Friday, September 17, 2021
పూల మాలకు తలలు వంచక
పూల మాలకు తలలు వంచక_పొగడ్తలకై పరుగులిడక అమ్మ భారతి సేవ చేయగ కదులవోయ్ సోదరా...అనే పాట వింటూ వింటూ... ఆ రకంగా నిరంతర పనిలో కొనసాగుతున్న వారిని చూస్తూ, వారితో కలిసి పనిచేసిన కారణంగా ఈ సన్మానాలు_శాలువలూ అందుకోవడం చాలా ఇబ్బంది అనిపించేది, అనిపిస్తుంది. అయినా అక్కడక్కడ తప్పదు. 2010 లో లోయపల్లి పభుత్వ పాఠశాల వార్షికోత్సవం, నీటి శుద్ది పరికరం అందించిన కారణంగా ఆ పాఠశాల ఉపాద్యాయులు ఎంత వారించినా, బలవంతంగా ఈ శాలువా సన్మానం. అప్పటికీ చాలా తప్పించుకున్నా ఇదే మొదటిసారి శాలువా కప్పుకోవడ. ఇప్పటికీ ఆ శాలువాలు చూస్తే అంతే భయం. అయినా అక్కడక్కడ తప్పట్లేదు.. పూలమాలకు తలలు వంచక- పొగడ్తలకై పరుగులిడక అమ్మ భారతి సేవ చేయగ సాగవోయి సోదరా...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment