జీవితం లో క్రింద పడితే పక్షి రాజు గద్ద జీవితం నిజం గా ఒక పాఠం. బాగా బతికి చెడితే గద్ద జీవితమే ఒక భగవద్గీత. బద్దకం ఉంటే గద్ద జీవితమే ఒక బైబిల్. నేను ఒంటరి, నేను ఏమీ చేయలేను అనుకుంటే గద్ద జీవితమే ఒక ఖురాన్. నా రాత ఇంతే మారదు, నా కర్మ ఇంతే నేను ఏమీ చేయలేను అనుకుంటే మాత్రం గద్ద జీవితం చదవాల్సిన ఒక గ్రంధం.
నీరు నింగి నేల ఎక్కడైనా సాటిలేని వేట గద్ద దే. ఈ ప్రపంచం లో తెలివి కి ఇంకొకరితో పోటీ లేనిది గ్రద్ద. ఉరుములు మెరుపులతో వర్షం వస్తుంటే సమస్త జంతువులు, పక్షులు ఎక్కడో ఒక చోట దాక్కొని తల దాచుకుంటాయి కానీ గద్ద మాత్రం ఆకాశానికి ఎదురు వెళ్ళి ఉరుములు మెరుపులని దాటుకొని ఆకాశం పైన నిలబడుతుంది.
గ్రద్ద దాదాపు 70 యేండ్లు జీవిస్తుంది.అయితే 40 యేండ్లకే గోళ్ళు బాగా పెరిగిపోయి కాళ్ళలోకి వంపు తిరిగి తనకే గుచ్చుకుంటాయి, రెక్కలు బాగా పెరిగిపోయి శరీరానికి అతుక్కుపోయి బరువు ఎక్కుతాయి, ఎగరటం కష్టమవుతుంది, పొడవైన దాని ముక్కు కొన చివర వంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు. తన మీద తనకే అసహ్య మేస్తుంది. ఆ 40 వ యేట దాని ముందున్నవి రెండే రెండు దార్లు; నా బతుకు ఇంతే, నా కర్మ ఇలానే తగలబడ్డది, నా రాత ఇంతే అని అనుకొని ఆహారాన్ని సంపాదించుకోలేక, ఎగరలేక సుష్కించి మరణించటం లేదా తనని తాను మార్చుకోవటం.
అయితే ఇక్కడ గద్ద రెండో మార్గాన్ని ఎంచుకుంటుంది. నేను మారతాను, నా జీవితాన్ని మార్చుకుంటాను అనుకుంటుంది. దగ్గరలో ఉన్న ఒక పెద్ద కొండ శిఖరం దగ్గరికి వెళ్లి పెరిగిన ముక్కుని వలిచివేసుకుంటుంది. అత్యంత బాధ, కొన్ని సార్లు రక్తం. ఆహారం ఉండదు. అయినా అలానే ఉండి కొత్త ముక్కు వచ్చేంత వరకు వేచి ఉంటుంది. కొత్తగా వచ్చి ముక్కు పదును పెరిగాక వాటి సహాయం తో పెరిగిన గోళ్ళని కత్తిరించుకుంటుంది, వదిలించుకుంటుంది. మళ్ళీ రక్తం, బాధ. అయినా భరిస్తుంది. కాలిగోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయం తో పెరిగిన బరువైన రెక్కలని తొలగించుకుంటుంది, పీకేస్తుంది. మళ్ళీ రక్తం, నరకయాతన. అయినా భరిస్తుంది. . వీటి అన్నీటితో పాటు ఆకలి. ఇదంతా జరగటానికి ఒక 6 నెలల సమయం పడుతుంది.
ఆకాశమే హద్దు గా జీవించిన స్వేచ్చా విహంగం, ఆ అకాశాన్ని చూస్తూ మాత్రమే బతుకుటుంటుంది ఒక 6 నెలలు. అప్పటిదాకా గ్రద్ద ని విస్మయం గా చూసిన మిగతా పక్షులు దాని స్తబ్దతని అచేతనాస్థితి ని చూసి విస్తుపోతూ ఉంటై. గ్రద్ద మాత్రం తనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని ఖచ్చితం గా తెలుసు. ఎవరు ఏమనుకున్నా మౌనం గా ఉంటుంది కొన్ని నెలలు
ఆ విధం గా ఉండి కఠోర సాధన చేసి మళ్ళీ కొత్త ముక్కు, కొత్త గోళ్ళు, మంచి రెక్కలు సాధించుకొని పునర్జన్మ సాధించుకొని ఇంకో 30 యేండ్లు మళ్ళీ రాజు లాగ బతుకుతూ నీరు, నింగి, నేల లో తన ఆధిపత్యాన్ని చూపిస్తూ హాయిగా బ్రతుకుతుంది.
ఒక పక్షి సాధన చేసి మార్చుకోగా లేనిది, మనిషి మార్చుకోలేడా..? పడిన మనిషి మళ్ళీ లేవలేడా..? సాధన, ఓపిక ఉంటే మనిషి తనని తాను మార్చుకోవచ్చు అంటారు పెద్దలు.
No comments:
Post a Comment