుడు జరపాలో ఆ ప్రకృతి చూసుకుంటుంది. మనం చేయాల్సిందల్లా మన పనిలో నిజాయితిని కాపాడుకోవడమే..

Wednesday, April 28, 2021

సలేశ్వరం యాత్ర @2013

పాలమూర్ - సలేస్వరం యాత్ర...సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే సాగే  ఈ యాత్రను/ ఆలయాన్ని  సందర్శించాలన్నగత 4సం.రాల నుండి ఉన్న  కోరిక ఈ సంవత్సరం పూర్తయ్యింది. పాలమూర్ జిల్లాలో ఉన్న ఈ సలేస్వరాలయాన్ని ప్రతి ఒక్కరు దర్సించాల్సినదే ....   భాగ్యనగర్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం దర్శించినకా కలిగే తృప్తి . ఆనందం వర్ణనాతీతం . 40O అడుగుల లోతున.. లోయ ప్రాంతంలో  చిన్న లింగాకారంలో వెలసిన దైవాన్ని దర్శించిన ఆనందం కన్నా... కొన్ని వందల సంవత్సరాల క్రితమే.. తమ భవిష్యత్ తరాల వారికి భారతీయ వారసత్వ సంపదను అందించే క్రమంలో వాళ్ళు చూపిన శ్రద్ద పట్ల అందరూ ఆశ్చర్య పడాల్సిందే. వాలందరికీ కృతజ్ఞులమై ఉండాల్సిందే...సాదారణ రోడ్డు మార్గం నుండి లోయ ప్రాంతంవైపు  సాగే సుమారు 6  కిలోమీటర్ల రహదారి ప్రయాణం మాత్రం వర్ణనాతీతం ... కచ్చితంగా అది స్వీయ అనుభూతి పొందాల్సిందే. అందునా ఉత్సాహ వంతులైన మిత్రబృందం ఉంటె ఇక ఆ ఆనందం ఇంకా మధురం. దారి పొడుగునా ఉన్న రమణీయమైన అందాలను తిలకిస్తూనే... ఎన్ని వ్యయ ప్రయాసలని భరించి ఆ రహదారిని చూపిన/చేసిన  వారిని  అభినందించకుండా ఉండలేము..భవిస్యత్తు తరాల వారికి సంసృతీ సంప్రదాయాలను అందించటానికి వాల్లు పడ్డ శ్రమ పట్ల ఆశ్చర్యం కలుగుతుంది ... హ్రుదయం ఉన్నవారికేవరికైనా తాముకూడా ఏమైనా చేయాలనిపిస్తుంది.....