Friday, April 7, 2017

RACHAKONDA లో రామ కళ్యాణం @ శ్రీరామనవమి_2017

#RACHAKONDA #TELANGANA #CapitalCity

రాచకొండలో రాముని కళ్యాణం. కమణీయం.. రమణీయం.. అంతా రామమయం.
కల్మషం లేని పల్లె  మనుషుల నిండు హృదయాలతో అ కళ్యాణ తంతు ఓ మధురఘట్టం.
ఎప్పటిలాగే ఏ అధికారుల ఆదరణలేక, పాలకుల పలరింపు అసలే లేక...లోక క్షేమం ఆశించి స్పందించిన కొన్ని హృదయాలే  "లోకకళ్యాణం కోసమే ఆ రామ కళ్యాణం" అని ముందుండి నిర్వహించుకున్న రమణీయ కళ్యాణం.
భాగ్యనగర్, రంగారెడ్డి ,యాదాద్రి & నల్లగొండ జిల్లాల జనాలతో పాటు, కొండ చుట్టూరా ఉన్న తండాల నుండి తండోపతండాలుగా వచ్చి కొండకింద స్వయంభుగా వెలసిన ఆ కోదండరాముని కళ్యాణం తిలకించి పులకకించిన దృశ్యం అద్బుతం...  
రాచకొండ కాదేమో ఇది రాముని కొండ అనుకుంటూ.. ఆయన దీవెనలే మాకు అండాదండా అంటూ రాత్రంతా భజనలు, జాగారాలతో కొండంతా కోలాహలం చేసిన  సన్నివేశం అద్భుతం. 
ఎవరి అండాదండా లేకుండానే ఇంత ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవం .. పాలకులు స్పందించి, ముందుండి ఘనంగా నిర్వహిస్తే ఆ భద్రాద్రిలో జరిగే రామకళ్యాణంలా జరపొచ్చనేది జనాల అభిప్రాయం...
"ఎవరి ఆజ్ఞా లేకున్నా లోకహితం కోరి "రాచకొండలో  రామకళ్యాణానికి " సహకరించిన సహృదయులందరికీ అందరితరపునా అభినంధనలు, దన్యవాదాలు". వచ్చే ఏడుకన్నా  పాలకులకు కనువిప్పు కలిగి ఉత్సవం గొప్పగా చేస్తారని ఆశిద్దాం.  ప్రకృతి రమణీయంగా ఉండే ఈ ప్రాంతం ఆ "శివ రాముల" నివాస స్థలం.. అందుకే ఇదొక ఆద్యాత్మికతతో కూడిన "సామజిక చైతన్యకేంద్రం" కావాలి. ఈ రాష్ట్రానికే ఒక మణిహారం కావాలి మన ఈ రాచకొండ.
ఇన్నాల్లు దీని ఆనవాళ్ళు నిలిచేలా చూసిన అన్ని దళాలకు  హ్రదయపూర్వక దన్యవాదాలు.

No comments:

Post a Comment