Tuesday, November 7, 2017

అనుబంధ బంధాలు_Relations.

అనుబంద బందాలు::.
అనుబందం, ఆప్యాయత, ఆత్మీయత...
ఏ బందం లేకున్నా అల్లుకునే బందాలవి.
అడుక్కుంటే, ఆడంబరాలు చేస్తే, అతి వినయం చూపిస్తే వచ్చేవి కావు_ వచ్చినా నిలిచేవి కావు.
కొలతలతో కొలిస్తే తూకానికి అందనివి, మనసున స్వార్దం పెట్టుకుని నటిస్తే, మాటేసి కాటేసే నికార్సయిన నిజాయితీ బందాలవి.
నీతులు, సూక్తులూ ఊరికే అవుతలి వాళ్ళకి చెప్పడానికే కాకుండా, మనకు ఆచరించి చూపే అవకాశం అందించే బందాలవి. అవుసరాలు తీరాక దాటేసే తెప్పరులు కావవి.
బడ బడా కానుకలే కావాల్సిన పనిలేదు, మనసుంటె మట్టిని కూడా మణిపూసలుగా చేసి మణిహారంగా అందించగల బందాలవి.
మనసున స్వార్ధం, నటన లేకుంటే కలకాలం కల్మషం లేకుండా కలిసుండే బందాలవి.. బహుపరాక్..

Monday, November 6, 2017

AKHANDA HAARATHI_2017

సంకల్పించిన కార్యం చిన్నదా, పెద్దదా అన్నది కాదు విషయం.  ఎన్ని అభ్యంతరాలు, అవాంతరాలు ఎదురైనా, సంకల్పించిన కార్యం కోసం కొసదాక కొనసాగడమే అసలైన విజయం...
వీరపట్నం పెద్ద చెరువు నిండి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, రాచకొండ పరిసర ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షింస్తూ సంకల్పించిన మహాకార్యమే ""గంగమ్మకు అఖండ హారతి_శివయ్యకు అఖండ జ్యొతి" కార్యక్రమం.
3 సం.రాల క్రితం కార్తీక పౌర్ణమి రోజు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపీ విద్యారణ్య భారతీ స్వామీజీ కరకమలములచే ప్రారంభించబడి 2 సం. అందరి సహకారంతో రాలు దిగ్విజయంతో పూర్తిచేయబడింది.
3వ సంవత్సరం కూడా తమ అనుకూలతను బట్టి ఆ మహా కార్యాన్ని పూరిచేసిన "~వీరపట్నం అఖండ""  కార్యకర్తల బృందానికి హృదయపూర్వక శుభాభినందనలు... ఈ ప్రాంత వాసులందరి తరపున ధన్యవాదాలు..
హృదయంతో చేసే ఏ కార్యానికైనా కచ్చితంగా ఆ ప్రకృతి కనుకరిస్తది, అనుకూలిస్తది, ఆశీర్వదిస్తది. ..కాస్త ఆలస్యమైనా ఈ మహాకార్యం  యొక్క ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి...

Wednesday, October 11, 2017

దళిత పూజారులు _ Dalith Pujari.

"ఆలయాల్లో దళిత పూజారులు". ఈ మార్పుకోసం సాగిన నిరంరత ప్రయత్నకులకు, రహస్య సాధకులకు ప్రణామాలు.
కాని ఎందుకో ఈ దళిత అన్న పదమే వాడకుంటే బాగుంటది. అది తిట్టనుపోరా గాడిద అనట్టు, దూరం చేసి దగ్గరకు లాగినట్టు ఉంటది... అయినా అది మద్యలో వచ్చింది, మద్యలోనే పోతదేమో...

""అరాధన అంతరంగాల్లోంచి రావాలి గానీ... అంతరాల మద్య కాదు"".

అదే భగవద్గీతలో చెప్పింది కూడా...
"విద్యా వినయ సంపన్నే _ బ్రాహ్మణే గవి హస్తిని
శునిచైవ శ్వపాకే చ _పండితా: సమదర్శిన:" అని @ 5/18.

ఎవరన్నరు కొన్ని పనులు కొందరే చేయాలి అని.. అన్నీ అందరూ చేయొచ్చు.. కానీ నిష్టగా, నిజాయియిగా చేయాలి..అంటే చేసే పనిలో నిండా మునగాలి. చెయ్యాల్సిన ఏ పనైనా అలా మునిగితేనే అది సాధ్యం మరి...

Thursday, September 14, 2017

చెడపకురా చెడేవు

చెడపుకురా చెడేవు అంటే విన్నారా...
ఒరేయ్ జర యాది పెట్టుకొండిరా..
కాస్త ఆలస్యమైనా కంత్రీ పనులకు కచ్చితంగా శిక్ష ఉంటదిరా...
మీలాగే అందరివీ ప్రాణాలే...
భక్తితో దేవున్ని మొక్కడానికొచ్చిన వాల్లను కర్కషంగా కాల్చి చంపితిరి....
ఇప్పుడు రోజులు ముందులాగా లేవురా..
తప్పులు చేసి కూడా తప్పించుకుని తిరుగుతూ, దొరికినా జైల్లల్లో అప్పనంగా తింటూ, రాజభోగాలు అనుభవించే అలవాటు పడ్డారు.. కానీ ఇప్పుడు మునపటిలా రోజులు లేవురా..
నికార్సయిన దేశభక్తుల చేతుల్లో దేశం ఉంది. కాకలు తీరిన తీస్మార్ ఖాన్ లయినా కంత్రీ పనులు చేస్తే కనికరం లేకుండా కతం కానిచ్చిడే.. అదే మా దేశ ప్రజల ఉద్దేశ్యం కూడా..అందుకే జర పైలమ్ రా బిడ్డలూ..  అందరిలాగా మీ వీ ప్రాణాలే..

Tuesday, September 12, 2017

Support the #RURALSTUDENTS

పల్లె ఆణిముత్యాలు.... ప్రతిభను గుర్తించి వెన్నుతట్టి ప్రొత్సహిస్తే సమాజ ప్రగతి రథ చక్రాలు..
చలో... ఉన్నంతలో కొంత ఉడుతా భక్తిలా వారి ఉన్నతికి ఉపయోగపడదాం.....
""మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి, మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి.. అందుకే ప్రపంచం మీ కోసం ఎదురు చూసేలా మీరు ఎదగాలి"" అన్న స్ఫూర్తిని వారికిద్దాం..
అర్దిక నిరుపేదరికం నీకు అడ్డూ కాదు పొడుగూ కాకూడదు,
నీ ఆత్మవిశ్వాసమే నీ ఎదుగుదలకు నిచ్చెన కావాలి.. నీవు
చేయాల్సింది నీలోని న్యూనతా భావాన్ని తరిమేసి నిజాయుతీగా నీ నిగూడ ప్రతుభను బయటపెట్టడమే.. ఆదుకోవడం, ఆదరించడం, అండగా ఉండడం సమాజం పని అనే విశ్వాసాన్ని  అందిద్దాం...
అవకాశం ఉన్నచోట అలాంటోల్లకు ఆసరయ్యే ప్రయత్నం చేద్దాం...
100 మందిని ఒకేసారి  ఆదుకోలేకపోతున్న అని బాధపడే కంటే, సరైన సమయంలో కనీసం ఒక్కరికి అండగా ఉన్నా మేలు...
చలో కానిద్దాం ఆణిముత్యాలకు అండగా ఉందాం.. భావిభారత రథచక్రాలకు దారి దీపాలవుదాం.. బోలో భారత్ మాతాకి జై.

Sunday, September 10, 2017

అందరూ వ్యాపారలే...

వ్యాపారం చేసేటోల్లు అందరూ వైశ్యులే.. వైశ్యులే వ్యాపారులు అనడం ఆలోచించాలి.. వ్యాపారాలు చేయడమే దోచుకు తినడం అంటే ఆ జ్ఞానికి ఉన్న అజ్ఞానమే అది.  వ్యక్తులు, కులాలే కాదు  ప్రపంచ మే ఈ రోజు వ్యాపారం చేస్తుంది. కోమట్లే కాదు అన్ని కులాలోళ్లు ఈ రోజుల్లో    కూడు, గుడ్డ కోసం చిన్న చిన్న  కొట్లు పెట్టుకొని బతుకీడుస్తున్నారు.  లేదంటే కూటికి దొరకదు. ఆల్లను స్మగ్లర్లు అంటే ఎట్లా.  శ్రామికులే మా దేవుల్లు అనే చైనా లాంటి దేశాలే ప్రపంచమంతా వ్యాపరం చేస్తుంది. అంటే పరోక్షంగా శ్రామికులూ స్మగ్లర్లయితరా... అట్లయితే
. పుస్తకాలు రాసి మార్కెటింగ్ చేసుకోవడమూ వ్యాపరమే...  అందుకే మనది మనము చేసుకుంట ఎదగాలి, చెప్పుకోవాలి. అంతేగాని అవుతలోల్లను అగవరపరిచి దాని పునాదుల మీదే ఎదగాలనుకోవటం మూర్కత్వం.

Jago Jago Jagore Jago

జాగో జాగో  జాగోరే జాగో..
తూ తూ తూ... మీ బతుకులు..
ఎంతసేపు అవుతలోడు అట్ల చేసిండు, ఇట్ల చేసిండు.. వాడట్లాయే వీడిట్లాయే అని రంద్రాన్వేషణ కోసమేనా మీ జీవితమంతా. మీకంటూ సొంత అస్తిత్వం ఏర్పాటు చేసుకుని ఎదో ఒక పనికొచ్చే పనిచేయాలన్న ఆలోచన ఎందుకు రాదు. ఎంతసేపు అవుతలోని పనికి కట్టెలు, కాళు ఎట్లా అడ్డం పెట్టాలని ఆలోచించే కంటే సమాజంలో చాలా రుగ్మతలు, పనిచేయాల్సిన అవుసరాలు చాలా  ఉన్నాయి.. అందులో ఎదో ఒకటి నీ వంతుగా నెత్తినెత్తుకుని దాని పని చూసికో, ఆ దేవుడూ సహకరిస్తాడు.. నీవెత్తుకున్న పని నిజాయితీగా కొనెల్లా చెయ్యు. అంతే గాని, అది పక్కన పెట్టీ  అవుతలోల్ల మీధ  యాడో దేవులాడుకొచ్చి ఇంత బురద చల్లి ఆనందపడుతా అన్న అమాయకపు అలొచనలు చేసి సమయం వృదా చేసుకోకు... పరిస్థితిలు ముందులా లేవు. ఉట్టిగా బురద రుద్దితే, ఆ బురదను రుద్దినోడితోనే కడిగిపిచ్చే రోజులివి. అప్పడు  నీకు డబల్ ధమాకాల Double పని.. చల్లుడూ నీదే కడుగుడూ నీదే అయితది. సస్తవ్ పని చేయలేక. అందుకే వివేకంతో ఆలోచించి పని చెయ్యు. మంచి ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా అభినందించి, ఆనందపడు. అంతే కాదు నీకు అవకాశం ఉంటే ఇంత అసరా అవ్వు.. అంతే కాని కడుపుబ్బరంతో ఉండకూ..కుళ్ళిపోయి సస్తవ్.. సో చివరగా మల్లోసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం యేంటంటే  అవుతలి వ్యక్తుల, కులాల, సంస్థల, మతాలా మీద పడి కుల్లుకుంటూ ఏడవకా.. నీ పని నువ్వు చేస్తూ, దానితో నలుగురికి ఆనందాన్ని పంచు. నీకూ మనశ్సాంతి ఉంటది. అలా కాదు కూడదు నేనట్లే చేస్తా అంటే నీ ఇష్టం. అలాంటి వారి పని కాలమే నిర్ణయిస్తది ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని.(అలాంటి పనిలో ఎవరున్నా కాస్త జాగ్రత్త పడాల్సిన అవుసరం ఉంది, నిజాయితీగా ఉన్నోళ్లు నిచింతగా ఉండొచ్చు) So take care

