అవును ఇక్కడి #ప్రతీరాయి #మౌనంగా మాట్లాడుతుంది....
#చరిత్రకు #మౌనసాక్షిగా నిలుస్తాయి ఇక్కడి రాళ్లు.. ..
ఇక్కడ రాళ్లలో మహత్తు ఉన్నది.....అవి మార్గాలు చూపుతాయి..
త్రేతాయుగపు సుందర రామాయణ చరితను చరిత్రకు అందించే అద్బుతాలు ఆ రాళ్లలోనే నిగూడంగా నిక్షిప్తం....
#భారతీయ గత వైభవ ఆనవాళ్ళను గుర్తుచేస్తూ భవిష్యత్తుకు దారిచూపుతాయి... అవును ఇక్కడి రాళ్ళకు రతనాలతో సమాన గుర్తింపు ఉండెనట...
#గుడులను_ గుడుల్లోని #దేవతల ఆశీర్వాదాలను, #శాస్త్రాలు_శాసనాలు, నదులు-జీవనదులకు,
దారులు_రహదారులన్నిటికీ ఇక్కడి రాళ్లే దివిటీలు..
ఇక్కడ నేలపై పారే నీటికే కాదు, కొండలపై #జీవనదులుల్లా పారే నీటికీ ఇక్కడి రాళ్ళే
సజీవ సాక్షాలు..రతనాల రాశుల వ్యాపారాలకు ఇక్కడి రాళ్ళే సిపాయిలుగా నిలిచాయంట....
ఈ రాల్లను రమణీయంగా మలిచేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయక, ఆ బండరాళ్ళను బద్రపరచి, సజీవ సాక్షులుగా మలుచుటకు జీవితాలను దారపోసిన ఆ #కళాహృదయాలు ఎంత గొప్పవో......
అందుకే ఇక్కడ ప్రతీ రాయి మౌనంగా మాట్లాడుతుంది.. చరిత్రకు
#మౌనసాక్షిగా నిలుస్తుంది.
రాల్లకే కాదు ఇక్కడి జంతువులకూ, ఈ నేల పట్ల శ్రద్ద ఎక్కువే అని చరిత్ర చెప్పిన పాఠం. ఇక్కడి కుందేళ్ళు వేటకుక్కలను సైతం తరిమితే.....
ఆ స్ఫూర్తితోనే #విద్యారణ్యస్వామిజి భారతజాతి #పూర్వవైభవం కోసం ప్రతిన చేసి, #విజయనగరసామ్రాజ్యానికి బీజం వేశాడు..
అలాంటి ఈ నేలను ఎన్నిసార్లు సందర్సించినా.. ప్రతీసారి కొత్త శక్తిని తోడిచ్చి పంపుతుంది...మౌనంగానే గత చరిత్రను నెమరేయిస్తాయి......
ఆ రమణీయ రత్నాల రాళ్ళ నగరమే #హంపీక్షేత్రం, #కర్ణాటక....
ఇప్పటికైనా #భారతప్రభుత్వo ఈ క్షేత్ర #గతవైభవాన్ని గుర్తించి, రేపటి #చరిత్రకు సజీవ సాక్షంగా నిలుపవచ్చు.
#HampiTrip2020 #HAMPI #హంపీ
#PM0 #govtofindia #IndianHeritage
No comments:
Post a Comment