#రాచకొండ #హమారా #షాన్ హై..
#Rachakonda is our #heritage.
If it is recognized as a #national #treasure and developed without objection, it will be a #treasure for the #country.
ఎప్పటినుండో ఉన్న బలమైన కోరిక..
బాగా వర్షం పడుతున్న సమయంలో రాచకొండలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలి, పూర్వపు #రాచకొండదళం ఈ ప్రదేశంలో వర్షానికి ఎలా పనిచేసింది, వాళ్ళ స్థావరాలు ఎలా ఉండేవో తెలుకోవాలని...
ఈ రోజు భారీ వర్షం ఉన్నది అని వాతావరణ శాఖ చెపితే నమ్మి😀..
వర్షంలో #రాచకొండ పరిసరాలు చుట్టి వద్దామని.. కావాల్సిన తిండీ గట్రా సామాను తయారు చేసుకొని, ఓ 16మంది వెళ్ళాం..
కానీ వర్షం మాకు భయపడిoది😀 అసలు రాలే...ఇంకేం చేస్తాం తీసుకెళ్ళింది తిని, కొన్ని ప్రదేశాలు చుట్టి వచ్చాం.. కానీ ఇంకోసారి మోసపోయేది లేదు...ఇంకోసారి వర్షంలోనే వెళ్ళేది..
ఉన్న బండల కొనాలకు ఎక్కి #పోటోలు, వీడియోలు దిగి వస్తిమి.
కానీ అక్కడి ప్రతీ రాయి, బండ మనతో మమేకం అవుతాయి.
#రాచకొండ #హమార షాన్ హై.
ప్రతీ కార్తీకపౌర్ణమి రోజున ఈ పరిసర ప్రాంతాల వారి భాగస్వామ్యంతో ఓం #అఖండజ్యోతి #ప్రజ్వలన జరుగుతుంది. ఈ మహా కార్యం 2014 సంవత్సరం నుండి ప్రతి ఏడూ నిర్వహించ బడుతుంది.
ఆ కార్యం కోసమేమో మాకు రాచకొండ తో ప్రత్యేక అనుబంధo ఏర్పడి అవకాశం చిక్కినప్పుడల్లా వెళ్తాము.
రాచకొండ మన వారసత్వ సంపద.
జాతీయ సంపదగా గుర్తించి, అభ్యంతరం లేకుండా అభివృద్ధి చేస్తే దేశానికే ఒక మణిహారం అవుతుంది.
#రాచకొండ #హమారా #షాన్ #హై.
#Rachakonda is our #heritage.
If it is recognized as a #national #treasure and developed without objection, it will be a #treasure for the #country.
#Rachakonda #సదావెంకట్
No comments:
Post a Comment