Monday, August 28, 2017

AndraJyothi Article

Article in Today's   #Andrajyothi

అభిమానానికి నిండు మనస్సుతో ధన్యవాదాలు...
  అశయానికి, అలోచనలకు అడ్డుచెప్పక పూర్తి స్వేచ్చ నిచ్చిన కుటుంబ సబ్యులకు,
నాలో వున్న మంచి చెడును గమనిస్తూ  అశయానికి అయువునందిస్తున్న  మితృలకు, దారి చూపిన సంఘానికి మరియు నిండు మనసుతో అండగా నిలుస్తున్న  పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

ఎందరో త్యాగధనుల పుణ్యభూమి ఇది. సమాజ హితంకోరి తమకున్నదంతా దానికోసం ధారపోసిన మహనీయులున్నారు.. ఆస్తులేమి లేకున్నా అనుక్షణం సమాజహితం కోసం నిరంతరం మహాయజ్ఞంలా పనిచేసిన వారూ ఉన్నారు.వారి అడుగుజాడల్లో మనమూ..
 
రేపటి సమసమాజ నిర్మాణంలో బాగస్వాములయ్యే   నేటి చిన్నారులకు అక్షర చైతన్యమే ఆయుధం..
సరైన సమయంలో వారికి అవసరమైన సహకారం అందిస్తూ మనందరం అండగా నిలవాలి. ఆ ప్రయత్నం ఎవరు చేసినా మనవంతు సహకారం ఇవ్వాలి... ఆ ప్రయత్నం నిరంతర యజ్ఞంలా సాగాలంతే.. అందులో సమిదలవ్వడం అదృష్టం.

అలాంటి ప్రయత్నంలో కొనసాగలనుకున్న నాకు అ భగవంతుడు తగిన శక్తినివ్వాలని, అవకాశం ఉన్న అందరూ  ఆశయానికి అండగా ఉండాలని ఆకాంక్షిస్తూ... ~సదా.

Sunday, August 20, 2017

ధ్వజ స్థంభం _Dvaja SthaMbhaM

అమ్మా దీవించు కదిలాము సేవా దళమై. 2.

కాలేజి పిల్లల పైసలడగటానికై_ నీ ముంగిట ద్వజస్థంభమే నిలపడానికై..
~ అమ్మా దీవించు కదిలాము సేవాదళమై.

అడగడానికి మేమైతే సిగ్గుపడటం లేదు_ అనుగ్రహించు వారినీ ఇచ్చి ఎదగడానికై.
అమ్మా దీవించు కదిలాము సేవాదళమై.

ద్వజస్థంభమే కాదది _
పల్లె బడుల పిల్లలకో వరమవ్వాలని..
ప్రతిభగల నిరుపేదలకో  అభయ స్థంభమవ్వాలని...
అమ్మా దీవించు కదిలాము సేవాదళమై.

Saturday, August 19, 2017

Complement

నమ్మకమే ఒక శక్తి.

నమ్మకమే ఒక శక్తి .
పచ్చినిజం _ స్వయానుభవం...
నమ్మకమే నమ్మకమే నమ్మకమే.

పద పదరా సద అని తోసేసింది పదుగునిరి తోడిచ్చిందీ..
నమ్మకమే నమ్మకమే నమ్మకమే..

పదిమందిలో మాట్లాడే పలుకయ్యింది_
పదుగురినీ ఒప్పించే మాటయ్యిందీ..
నమ్మకమే నమ్మకమే నమ్మకమే

పసిపిల్లల పైసలతో చదువులమ్మకో గుడికట్టిచ్చిందీ _నాకా శక్తిచ్చిందీ.
నమ్మకమే నమ్మకమే నమ్మకమే.

ఏమున్నా లేకున్నా _ వెంటెవ్వరూ రాకున్నా
నేనున్నా నేనున్నానని  నను ముందుకు తోసిందీ నా వెనకాలే నడిసింది
నమ్మకమే నమ్మకమే నమ్మకమే....

