Friday, May 31, 2024

గద్ద జీవితం ఒక స్పూర్తి

జీవితం లో క్రింద పడితే పక్షి రాజు గద్ద జీవితం నిజం గా ఒక పాఠం. బాగా బతికి చెడితే గద్ద జీవితమే ఒక భగవద్గీత. బద్దకం ఉంటే గద్ద జీవితమే ఒక బైబిల్. నేను ఒంటరి, నేను ఏమీ చేయలేను అనుకుంటే గద్ద జీవితమే ఒక ఖురాన్. నా రాత ఇంతే మారదు, నా కర్మ ఇంతే నేను ఏమీ చేయలేను అనుకుంటే మాత్రం గద్ద జీవితం చదవాల్సిన ఒక గ్రంధం.   
 
నీరు నింగి నేల ఎక్కడైనా సాటిలేని వేట గద్ద దే. ఈ ప్రపంచం లో తెలివి కి ఇంకొకరితో పోటీ లేనిది గ్రద్ద. ఉరుములు మెరుపులతో వర్షం వస్తుంటే సమస్త జంతువులు, పక్షులు ఎక్కడో ఒక చోట దాక్కొని తల దాచుకుంటాయి కానీ గద్ద మాత్రం ఆకాశానికి ఎదురు వెళ్ళి ఉరుములు మెరుపులని దాటుకొని ఆకాశం పైన నిలబడుతుంది.   

గ్రద్ద దాదాపు 70 యేండ్లు జీవిస్తుంది.అయితే 40 యేండ్లకే గోళ్ళు బాగా పెరిగిపోయి కాళ్ళలోకి వంపు తిరిగి తనకే గుచ్చుకుంటాయి, రెక్కలు బాగా పెరిగిపోయి శరీరానికి అతుక్కుపోయి బరువు ఎక్కుతాయి, ఎగరటం కష్టమవుతుంది, పొడవైన దాని ముక్కు కొన చివర వంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు. తన మీద తనకే అసహ్య మేస్తుంది. ఆ 40 వ యేట దాని ముందున్నవి రెండే రెండు దార్లు; నా బతుకు ఇంతే, నా కర్మ ఇలానే తగలబడ్డది, నా రాత ఇంతే అని అనుకొని ఆహారాన్ని సంపాదించుకోలేక, ఎగరలేక సుష్కించి మరణించటం లేదా తనని తాను మార్చుకోవటం. 

అయితే ఇక్కడ గద్ద రెండో మార్గాన్ని ఎంచుకుంటుంది. నేను మారతాను, నా జీవితాన్ని మార్చుకుంటాను అనుకుంటుంది. దగ్గరలో ఉన్న ఒక పెద్ద కొండ శిఖరం దగ్గరికి వెళ్లి పెరిగిన ముక్కుని వలిచివేసుకుంటుంది. అత్యంత బాధ, కొన్ని సార్లు రక్తం. ఆహారం ఉండదు. అయినా అలానే ఉండి కొత్త ముక్కు వచ్చేంత వరకు వేచి ఉంటుంది. కొత్తగా వచ్చి ముక్కు పదును పెరిగాక వాటి సహాయం తో పెరిగిన గోళ్ళని కత్తిరించుకుంటుంది, వదిలించుకుంటుంది. మళ్ళీ రక్తం, బాధ. అయినా భరిస్తుంది. కాలిగోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయం తో పెరిగిన బరువైన రెక్కలని తొలగించుకుంటుంది, పీకేస్తుంది. మళ్ళీ రక్తం, నరకయాతన. అయినా భరిస్తుంది. . వీటి అన్నీటితో పాటు ఆకలి. ఇదంతా జరగటానికి ఒక 6 నెలల సమయం పడుతుంది. 

