Saturday, November 7, 2026

చలే ఐసేహీ చలే... దిన్ బ దిన్ చలే!

కొన్ని పరిచయాలు బంధాలుగా మారి, మరికొన్ని అందమైన అనుబంధాలుగా అల్లుకుపోతాయి. అలాంటి బంధాలు ఎప్పుడో నిర్ణయించబడి ఉంటాయేమో అనిపిస్తుంది.
ఎక్కడ, ఎవరితో ఎలా ఉన్నా... మనతో మాత్రం కల్మషం లేని మనసుతో, మన ముందు ఒకలా, వెనుక ఒకలా కాకుండా ఎప్పుడూ ఒకేలా ఉండే వ్యక్తుల అనుబంధం నిజంగా అద్భుతం!
అలాంటి ఒక ఆత్మీయ బంధమే నాకు ఇక్కడ లభించిన, నేను ఆపాజీ (సోదరి) అని పిలుచుకునే మా రాణమ్మ.

సహజంగా నాకు బంధాలు, బంధుత్వాల పట్ల అంతగా మమకారం ఉండదు. కానీ అతి తక్కువ మందితో మాత్రమే మనసుకు అలా అనిపిస్తుంది. అలాంటి కొద్దిమందిలో రాణమ్మ ఒకరు.

'ఆపాజీ' అని పిలవగానే 'అన్నా' అంటూ పలికే ఆ ఆప్యాయతలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఆ పలకరింపులో ఆప్యాయతతో పాటు ఒక హక్కు, ఒక ఆత్మీయత కనిపిస్తాయి. ఒక ఆడపడుచు తన అన్న ఎప్పుడూ ఉన్నతంగా ఎదగాలని, మరింత మంచి స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అడుగడుగునా ఆశీర్వదిస్తున్నట్టుగా ఆమె మాటల్లో, మనసులో ఆ అభిమానం కనిపిస్తుంది.

ఇలాంటి స్వచ్ఛమైన బంధాలకు పేర్లు, పరిచయాలు ముఖ్యం కాదు... మనసుల మధ్య ఉండే అనుబంధమే ముఖ్యం.

చలే ఐసేహీ చలే... దిన్ బ దిన్ చలే! ❤️

No comments:

Post a Comment