Sunday, April 9, 2023

వివేకవాణి శిరసా నమామి

నమ్మిన కార్యంకోసం/ సంస్తకోసం కార్యకర్త ఎలా పనిచేయాలి అనే విషయంలో హనుమాన్ నీ ఆదర్శంగా తీసుకోమన్న స్వావిన. 
*వివేకవాణి శిరసా నమామి*
 
నన్ను గుర్తించకోయినా పరవాలేదు, నా భావాలను అంగీకరిస్తే చాలు, కామకాoఛనాలను జయించిన సాధువులైనా కీర్తి, ప్రతిష్టల వలలో చిక్కుకుపోవడం జరుగుతుంది. సంపూర్ణమైన నిష్కామకర్మ చేయాలి. ప్రజలు మనను ఏ విధంగానైనా భావించవచ్చు, నిందించవచ్చు, ప్రశంసిoచవచ్చు  కానీ మన ఆదర్శాలను వదలకుండా పనిచేయాలి.

మహావీర హనుమాన్ ని మీ ఆదర్శంగా స్వీకరించాలి. రామజ్ఞతో మహాసాగరాన్ని మరణం అన్న ఆలోచన లేకుండా అవలీలగా దాటాడు. పరిపూర్ణమైన ఇంద్రియనిగ్రహం, అద్భుతమైన ధీశక్తి కలిగిన మహావీరుడు. అటువంటి గొప్ప సేవ, ఆదర్శాలు ఆధారంగా మీ జీవితాలు నసుపుకోవాలి. అప్పుడు మెల్లమెల్లగా మిగిలిన ఆదర్శాలనీ మీ జీవితాలలో వ్యక్తమవుతాయి. గురువుపట్ల సంపూర్ణ విధేయత, బ్రహ్మచర్యం.. ఇదే విజయ రహస్యం. ప్రపంచాన్ని అబ్బురపరిచే సేవాతత్పరత, సింహ సదృశ శౌర్యం, రామకార్యానికై ప్రాణత్యాగానికైనా వెనకాడని ధీరత్వం, రాముని సేవపట్ల తప్ప ఇతర విషయాలపై నిరాసక్తత, బ్రహ్మ, శివ పదాన్నైనా పొందడానికి విముఖత, రామ కార్యాచరణే జీవిత లక్ష్యంగా గల మహావీరుడి లాంటి హృదయ పూర్వక భక్తి కావాలి.
:~ స్వామీ వివేకానంద.

Thursday, April 6, 2023

చైత్ర పౌర్ణమి@హనుమాన్ విజయోత్సవం

లంకలో రావణాసుర వధ అనంతరం విభీషణుడికి రాజ్య పట్టాభిషేకం గావించి 
శ్రీరామచంద్రుడు సీతమ్మ, లక్ష్మణ, హనుమత్ సమేతంగా అయోధ్యకు చేరుకుంటాడు. 
చైత్ర శు.దశమి నాడు రాముడి పట్టాభిషేకం జరుగుతుంది..
రావణుడిని జయించి ధర్మరక్షణ గావించిన ఆనందం, శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైన హనుమంతుడు  వేలాది సహచర వానరులతో కలిసి చైత్ర పున్నమి నాడు అయోధ్యా నగరంలో విజయ మహా యాత్ర పేరుతో పెద్ద శోభాయాత్రను నిర్వహించాడట..
ఆనాడు హనుమంతుడు నిర్వహించిన శోభాయాత్రను ఈ కలియుగంలో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణమి నాడు మనం వీరహనుమాన్ విజయ యాత్ర పేరుతో నిర్వహించుకుంటున్నాము.

  ఈ ఉత్సవ లక్ష్యం సమాజసంఘటన, ధర్మ రక్షణ..

భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఈ రోజున హనుమంతుడి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు..

