అద్బుతం..
ఆ కాళా నైపుణ్యం..
మరయంత్రంతో పోటీగా మనిషి హస్తం... ఇంకా అంటే అంతకు ఎక్కువే..
అచ్చువేసినట్టే అమ్మవారి విగ్రహం..
ఆ విగ్రహంలో అమ్మవారు ఆవహిస్తే అచ్చంగా ఆమే రూపమే.. అది మహా అద్బుతమే..
అ స్థలంలో అమ్మవారి విహ్రహo వేయించాలనే ఆలోచన వచ్చినప్పుడే...
వేస్తే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనుకున్నా...
ఆ శిల్పికి ఒకటికి 10 మార్లు వేయాల్సిన బొమ్మ చిత్రం చూపించి జాగ్రత్తలు చెప్పాను. అవి జాగ్రత్తలు అనేకంటే భయపెట్టడం అనొచ్చోమో. అంతలా జాగ్రత్త చేప్పాను.. ఇక ఆ విగ్రహం తయారు చేయడం మెదలు పెట్టీన రోజు నుండి ప్రతీ రెండు రోజులకు వస్తున్న మార్పులు గమనిస్తూన్నాము.
ఆ విగ్రహం పూర్తయ్యాక కొంత సంతోషం, మనం చెప్పిన మాదిరిగానే అచ్చం అలాగే చేశాడు శిల్పి..
ముఖ్యంగా ముఖ వర్చసు మీద కొoత ఆందోళన ఉండేది ఎలా చేస్తారో అని.. అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఒక్క ముఖమేమిటీ ప్రతీ చిన్న విషయాల పట్ల జాగ్రత్త పడి అమ్మవారి విగ్రహo చేశారు..
ఆ తరువాత ఆ విగ్రహనికి వేయాల్సిన రంగులూ మనమే నిర్ణయం చేసాము. ఆ బొమ్మే కేవలం మన ఆలయానికే ఉంటుంది.
ఎప్పుడు రంగులు పూర్తి చేస్తారా అన్నంత ఆతృత ఉండేది...
ఎట్టకేలకూ విగ్రహం బాగ రావడమే కాక రంగులూ బాగా వేశారు..
ఆలయ గర్బగుడిలో వెలసిన అమ్మవారిని దర్శించుకునే కంటే ముందే, గుడి మెట్లదగ్గరే ఈ అమ్మవారు దర్శనం ఇస్తుంది..
ఇంతా చెప్పి ఇదెక్కడా అని అడిగేంత అవాకాశం ఏమీ ఇవ్వను..
*ఇది మన జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి అలయంలో...
అందర
*ఇంత శ్రద్ధతో, చాలా ఓపికగా తమ అద్భుత కళా నైపుణ్యంతో అమ్మవారి విగ్రహాన్ని అందించిన ఆ కళాకారుల కళను గౌరవిస్తూ, వారిని అబినందిద్దాం, ప్రోత్సహిదాం*.
జూన్ 5వ తేది ఆలయ బ్రహ్మోత్సవాల సందర్బంగా వచ్చినప్పుడు దగ్గరగా దర్సిద్దాం..
*బోలో సరస్వతి మాతకి జై*.
;~ సదా వెంకట్.
No comments:
Post a Comment