Thursday, April 27, 2017

CONGRATULATIONS "GHAMBHEER"

మావొయిస్టుల రాక్షసత్వానికి బలైన 26 మంది సి.ఆర్‌.పి.ఎఫ్‌ కుటుంబాలలోని పిల్లల విద్యాబుద్దుల బాధ్యత పూర్తిగా స్వీకరించిన గౌతం గంబీర్‌ .. ఇది అమరవీరులకు నేనిచ్చే నివాళి అన్నారాయన .
    అత్యవుసర_ ఆపద సమయంలో తోటివారికీ, తప్పనిసరి పరిస్థితుల్లో దేశానికి, ధర్మానికి ఉపయోగపడని సొమ్ము నీ కాడ ఎంత ఉన్న నిరుపయోగమే..  
మనందరి భవిష్యతుకోసం, దేశంకోసం తమప్రాణాలను వదిలిన వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన భాద్యత ప్రబుత్వంతో పాటు సమాజంమీద కూడా ఉంది.. జవానుల  కుటుంబాల పిల్లల భష్యత్తుకు అండగా ఉండాలన్న నీ నిర్ణయానికి అభినందనలు.  జై హింద్✊.. భారత్ మాతాకి జై🙏🏻

Friday, April 14, 2017

KODHANDA RAAMALAYAM, RACHULUR.

రాళ్ళపై శిల్పాలు చెక్కినారు మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు..
చరితబ్ల్య్ అందని ఆనవాళ్లు ఎన్నో..
చరిత్రకు అందించని ఆనవాళ్ళు కొన్ని..
చరిత్రకు ఎలా తెలపాలో తెలియక మరుగునపడ్డవీ కొన్ని..
తెలియక చేసిన తప్పులు కొన్ని, తెలిసిచేసిన తప్పులు కొన్ని...
అయినా ఆగలే..ఆగవు కూడా..
ధర్మంయొక్క ఆనవాళ్ళను తమకు తోచిన రీతిన కాపాడుతూ భావితరాలకు అందించాలన్ని మీ ఆర్ద్రతే వాటిని ప్రపంచానికి చాటుతుంది కాస్త ఆలస్యమైనా.
భాగ్యనగరానికి అతిదగ్గరలో, రాచులూరు గుట్టలమద్య, చెరువు వెనకాల, రాల్లలో స్వయంభుగా వెలసిన కోదండరామస్వామి.. ఎవరి అజమాయిషి, ఆదిపత్యం లేక వారంపాటు సాగే జనజాతర.... చిన్న చిన్న దుకాణాలు, మిఠాయి కొట్లు, గాజుల దుకాణాలల్లో సందడి, చిన్నపిల్ల కోసమ్ ఎన్నో.. ఇప్పటికీ ఇంకా
  కొనసాగుతున్న విధానం చూస్తే ఆశ్చర్యం. ఆనందం. శరవేగంగా అన్నిరకాలుగా  అభివృద్ది చెందుతున్నా జనాలకు జారతల పట్ల ఏ మాత్రం తగ్గని  మక్కువ. కాని ఆలానే కొనసాగని.

Monday, April 10, 2017

COMMON MAN

అవును.. అత్యవుసరం, అనివార్యం కూడా.
ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు తీసుకుంటున్న ప్రతీ వ్యవస్థలోని ప్రతీ వ్యక్తి  (సర్పంచ్ నుండి రాష్ట్రపతి _అటెండర్ నుండి కలెక్టర్ వరకు) తమ కుటుంబ సబ్యుల పిల్లలను విధిగా ప్రభుత్వ బడుల్లో చదివించాలి. ప్రతిభావంతులే ప్రబుత్వ ఉద్యోగాలు సాధిస్తారు. అలాంటి వారే పిల్లల భవిష్యత్తుకోసం ఆలోచిస్తారు. అందుకే తమపిల్లల్లాగా అందరూ ఎదగాలని ఆలోచిస్తే వ్యవస్థ బాగుపడతది. గమనించాల్సింది వీరంతా  ప్రజా ధనం  నుండి జీతాలు పొందుతున్నారు. వ్యవస్థ  బాగుకోసం ముందడుగు వేయాలి. వీరికి ప్రభుత్వ_ ప్రజాధనం నుండి జీతాలు కావాలి గాని ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదని ప్రజలు ప్రశ్నించి, తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లల భవిష్యత్తు కోసం తిరగబడక ముందే వ్యవస్థ తెరుకోవాలి.  ఇది అత్యవుసరం, అనివార్యం కూడా..దేశంకోసం.