Wednesday, April 5, 2023

హనుమాన్ విగ్రహం దర్సనం@నర్కుడ

 
Facebook Post of 06.04.2022
నవవ్యాకరణ కోవిదుడు, సర్వ శక్తిమంతుడు, 
అతి బలవంతుడు, కార్యదక్షుడు,
దృఢ సంకల్పుడు వంటి అనేక సుగుణాల సమ్మిళితుడు  అయినప్పటికీ ధర్మానికి దాసుడైన హనుమాన్ జీవితమే మనకు #ఆదర్శం, #ప్రేరణ...

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తనకిమ్ వద
రామదూత కృపాo సిoదో మమకార్యం సాధయ ప్రభో🙏*.
నర్కుడ గ్రామంలో #అభయాంజనేయ స్వామి విగ్రహావిష్కరణలో #వీరపట్నంఅఖండ బృందం..

జైభజరంగభలీ- తోడ్ దుష్మన్ కి నలీ*.
Hanuman 

Veerapatnam Akhanda

Tuesday, April 4, 2023

బండిపై తిరుమల కొండకు


Facebook post of 05.04.2021

ఏడూ కొండలవాడా కనరా మమ్మూ..
 నీ నామంబు కొలిసేటి నిరుపేదమూ..
#బండపైకొండకు...అంటే #తిరుపతి నుండి #తిరుమల.
.వచ్చిన ప్రతీసారి ఇదో అలవాటుగా మారింది, షోకయ్యిందిగా😀😀....
ఏమిటో అదో ఆనందం..
వయసు పెరిగేకొద్ది ఈ సోకులెక్కువైయ్ అన్నట్టుంది కథ😂....ఎవరన్నా ఏమన్నా అనుకోని మనకైతే భలే మజాగా ఉంటది. విమానంలో పోయినా ఆ అనందం రాదు.  అదీ ఎండాకాలం, పొద్దు పొద్దునా చల్లటి గాలిలో, 
#18కిలోమీటర్లు, వంకర తింకరుల ఘాట్ రోడ్డులో తిరుగుతూ....
కుదిరినప్పుడు రోడ్డు మూలల నుండి కిందికి చూస్తే ఆ లోయల్లో చెట్లూ, కొండలూ... అవకాశం తీసుకొని మద్యలో కాసేపు ఆగి... మల్లా ప్రయాణం మొదలుపెట్టి
రయ్  రయ్ మంటూ #కొండెక్కితే 
ఆ కిక్కె వేరప్పా..
తిరుపతి వచ్చిన ప్రతీ సారి ఇలాంటి అవకాశమే కావాలని ఆశిద్దాం🙏.

ఏడు కొండల వాడ వెంకట రమణ గోవిందా...గో   వింద....
గోవిందా.....గోవింద..

20 నిమిషాల్లో తిరుపతి నుండి కొండపైకి...
ఏమయ్యా వెంకయ్యా నీవు 
పిలుపించుకునే  తీరే  వేరయ్యా...

ఓ రెండు రోజులూ కొండమీదే......
 తిరుమల గల్లీలన్నీ బైక్ మీద రయ్ రయ్..
ఏమో అంతా నీ లీలయ్యా...
అయినా మా లాంటివారు యాడున్నా ఒకటేగా
   దిమ్మరులం... అల్పానందపరులం..

ఇద్దరమ్మల దర్శనం @28th March

ఎన్నాల కెన్నాల్ల కెన్నాల్లాకూ...
ఏడుపాయల దుర్గమ్మ దరి చెంతకు...
ఏండ్ల తరబడి వినడమే కానీ దర్శనం చేయకుండే ఏడుపాయల దుర్గమ్మ ఆలయం @మెదక్.
వాళ్ళ పిలుపు ఉండాలే కానీ.. అన్ని అడ్డంకులు అధిగమించి అల్గగా పోవచ్చు.
ఇదో నా ఏడుపాయల దుర్గమ్మ దర్శనం అట్లనే జరిగింది..
అందునా ఇద్దరమ్మల దర్శనం ఒకేసారి, అదీకూడా అద్భుతమైన అతిథి మర్యాదలతో జరగడం అదృష్టo.
అందునా ఆ రోజున @28th March  జరిగిన అన్ని కార్యాలు ఆకస్మికంగా, అద్భుతంగా జరిగినవే.
అందుకే అంటారు వాళ్ళ పిలుపు ఉంటే అన్ని ఆటంకాలు తోసేసి అద్భుత దర్శనం ఇస్తారని.
ఆ రోజు ఎడుపాయల దుర్గమ్మ దర్శనానికి ముందే నూతన ప్రతిష్ట జరిగిన సరస్వతి మాత దర్శనం ఆ వెంటనే ఏడుపాయల దుర్గమ్మ ఆలయంలో అద్భుత దర్శనం జరిగింది..
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే..

