అవును.. అత్యవుసరం, అనివార్యం కూడా.
ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు తీసుకుంటున్న ప్రతీ వ్యవస్థలోని ప్రతీ వ్యక్తి (సర్పంచ్ నుండి రాష్ట్రపతి _అటెండర్ నుండి కలెక్టర్ వరకు) తమ కుటుంబ సబ్యుల పిల్లలను విధిగా ప్రభుత్వ బడుల్లో చదివించాలి. ప్రతిభావంతులే ప్రబుత్వ ఉద్యోగాలు సాధిస్తారు. అలాంటి వారే పిల్లల భవిష్యత్తుకోసం ఆలోచిస్తారు. అందుకే తమపిల్లల్లాగా అందరూ ఎదగాలని ఆలోచిస్తే వ్యవస్థ బాగుపడతది. గమనించాల్సింది వీరంతా ప్రజా ధనం నుండి జీతాలు పొందుతున్నారు. వ్యవస్థ బాగుకోసం ముందడుగు వేయాలి. వీరికి ప్రభుత్వ_ ప్రజాధనం నుండి జీతాలు కావాలి గాని ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదని ప్రజలు ప్రశ్నించి, తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లల భవిష్యత్తు కోసం తిరగబడక ముందే వ్యవస్థ తెరుకోవాలి. ఇది అత్యవుసరం, అనివార్యం కూడా..దేశంకోసం.
Monday, April 10, 2017
COMMON MAN
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment