హరివర అఖండ క్షేత్రాన్ని దర్శిoచుకున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు
*ఆశీస్సులు అందించిన పూజ్యశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ.*
*https://m.facebook.com/story.php?story_fbid=899881655127877&id=100014092788608&mibextid=Nif5oz*
*108 అడుగుల హనుమాన్ విగ్రహ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని మల్ రెడ్డి రంగారెడ్డి గారు తెలిపారు.*
వీరపట్నం పెద్దచెరువు కొనకట్టన ఉన్న
శ్రీ హరివర అఖండ క్షేత్రంలో 13వ మాసం పవనమాన హోమం మరియు 189వ వారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమానికి హాజరై హనుమాన్ దైవ దర్శినం చేసుకున్న శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డిగారు.
వారు మాట్లాడుతూ...
*ఇక్కడ జరిగిన హనుమాన్ విగ్రహ సంకల్ప విషయం పూజ్య విద్యారణ్య స్వామీజి 10సంవత్సరాల క్రితం నాకు చెప్పి, మీరు పూర్తిగా సహరిoచాలి అన్నారు, అప్పటి నుండి నాకు ఆ విషయం జ్ఞాపకo ఉన్నది.* *అదే విధంగా ఈ క్షేత్రంలో జరిగిన అన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించారు, నేను వచ్చాను.*
ఈ అఖండక్షేత్ర నిర్వహకుల శ్రద్ద అద్భుతంగా ఉంటుంది.
*ఈ హరివర అఖండ క్షేత్రంలో వెలిసే హనుమాన్ విగ్రహం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప క్షేత్రం కావాలి, అందుకు నా సంపూర్ణ సహకారం అందిస్తాను.* అవుసరాల కోసం ఈ క్షేత్ర పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమి CM గారితో మాట్లాడి ఇప్పిస్తానని ఎమ్మెల్యే రంగారెడ్డి గారు తెలిపారు.
*పూజ్య స్వామీజీ మాట్లడుతూ ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ అంతా శుభం జరుగుతుంది. ఈ 108 అడుగుల హనుమాన్ విగ్రహ నిర్మాణం జరిగిన తరువాత ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా శుభం జరుగుతుందన్నారు*
*హరవర అఖండ క్షేత్రసమితి వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు మాట్లాడుతూ.. ఆంజనేయుడు ఆదర్శంగా యువత ఎదగాలి, వీరపట్నo పరిసర ప్రాంతాలు సుభిక్షంగా సస్యశ్యామలoగా ఉండాలని కాంక్షిస్తూ 108 అడుగుల ఆంజనేయుడి విగ్రహం అందుకు స్ఫూర్తిగా నిలవాలని గత 12 ఏండ్ల క్రితం జరిగిన సంకల్పం జరిగింది.* *పెద్ద చెరువు చుట్టుపక్కల ఉన్న 108 గ్రామాల వ్యవక్తులను బాగస్వామ్యo ఈ విగ్రహ నిర్మాణం జరుగుతుంది..ఏ తారతమ్యం చూపక అందరూ ఈ నిర్మాణంలో బాగస్తులు అయ్యేలా కార్యాచరణ ఉంటుందని అన్నారు*.
ఈ రోజు జరిగిన పారాయణ కార్యక్రమంలో అందరి అభ్యర్థన మేరకు
పూజ్య విద్యారణ్య భారతి స్వామీజీ *విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మార్చ్ 30, 2024 తేదీని ప్రకటించారు.*
అనంతరం హరివర అఖండక్షేత్రం తరపున
శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారికి సన్మానం చేసి జ్ఞాపికను అందించారు, వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ జరిగింది.
కార్యక్రమంలో స్థానిక మునిసిపల్ చైర్మన్ స్రవంతి, ZPTC మహిపాల్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల నాయకులు, అఖండ క్షేత్ర సభ్యులు రమేష్, చందూ తదితరులు పాల్గొన్నారు.
*https://m.facebook.com/story.php?story_fbid=pfbid02Kmzyv75cj2cz2ywGtwkPMbdhPDhx26xtpa9qdqZBdXf5QhTr5vJK4HLuZSxs28Npl&id=100014092788608&mibextid=Nif5oz*
:~ *హరివర అఖoడ క్షేత్రసమితి* & *వీరపట్నo అఖండ ట్రస్ట్.*
No comments:
Post a Comment