GUDI BANDA Temple @Rangapur

FACEBOOK post of 04.04.2019.

చరిత్రకు అందని చైతన్య దీపాలెన్నో... 
అవి అందలేదా, అందుకోలేదా లేక అందించబడలేదా అన్నది అలోచించిస్తూనే.. మన చరితను మనమే రాసుకోవాలి.. సమాజానికి అందివ్వాలి.
అలాంటిదే 300 ఎకరాలలో ఒకే బండపై నిండుగా పరుచుకున్న  #గుడి.. 
అదే *#గుడిబండరామలింగేశ్వరదేవాలయం*, #రంగాపూర్, #మంచాల్ మం. #రంగారెడ్డిజిల్లా. 
హైదరాబాద్ కు ఆమడ దూరంలో ఉన్నా ఆశించినంత అభివృద్ధి జరగని ప్రాంతంలో ఉంది.
చిన్న గ్రామమే అయినా నిండుమనస్సుతో ఊరంతా ఏకమై కొండమీదున్న ఆ దేవ దేవున్ని నిత్యం కొలుస్తున్న వారికి శుభాబినందనలు. 
 ఊరంతా ఏకమై ఉన్నంతలో గొప్పగా నిర్వహించాలని *#శ్రీరామనవమి* ఉత్సవానికి  ఏర్పాట్లు చేస్తున్నారు...
భూమికి 1000 పీట్ల లోతు బోర్లు వేసినా చుక్క నీరు కంటికి కనబడని నేటికాలంలో,  
ఎంతో ఎత్తున మొత్తం బండై పరుచున్న కొండపై ఉన్న చిన్న చిన్న కొనేరుల్లో ఎప్పుడూ ఉండే  నీటిని చూసి ఆ దేవదేవుని ఆశీర్వాదంగా ఆనంద పడుతున్నారు పరిసర గ్రామాల ప్రజలు...
అవుసరాల్లో, ఆపదలో జనాలందరికీ అభయమిచ్చే 
ఆ దేవుడి స్థావరాన్ని ఒక గొప్ప క్షేత్రoగా చేయాలనే నిండు సంకల్పంతో ఉన్నారు. 
 శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్యలు,  పూజ్యశ్రీ #హంపీ విరూపక్ష #విద్యారణ్యభారతి స్వామీజి మార్గదర్శంకోసం ఆశతో చూస్తున్నారు.. 
ఆ ఆశ తప్పక నెరవేరుతుంది.   తప్పక అదో గొప్ప క్షేత్రమూ అవుతుంది. పరిసర ప్రాంతానికి గొప్ప వెలుగునిస్తుంది.

ఆలయాలంటే కేవలం పూజలకు మాత్రమే నిలయాలు కావు.. అవి నిత్య చైతన్య కేంద్రాలు, సామాజిక సమరసతా నిలయాలు, జ్ఞాన బాండాగారాలు, అభాగ్యుల అభయహస్తాలు, అన్నదాన సత్రాలు, ఊర్లను కలిపే సంధానాలు, జాతరలతో జాతిలో చైతన్యం నింపే ప్రేరణా కేంద్రాలు... దేశభక్తిని చాటే ఆవాసాలు.. 
మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు_ ఆ పరంపరను కొనసాగిద్దాం.

#SaveTemples  #RangaPur #RRDist

#GudiBandaTemple

Saturday, April 1, 2023

WILL @SUCCESS


Facebook Post of 01.04.2019.

Where there is a #will there is a Way & #Success
Big Congratulations dear Amgoth Tukaram Pawar..

Wish You All the best to your journey #MountEverest

You have Courage, Potential, Patience, Calmness grit to execute in right way and right direction. 

"FINALLY, YOUR DREEMs COME TRUE"

After 60days, Your foot mark will on 8848m highet and Proud movement to Everyone.

Thanks to all who behind your journey.
#RuralGenius  #RuralTalent

*సంకల్పానికి ఆత్మీయ ప్రోత్సాహం*
మన సంకల్పం మంచిదైతే శక్తి వెతుక్కుంటా వస్తుంది అన్నారు_ నిజమే. 
సాధించాలనే సంకల్పం మెండుగా ఉన్నప్పుడు, సమస్యలెన్ని అడ్డువచ్చినా పట్టుదలతో ముందుకు వెళితే *ఎవరెస్ట్ శిఖరాన్నైనా* ఎక్కవచ్చు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ మన  *తుకారాం*....

 పుట్టి పెరిగింది ఒక మారుమూల గ్రామానికి అనుబంధంగా ఉన్న గిరిజన తండాలో , తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళు కాదు, ఆర్థిక స్థితిమంతులు అసలే కాదు. కుటుంబం సజావుగా నడవడానికే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు....
 అయితేనేం *ఎవరెస్ట్ శిఖరాన్ని* ఎక్కాలనే ధృఢసంకల్పంతో ముందుకెళుతున్నాడు ఈ యువకిషోరం ....
ఆడిన అన్ని ఆటలు_ లగోరి, లంగడి, NCC, మళ్ళకంబలలో ప్రావీణ్యతను చాటడo తన శ్రద్ధను గుర్తుచేస్తుంది.. ఆదే స్పూర్తితో పర్వాతారోహనపై ఆసక్తిని పెంచుకుని, ప్రయత్నం మొదలుపెట్టి  ఈ మద్యే #MountKilumanjaro  అధిరోహించాడు.
తనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుని , గొప్ప లక్ష్యాన్ని సాధించి దేశం గర్వించే విధంగా ఎదగడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు.  ఆ దిశగా ముందుకు వెళుతూ *ఎవరెస్ట్ శిఖరం_ #MountEverest పై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించి , ప్రపంచ రికార్డును నెలకొల్పుతాననే విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు.  
 లక్ష్యం దిశగా ముందుకెళ్లే క్రమంలో  తనకు ఎదురైన అవమానాలు, ఆటంకాలు, అవరోదాలను పట్టించుకోకుండా,కొందరి  సహకారంతో ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు తనను ప్రోత్సహించి వెన్నంటి ఉన్నవారికి ధన్యవాదాలు తెలుపుతున్నాడు. 

ఇకముందు కూడా తనను ప్రోత్సహిస్తే  భారతం దేశం గర్వపడేలా మరిన్ని రికార్డులు నెలకొల్పగలననే ఆత్మస్థైర్యంతో *ఏప్రిల్ మొదటి వారంలో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని* అధిరోహించడానికి బయలుదేరనున్నాడు ఈ మట్టిలో మాణిక్యం....

ఈ సందర్భంగా తమ సంస్థ సభ్యునికి #GSF *ఆత్మీయ అభినందన* తో అతనికి ఆత్మస్థైర్యాన్ని, ప్రేరణను ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఎవరెస్టు శిఖరయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసి జన్మస్థలానికి, దేశానికి గర్వకారణం కావాలని తుకారంని అందరం ఆశీర్వదిద్దాం.

అవును నిజమే.. గొప్ప ఆలోచనలు, గొప్ప ప్రయత్నాలన్నీ అనుమానం, అవమానం అవహేళనతోనే మొదలవుతాయి..
కాని ముగింపు మాత్రం ముల్లోకాలకు స్ఫూర్తినిస్తాయి.
_____________________________
ప్రపంచం నిన్ను గమనించాలనే ఆలోచనతో పర్వతం ఎక్కొద్దు, పర్వతం ఎక్కి నువ్వు ప్రపంచాన్ని గమనించాలనే ఆలోచనతో ఎక్కాలి..