Tuesday, January 30, 2024

కార్యకర్తల సమావేశం@ అఖండ

హరివర అఖండక్షేత్రం
వీరపట్నం, రంగారెడ్డి జిల్లా.
హరివర అఖండక్షేత్ర సమితి సభ్యుల సమావేశం.
తేదీ: 30.01.2024, స్థలం  AMR Convention Hall, శేరిగూడ

 హరివర అఖండక్షేత్రoలో నిర్మించ సంకల్పించిన 108 అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణ శంకుస్థాపన 30.03.2024, శనివారం జరిగే సందర్భంగా.. 
క్షేత్రసమితి ఆధ్వర్యంలో వివిధ ముఖ్యమైన కార్య విభాగాల సన్నాహాక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ.అమర లింగన్న గారు (ధర్మ జాగరణ సంస్థ, కర్ణాటక,ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాల ప్రముఖ్) హాజరై మార్గదర్శనం చేయడం జరిగింది.
***************
ఈ సందర్భంగా సమావేశాన్ని  ఉద్దేశిస్తూ ముఖ్య అతిథి శ్రీ అమర లింగన్న గారు విగ్రహ నిర్మాణ సంకల్పం యొక్క విశిష్టతను మరొకసారి గుర్తు చేశారు. ఈ సంకల్పంతో జరిగే పనివలన భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఈ క్షేత్రం గురుంచి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం మనం అత్యంత అనుకూలమైన వాతావరణంలో ఉన్నాము కనుక సంకల్పం యొక్క కార్యంలో అందరం అధిక సమయం ఇచ్చి త్వరగా కార్యసిద్ధి కోసం పూర్తి తయారీ చేసుకోవాలని, అఖండ క్షేత్రసమితి ఇచ్చే ప్రతి పనికి సిద్దంగా ఉండాలని సూచించారు. అదే విధంగా హరివర అఖండక్షేత్రం ఇప్పటి వరకు కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఒడిదుడుకులు ఎదర్కొని, వాటిని నివారించుకొని ఇప్పుడు పూర్తి పనిలోకి అడుగుపెడుతోందని తెలిపారు. కార్యం ప్రారంభం తర్వాత వచ్చే సమస్యలకు ఏ మాత్రం వెనుకడుగేయకుండ, చేసే ప్రతి పనిలో కార్యం యొక్క లక్ష్యం పై దృష్టి సారించి వ్యక్తిగత సమస్యలను కూడా సమతుల్యం చేస్తూ దైవ కార్యంలో నిమగ్నమవ్వాలని దీనికి ఉదాహరణగా రామ కార్యంలో హనుమంతుడు కూడా ఒకానొక సందర్భంలో లంక చేరినప్పుడు కొద్దిపాటి నైరాశ్యం వచ్చిన తనకు తాను స్ఫూర్తిని నింపుకొని అప్పజెప్పిన పనిని సమర్దవంతంగా నిర్వహించిన తీరును వివరించారు. దైవ కార్యంలో సమయం ఇచ్చి నిబద్దతతో పనిచేసే కార్యకర్తలకు భగవంతుని యొక్క అనుగ్రహం వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందని ఉటంకించారు. ఈ మహసంకల్పంలో పనిచేసే ప్రతి కార్యకర్త హనుమంతుని గుణగణాలను ఎప్పటికప్పుడు నెమరువేస్తు , లక్ష్యం పూర్తయ్యే వరకు సంపూర్ణ హృదయంతో పనిచేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.

సమావేశం ప్రారంభంలో వీరపట్నం అఖండట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు మాట్లాడుతూ సమావేశానికి హాజరైన వివిధ ముఖ్యమైన కార్య విభాగాల సభ్యులతో ఆయా విభాగాల కార్యనిర్వహణ, తీరుతెన్నలు, వాటికి కావలసిన కార్యకర్తల గణాన్ని పెంచుకోవాలని ,ఈ సంకల్పంలో భాస్వామ్యులను చేయవలసిన వివిధ రంగాలలో వున్న విశిష్టత వ్యక్తులను కూడా గుర్తించాలని సూచించారు. కుల-వర్గ, రాజకియాలకు అతీతంగా ఈ మహా కార్యంలో అందరినీ బాగస్తులను చేస్తాము, సమయానుకూలంగా అందరి సేవలను ఉపయోగించు కావాలని తెలిపారు.

 సమావేశంలో క్షేత్ర సమితి సభ్యులు, వివిధ మండలాల ప్రముఖులు, ప్రచార విభాగం సభ్యులు, సాంకేతిక విభాగం సభ్యులు పాల్గొనడం జరిగింది.
:~ హరివర అఖండ క్షేత్రసమితి & వీరపట్నo అఖండ ట్రస్ట్.

No comments:

Post a Comment