A post of 10.07.2017.
తెలంగాణకు రాజధానిగా వెలుగొందిన మన రాచకొండలో ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందబోయే మన సరళ మైసమ్మ ఆలయం. #SARALAMAISAMMAప్రకృతి రమణీయత మధ్య, భాగ్యనగరానికి 60km ల దూరంలో ఒక గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు సఫలీకృతం కావాలని ఆశిద్దాం.
మరుగున పడ్డ మన చరితను మనమే సమాజానికి చాటాలే.. తెలంగాణకి తొలి రాజధానిగా వెలుగొంది తొలిబోనం అందుకొన్న మన సరళ మైసమ్మ కే మల్లా తొలిబోనం ఎక్కాలనేది సంకల్పం.
స్వయంబుగా వెలసిన శివయ్యకు అతి సమీపంలో ఈ క్షేత్రం కూడా.. అన్ని పనులకు ఆద్యాత్మిక శక్తి అనుగ్రహం అవుసరం. ఈ రెండు గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలు కేంద్రంగా రాచకొండ పరిసరాలు గొప్ప అభివృద్ధిని, కీర్తిని పొందాలని ఆశిద్దాం.
No comments:
Post a Comment