Sri SARASWATHI MAHA YAGNAM_2018

TQ dear GSS TRUSTEES.     
Gnana Saraswathi SewaSamithi(GSS) TRUSTEES meeting Successfully completed on 08.04.2017. selected the 150 names from all our Well-wishers fr 6 different Committees fr SARASWATHI MAHA YAGNAM  with 108 Idols vl b  held in Jan_2018.

   రేపటి తరంకోసం నేడు మనం  వెచ్చిస్తున్న ప్రతీ నిమిషం విలువైనదే. సంపద కంటే కూడా  సమయానికే యెక్కువ విలువిస్తున్న నేటి కాలంలో, మనం చేస్తున్న పని, ఇస్తున్న సమయాన్ని చూసి కొంతమంది నవ్వుకున్నా, అప్పుడప్పుడూ మనకూ ఇంత అవసరమా అని అనిపించినా.. నిరాశ పడక, నిస్వార్దంగా మనం చేస్తున్న పని యొక్క ఫలాలు  కాస్త ఆలస్యమైనా సమాజానికి తప్పక అందుతాయి.
అరటి పండ్ల గెల లాగే గొప్ప పని అనేదేది హఠాత్తుగా సృష్టించబడలేదు. అరటిపండు కావాలంటే, ఆది పువ్వు పూచే దాకా వేచి ఉండాలి, తర్వాత  కాయలు, పండాలి. ఆ తర్వాతే పండ్లు.
ఆలాగే గొప్ప కార్యాలను మనం శక్తితో సాధించలేం, ఓర్పు, పట్టుదలతో మాత్రమే సాధించగలం.
మనం సంకల్పించిన కార్యంకూడా అలాగే అనుకుందాం.
మనవల్ల అయ్యేవి చేయడం ద్వారా మనకు శక్తి రాదు. ఒకప్పుడు మనం చేయలేమనుకున్న వాటిని అధిగమించినప్పుడే మనకూ ఆ శక్తి వస్తుంది.. అంతే గాక నిజాయితిగా జరిగే ఏ పనికైనా ఆ దైవ / ప్రకృతి సహకారం తప్పక ఉంటుంది అంటారు. కాబట్టి మనం చేసే పనిలో నిజాయితి లోపించకుండ జాగ్రత్తపడటమే మనం చేయాల్సిన అతిపెద్ద పని.
ఆశావాదులుగా ఉందాం.. తప్పకుండా మనం సంకల్పించిన మహా యజ్ఞం దిగ్విజయం  అవుతుంది. దాని ఫలాలూ సమాజానికి అందుతాయి. ఆ సమాజంలో మనమూ ఉంటాము. జయహో..

Sunday, April 9, 2017

ప్రతిభకు చేయుతనిద్దాం

GOOD Efforts by SaiKumar  ,Inter 1st year from NijaMpEt Medipally, Vikaarabad Dist.
Completed the pic of Sadasya's in 3hrs. He is   Old student of Gnana Saraswathi  #RURALGENIUS _పల్లె ఆణిముత్యాల Camp _2015.
Painting is his #PASSION. pls bless him for his Bright Future
#Pencilpainting
గొప్ప అభిరుచితో, పెయింటింగ్ అంటే ప్రాణంగా  ఎదుగుతున్న సాయికుమార్.. ఆ రంగంలో గొప్పగా ఎదగాలని, ఎందరో పల్లెఆణిముత్యాలకు ప్రేరణనవ్వాలని ఆశిద్దాం.