ఆకాశమే హద్దు గా జీవించిన స్వేచ్చా విహంగం, ఆ అకాశాన్ని చూస్తూ మాత్రమే బతుకుటుంటుంది ఒక 6 నెలలు. అప్పటిదాకా గ్రద్ద ని విస్మయం గా చూసిన మిగతా పక్షులు దాని స్తబ్దతని అచేతనాస్థితి ని చూసి విస్తుపోతూ ఉంటై. గ్రద్ద మాత్రం తనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని ఖచ్చితం గా తెలుసు. ఎవరు ఏమనుకున్నా మౌనం గా ఉంటుంది కొన్ని నెలలు

ఆ విధం గా ఉండి కఠోర సాధన చేసి మళ్ళీ కొత్త ముక్కు, కొత్త గోళ్ళు, మంచి రెక్కలు సాధించుకొని పునర్జన్మ సాధించుకొని ఇంకో 30 యేండ్లు మళ్ళీ రాజు లాగ బతుకుతూ నీరు, నింగి, నేల లో తన ఆధిపత్యాన్ని చూపిస్తూ హాయిగా బ్రతుకుతుంది. 

ఒక పక్షి సాధన చేసి మార్చుకోగా లేనిది, మనిషి మార్చుకోలేడా..? పడిన మనిషి మళ్ళీ లేవలేడా..? సాధన, ఓపిక ఉంటే మనిషి తనని తాను మార్చుకోవచ్చు అంటారు పెద్దలు.

Tuesday, April 16, 2024

మన సంకల్పమే మన ఆయుధం

🚩ఈరోజు ఎలా ఉన్నా రేపు బాగుంటుంది అనే నమ్మకం, రేపెలా ఉన్నా ఎదుర్కో గలననే ధైర్యం ఉన్నంత కాలం మనల్ని ఎవ్వరూ ఆపలేరు. మనం నమ్మిన సిద్ధాంతాల కోసం నిక్కచ్చిగా నిలబడితే ఏదో ఒక రోజు మనం నడిచిన దారే మన వారికి వెలుగు చూపుతుంది.
🟨 *ఎదగాలి అనే తపన.. ఎదిగాము అన్న గర్వం లేకుంటే.. ఎదుగుతూనే ఉంటాo*. బలం అందరికీ ఉంటుంది సంకల్పబలం కొందరికి మాత్రమే ఉంటుంది అది ఉన్నవారే విజయాల్ని సాధించగలరు.
🟣ఆశయాలు చెక్కు చెదర కుండా నమ్మకం సడలి పోకుండా చూసుకోవాలి. కనుచూపు మేరలో కష్టం ఉన్నా కనపడని శక్తి మనల్ని కాపాడుతూనే ఉంటుంది. మన నమ్మకమే మనకు శ్రీరామరక్ష అని అంటాడు *రాగో*.
       🚩 *ధర్మో రక్షతి రక్షితః* 🚩
            
      

Thursday, February 1, 2024

Re-Set & Re Start

Re-Set & Re-Start...
పల్లెల్లోని ఆర్థిక నిరుపేద ప్రతిభావంతులకు సరైన సమయంలో అండగా ఉండాలన్న సదాశయాన్ని సజీవంగా ఉండనిస్తూ, కలుపును తీస్తూ- కార్యానికి కావాల్సిన  ఉపకరణాలను జోడిస్తూ...
 ప్రతీ పనిలో వెన్నంటి ఉంటున్న ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏....
ప్రకృతి ఆదేశానుసారం ఆశయంలో బాగస్తులవుతున్న ప్రతీ సహృదయానికి  శుబాబినందనలు💐.
ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్న పెద్దల మాట ఆచరిద్దాం🙏.

Tuesday, January 30, 2024

కార్యకర్తల సమావేశం@ అఖండ

హరివర అఖండక్షేత్రం
వీరపట్నం, రంగారెడ్డి జిల్లా.
హరివర అఖండక్షేత్ర సమితి సభ్యుల సమావేశం.
తేదీ: 30.01.2024, స్థలం  AMR Convention Hall, శేరిగూడ

