నమ్మకమే ఒక శక్తి .
పచ్చినిజం _ స్వయానుభవం...
నమ్మకమే నమ్మకమే నమ్మకమే.
పద పదరా సద అని తోసేసింది పదుగునిరి తోడిచ్చిందీ..
నమ్మకమే నమ్మకమే నమ్మకమే..
పదిమందిలో మాట్లాడే పలుకయ్యింది_
పదుగురినీ ఒప్పించే మాటయ్యిందీ..
నమ్మకమే నమ్మకమే నమ్మకమే
పసిపిల్లల పైసలతో చదువులమ్మకో గుడికట్టిచ్చిందీ _నాకా శక్తిచ్చిందీ.
నమ్మకమే నమ్మకమే నమ్మకమే.
ఏమున్నా లేకున్నా _ వెంటెవ్వరూ రాకున్నా
నేనున్నా నేనున్నానని నను ముందుకు తోసిందీ నా వెనకాలే నడిసింది
నమ్మకమే నమ్మకమే నమ్మకమే....
No comments:
Post a Comment