Friday, April 7, 2017

RACHAKONDA లో రామ కళ్యాణం @ శ్రీరామనవమి_2017

#RACHAKONDA #TELANGANA #CapitalCity

రాచకొండలో రాముని కళ్యాణం. కమణీయం.. రమణీయం.. అంతా రామమయం.
కల్మషం లేని పల్లె  మనుషుల నిండు హృదయాలతో అ కళ్యాణ తంతు ఓ మధురఘట్టం.
ఎప్పటిలాగే ఏ అధికారుల ఆదరణలేక, పాలకుల పలరింపు అసలే లేక...లోక క్షేమం ఆశించి స్పందించిన కొన్ని హృదయాలే  "లోకకళ్యాణం కోసమే ఆ రామ కళ్యాణం" అని ముందుండి నిర్వహించుకున్న రమణీయ కళ్యాణం.
భాగ్యనగర్, రంగారెడ్డి ,యాదాద్రి & నల్లగొండ జిల్లాల జనాలతో పాటు, కొండ చుట్టూరా ఉన్న తండాల నుండి తండోపతండాలుగా వచ్చి కొండకింద స్వయంభుగా వెలసిన ఆ కోదండరాముని కళ్యాణం తిలకించి పులకకించిన దృశ్యం అద్బుతం...  
రాచకొండ కాదేమో ఇది రాముని కొండ అనుకుంటూ.. ఆయన దీవెనలే మాకు అండాదండా అంటూ రాత్రంతా భజనలు, జాగారాలతో కొండంతా కోలాహలం చేసిన  సన్నివేశం అద్భుతం. 
ఎవరి అండాదండా లేకుండానే ఇంత ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవం .. పాలకులు స్పందించి, ముందుండి ఘనంగా నిర్వహిస్తే ఆ భద్రాద్రిలో జరిగే రామకళ్యాణంలా జరపొచ్చనేది జనాల అభిప్రాయం...
"ఎవరి ఆజ్ఞా లేకున్నా లోకహితం కోరి "రాచకొండలో  రామకళ్యాణానికి " సహకరించిన సహృదయులందరికీ అందరితరపునా అభినంధనలు, దన్యవాదాలు". వచ్చే ఏడుకన్నా  పాలకులకు కనువిప్పు కలిగి ఉత్సవం గొప్పగా చేస్తారని ఆశిద్దాం.  ప్రకృతి రమణీయంగా ఉండే ఈ ప్రాంతం ఆ "శివ రాముల" నివాస స్థలం.. అందుకే ఇదొక ఆద్యాత్మికతతో కూడిన "సామజిక చైతన్యకేంద్రం" కావాలి. ఈ రాష్ట్రానికే ఒక మణిహారం కావాలి మన ఈ రాచకొండ.
ఇన్నాల్లు దీని ఆనవాళ్ళు నిలిచేలా చూసిన అన్ని దళాలకు  హ్రదయపూర్వక దన్యవాదాలు.

Thursday, March 30, 2017

SALESHWARAM @ NallaMala

సలేశ్వర లింగమయ్య దర్శనం @నల్లమల అడవుల్లో... శ్రీరామనవమి నుండి 5 రోజులు...

కొండ కోనల్లో వెలసిన ఆ దైవాలకన్నా...
ఆ దైవానుగ్రహాన్ని తమ ముందుతరాలకు అందించేందుకు తమ జీవితాలకు సైతం లెక్కచేయక "దారి చెక్కిన"  మార్గదర్శకులకెె మొక్కాలనిపిస్తది.
చెంచులూ....  మంచుకంటే చల్లని మనసున్న మారాజులు మీరు.
కల్మషంలేని మీ నిండు హృదయాలకు వందనాలు.
అన్నీ సవ్యంగా ఉండికూడా తోటివారికోసం ఏమీ చేయలేని, నిస్సహాయకులుగా ఉండె  స్వార్దపరులకు, మీ ఆత్మసౌందర్యం, మీ ఆత్మవిశ్వాసం, మీ గుండె దైర్యం ఒక ప్రేరణగావాలే.. మీరెప్పటికీ ఇలా కల్మషలేములుగానే ఉండాలే.. అందరికీ మార్గదర్శకులుగా ఉండాలే.. ఆ సలేశ్వర లింగడు మీకండగా ఉండాలే..

"సల్లంగ చూడు లింగమయ్య మనాల్లని"