 హరివర అఖండక్షేత్రoలో నిర్మించ సంకల్పించిన 108 అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణ శంకుస్థాపన 30.03.2024, శనివారం జరిగే సందర్భంగా.. 
క్షేత్రసమితి ఆధ్వర్యంలో వివిధ ముఖ్యమైన కార్య విభాగాల సన్నాహాక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ.అమర లింగన్న గారు (ధర్మ జాగరణ సంస్థ, కర్ణాటక,ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాల ప్రముఖ్) హాజరై మార్గదర్శనం చేయడం జరిగింది.
***************
ఈ సందర్భంగా సమావేశాన్ని  ఉద్దేశిస్తూ ముఖ్య అతిథి శ్రీ అమర లింగన్న గారు విగ్రహ నిర్మాణ సంకల్పం యొక్క విశిష్టతను మరొకసారి గుర్తు చేశారు. ఈ సంకల్పంతో జరిగే పనివలన భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఈ క్షేత్రం గురుంచి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం మనం అత్యంత అనుకూలమైన వాతావరణంలో ఉన్నాము కనుక సంకల్పం యొక్క కార్యంలో అందరం అధిక సమయం ఇచ్చి త్వరగా కార్యసిద్ధి కోసం పూర్తి తయారీ చేసుకోవాలని, అఖండ క్షేత్రసమితి ఇచ్చే ప్రతి పనికి సిద్దంగా ఉండాలని సూచించారు. అదే విధంగా హరివర అఖండక్షేత్రం ఇప్పటి వరకు కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఒడిదుడుకులు ఎదర్కొని, వాటిని నివారించుకొని ఇప్పుడు పూర్తి పనిలోకి అడుగుపెడుతోందని తెలిపారు. కార్యం ప్రారంభం తర్వాత వచ్చే సమస్యలకు ఏ మాత్రం వెనుకడుగేయకుండ, చేసే ప్రతి పనిలో కార్యం యొక్క లక్ష్యం పై దృష్టి సారించి వ్యక్తిగత సమస్యలను కూడా సమతుల్యం చేస్తూ దైవ కార్యంలో నిమగ్నమవ్వాలని దీనికి ఉదాహరణగా రామ కార్యంలో హనుమంతుడు కూడా ఒకానొక సందర్భంలో లంక చేరినప్పుడు కొద్దిపాటి నైరాశ్యం వచ్చిన తనకు తాను స్ఫూర్తిని నింపుకొని అప్పజెప్పిన పనిని సమర్దవంతంగా నిర్వహించిన తీరును వివరించారు. దైవ కార్యంలో సమయం ఇచ్చి నిబద్దతతో పనిచేసే కార్యకర్తలకు భగవంతుని యొక్క అనుగ్రహం వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందని ఉటంకించారు. ఈ మహసంకల్పంలో పనిచేసే ప్రతి కార్యకర్త హనుమంతుని గుణగణాలను ఎప్పటికప్పుడు నెమరువేస్తు , లక్ష్యం పూర్తయ్యే వరకు సంపూర్ణ హృదయంతో పనిచేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.

సమావేశం ప్రారంభంలో వీరపట్నం అఖండట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు మాట్లాడుతూ సమావేశానికి హాజరైన వివిధ ముఖ్యమైన కార్య విభాగాల సభ్యులతో ఆయా విభాగాల కార్యనిర్వహణ, తీరుతెన్నలు, వాటికి కావలసిన కార్యకర్తల గణాన్ని పెంచుకోవాలని ,ఈ సంకల్పంలో భాస్వామ్యులను చేయవలసిన వివిధ రంగాలలో వున్న విశిష్టత వ్యక్తులను కూడా గుర్తించాలని సూచించారు. కుల-వర్గ, రాజకియాలకు అతీతంగా ఈ మహా కార్యంలో అందరినీ బాగస్తులను చేస్తాము, సమయానుకూలంగా అందరి సేవలను ఉపయోగించు కావాలని తెలిపారు.

 సమావేశంలో క్షేత్ర సమితి సభ్యులు, వివిధ మండలాల ప్రముఖులు, ప్రచార విభాగం సభ్యులు, సాంకేతిక విభాగం సభ్యులు పాల్గొనడం జరిగింది.
:~ హరివర అఖండ క్షేత్రసమితి & వీరపట్నo అఖండ ట్రస్ట్.

