Wednesday, July 26, 2023

దేవ సైనికులు

దేవ సైనికులు
గుడిలో జీవ రక్షణకు దేవుడున్నాడు
సరిహద్దులో దేశరక్షణకు సైనికుడున్నాడు
గుడిలో భక్తులు నిలబడితే
సరిహద్దులో సైనికులు నిలబడ్డారు

గుడిలో భక్తుల ఆత్మనివేదన
సరిహద్దులో  సైనికుల ఆత్మ సమర్పణ

గుడి గోపురాలలో ఘంటల చప్పుడు
సరహద్దులలో మందుగుండు చప్పుడు

దేవుడి రక్షణకు ద్వారపాలకులు
దేశరక్షణకు వీరసైనికులు

యోగులద్వారా కళ్ళుమూసుకుని ధ్యానం
యోధుల ద్వారా కళ్ళు తెరుచుకునే  ధ్యానం 

పురాణాలలో శతృసంహారానికి దేవుడు అవతరిస్తే
ఈ యుగంలో శతృసంహారానికి సైనికులు అవతరించారు.

 :~ - by హీరేమగళూరు కణ్ణన్.

**************
🖕అక్షర సత్యాలు..
దైవభక్తితో నిండిన దేశభక్తి గుళికలు..
నిత్యo స్పృహతో ఉండేoదుకు కావలసిన ప్రేరణాత్మక అక్షర ప్రసాదం. ఆస్వా దిద్దాం.. ఆచరిద్దాం.

లోక కల్యాణం కోసం చైతన్యాన్ని ప్రసాదించడానికి  వెలసిన దేవదేవుడితో పాటు నిత్యం ఆయన సేవలో తరించే సేవకులకూ మ్రొక్కుదాం🙏🙏..
మన దేశం ఉంటేనే మనo ఉన్నాం, మన ఆలయాలు_ఆశ్రమాలు, పీఠాలు_ మఠాలు ఉన్నాయ్/ ఉంటాయ్.. 
వాటికి అండగా ఉండడం మనoదరి బాధ్యత.. అదీ దైవ సేవే, దేశ సేవే...

దైవకార్యంలో దేశకార్యంలో అందురు సమానులే, అందరూ సామాన్యులే ఆచరిద్దాం.
:~ సదా వెంకట్.

No comments:

Post a Comment