TQ dear GSS TRUSTEES.
Gnana Saraswathi SewaSamithi(GSS) TRUSTEES meeting Successfully completed on 08.04.2017. selected the 150 names from all our Well-wishers fr 6 different Committees fr SARASWATHI MAHA YAGNAM with 108 Idols vl b held in Jan_2018.
రేపటి తరంకోసం నేడు మనం వెచ్చిస్తున్న ప్రతీ నిమిషం విలువైనదే. సంపద కంటే కూడా సమయానికే యెక్కువ విలువిస్తున్న నేటి కాలంలో, మనం చేస్తున్న పని, ఇస్తున్న సమయాన్ని చూసి కొంతమంది నవ్వుకున్నా, అప్పుడప్పుడూ మనకూ ఇంత అవసరమా అని అనిపించినా.. నిరాశ పడక, నిస్వార్దంగా మనం చేస్తున్న పని యొక్క ఫలాలు కాస్త ఆలస్యమైనా సమాజానికి తప్పక అందుతాయి.
అరటి పండ్ల గెల లాగే గొప్ప పని అనేదేది హఠాత్తుగా సృష్టించబడలేదు. అరటిపండు కావాలంటే, ఆది పువ్వు పూచే దాకా వేచి ఉండాలి, తర్వాత కాయలు, పండాలి. ఆ తర్వాతే పండ్లు.
ఆలాగే గొప్ప కార్యాలను మనం శక్తితో సాధించలేం, ఓర్పు, పట్టుదలతో మాత్రమే సాధించగలం.
మనం సంకల్పించిన కార్యంకూడా అలాగే అనుకుందాం.
మనవల్ల అయ్యేవి చేయడం ద్వారా మనకు శక్తి రాదు. ఒకప్పుడు మనం చేయలేమనుకున్న వాటిని అధిగమించినప్పుడే మనకూ ఆ శక్తి వస్తుంది.. అంతే గాక నిజాయితిగా జరిగే ఏ పనికైనా ఆ దైవ / ప్రకృతి సహకారం తప్పక ఉంటుంది అంటారు. కాబట్టి మనం చేసే పనిలో నిజాయితి లోపించకుండ జాగ్రత్తపడటమే మనం చేయాల్సిన అతిపెద్ద పని.
ఆశావాదులుగా ఉందాం.. తప్పకుండా మనం సంకల్పించిన మహా యజ్ఞం దిగ్విజయం అవుతుంది. దాని ఫలాలూ సమాజానికి అందుతాయి. ఆ సమాజంలో మనమూ ఉంటాము. జయహో..
No comments:
Post a Comment