Wednesday, January 10, 2024

హరివర అఖండక్షేత్రం on 09.01.2024

హరివర అఖండ క్షేత్రాన్ని దర్శిoచుకున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు
*ఆశీస్సులు అందించిన పూజ్యశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ.*

*https://m.facebook.com/story.php?story_fbid=899881655127877&id=100014092788608&mibextid=Nif5oz*

*108 అడుగుల హనుమాన్ విగ్రహ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని మల్ రెడ్డి రంగారెడ్డి గారు తెలిపారు.*

   వీరపట్నం పెద్దచెరువు కొనకట్టన ఉన్న 
శ్రీ హరివర అఖండ క్షేత్రంలో 13వ మాసం పవనమాన హోమం మరియు 189వ వారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమానికి  హాజరై హనుమాన్ దైవ  దర్శినం చేసుకున్న శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డిగారు.
వారు మాట్లాడుతూ...
*ఇక్కడ జరిగిన హనుమాన్ విగ్రహ  సంకల్ప విషయం పూజ్య విద్యారణ్య స్వామీజి 10సంవత్సరాల క్రితం నాకు చెప్పి, మీరు పూర్తిగా సహరిoచాలి  అన్నారు, అప్పటి నుండి నాకు ఆ విషయం జ్ఞాపకo ఉన్నది.*  *అదే విధంగా ఈ క్షేత్రంలో జరిగిన అన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించారు, నేను వచ్చాను.*  
ఈ అఖండక్షేత్ర నిర్వహకుల శ్రద్ద అద్భుతంగా ఉంటుంది.
*ఈ హరివర అఖండ క్షేత్రంలో వెలిసే హనుమాన్ విగ్రహం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప క్షేత్రం కావాలి, అందుకు నా సంపూర్ణ సహకారం అందిస్తాను.* అవుసరాల కోసం ఈ క్షేత్ర పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమి CM గారితో మాట్లాడి ఇప్పిస్తానని ఎమ్మెల్యే రంగారెడ్డి గారు తెలిపారు. 
*పూజ్య స్వామీజీ మాట్లడుతూ ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ అంతా శుభం జరుగుతుంది. ఈ 108 అడుగుల హనుమాన్ విగ్రహ నిర్మాణం జరిగిన తరువాత ఈ ప్రాంతానికి  అన్ని రకాలుగా శుభం జరుగుతుందన్నారు*

*హరవర అఖండ  క్షేత్రసమితి వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు మాట్లాడుతూ.. ఆంజనేయుడు ఆదర్శంగా యువత ఎదగాలి, వీరపట్నo పరిసర ప్రాంతాలు సుభిక్షంగా సస్యశ్యామలoగా ఉండాలని కాంక్షిస్తూ 108 అడుగుల ఆంజనేయుడి విగ్రహం అందుకు స్ఫూర్తిగా నిలవాలని గత 12 ఏండ్ల క్రితం జరిగిన సంకల్పం జరిగింది.*  *పెద్ద చెరువు చుట్టుపక్కల ఉన్న 108 గ్రామాల వ్యవక్తులను బాగస్వామ్యo ఈ విగ్రహ నిర్మాణం జరుగుతుంది..ఏ తారతమ్యం చూపక అందరూ ఈ నిర్మాణంలో బాగస్తులు అయ్యేలా కార్యాచరణ ఉంటుందని అన్నారు*.
ఈ రోజు జరిగిన పారాయణ కార్యక్రమంలో అందరి అభ్యర్థన మేరకు 
 పూజ్య విద్యారణ్య భారతి స్వామీజీ *విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మార్చ్ 30, 2024 తేదీని ప్రకటించారు.*

అనంతరం హరివర అఖండక్షేత్రం తరపున  
శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారికి సన్మానం చేసి జ్ఞాపికను అందించారు, వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ జరిగింది.
కార్యక్రమంలో స్థానిక మునిసిపల్ చైర్మన్ స్రవంతి, ZPTC మహిపాల్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల నాయకులు, అఖండ క్షేత్ర సభ్యులు రమేష్, చందూ తదితరులు పాల్గొన్నారు.

*https://m.facebook.com/story.php?story_fbid=pfbid02Kmzyv75cj2cz2ywGtwkPMbdhPDhx26xtpa9qdqZBdXf5QhTr5vJK4HLuZSxs28Npl&id=100014092788608&mibextid=Nif5oz*
:~ *హరివర అఖoడ క్షేత్రసమితి* & *వీరపట్నo అఖండ ట్రస్ట్.*