Thursday, July 20, 2023

ఆఖoడ సమావేశం@ 21.07.2020

#వీరపట్నంఅఖండట్రస్ట్ సమావేశం.
సంకల్పించిన #108అడుగుల #పంచముఖఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి 108 మంది సభ్యులతో బృందం ఏర్పాటు కోసం #వీరపట్నంఅఖండట్రస్ట్ మొదటి సన్నాహక సమావేశం నిర్వహించింది. 
#వీరపట్నంపెద్దచెరువు కేంద్రంగా ఆరు మండలాల నుంచి ఎంపిక చేసిన కొద్ది మందితో ఈ రోజు ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్స్ లో సమావేశం జరిగింది. 

ఆరు మండలాల నుంచి ప్రతినిధులు 30 మంది కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు..
 శ్రావణమాసం చివరి వరకు #108మందిసభ్యులను ఎంపిక చేసి పూర్తి స్థాయి బృందాన్ని ప్రకటిస్తుంది  #ట్రస్ట్.
ఈ 108 మంది బృందంలో ప్రత్యక్ష రాజకీయాలలో లెనివారు ఉంటారు. ప్రజాప్రతినిధులు,ఇతరులను వేరు వేరు  విభాగాలుగా విభజించి మహా సంకల్పానికి అనుగుణంగా కార్యాచరణ ఉంటుందని ట్రస్ట్  సభ్యులు తెలిపారు. 
ఈ సమావేశంలో ప్రముఖ వ్యాపారవేత్త కళ్లెం పెంటారెడ్డి , 
 జైని రాంరెడ్డి, బిక్షపతి, ఒరుగంటి శ్రీనివాస్, శేరిగూడా మాజీ సర్పంచ్ పాండు రంగా రెడ్డి, ఉప్పరిగూడ బీమ్ రెడ్డి,  చందర్ నాయక్, ప్రవీణ్ రెడ్డి, జంగయ్య, శ్రీదర్, శివశంకర్, కోటాచారి, శ్రీనివాస్, చందు,శశిదర్, భాను తదితరులు పాల్గొన్నారు. 
గౌరవ అతిథిగా శ్రీ మల్లికార్జున్ గారు పాల్గొన్నారు.
#వీరపట్నంఅఖండట్రస్టు సభ్యులు పాండు, శ్రీనివాస్, రమేశ్ ల ఏర్పాట్ల పర్యవెక్షనలో #ట్రస్ట్ #వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి విగ్రహ నిర్మాణానికి సంబందిoచిన పూర్తి వివరాలు, కార్యాచరణ విషయాలు సబ్యులందరికీ తెలిపారు.
*పూజ్య #శ్రీవిద్యారణ్యస్వామీజీ ఆశీస్సులతో సమావేశం ముగిసింది*.
:~ #వీరపట్నంఅఖండట్రస్ట్*.

No comments:

Post a Comment