అఖండ క్షేత్రం నుంచి ఆరంభమై... చెట్టు-పుట్టా, వాగు-వంకా, పల్లె-పల్లెనా కలియతిరుగుతూ... రాచకొండ గడ్డపై భక్తి చైతన్యాన్ని చాటిన అఖండ సేన!
భక్తి అంటే కేవలం పూజలు, పునస్కారాలే కాదు... అదొక అంతర్గత శక్తి! ధర్మబద్ధమైన జీవనానికి స్ఫూర్తి... ధర్మ పరిరక్షణకు ఒక చైతన్య కవచం! అనే సందేశంతో...
ఒకవైపు శ్రీరామ నామ స్మరణ... మరోవైపు హనుమత్ ధ్యేయం... గుండెల నిండా భక్తి భావం... అడుగడుగునా అంకితభావం!
ROYAL ENFIELD బైక్‌లపై ఏకబిగిన 230 కిలోమీటర్లు ప్రయాణిస్తూ 108 గ్రామాలను అనుసంధానించిన ఈ సేన ప్రయాణం కేవలం వేగానికి, సాహసానికి ప్రతీక కాదు... ఒక ఉన్నత సంకల్పానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతిరూపం!
ఇది కేవలం BIKE RALLY కాదు...
ఇది భక్తి ప్రయాణం...
ఇది ధర్మ చైతన్య యాత్ర...
ఇది పంచముఖ హనుమత్ అనుగ్రహ సంకల్ప యాత్ర!
ఈ పవిత్ర సంకల్ప యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క అఖండ సేన సభ్యుడిపై శ్రీ పంచముఖ హనుమంతుని అపార అనుగ్రహం, ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం!
🚩 సంకల్పం మనది – అనుగ్రహం హనుమాన్‌ది! 🚩
No comments:
Post a Comment