Wednesday, December 24, 2025

బడి వజ్రోత్సవం...

అందరం గమనిద్దాం...    

*ఊరి బడి వజ్రోత్సవం జరపుదాo _ చదువు నేర్పిన ఋణం తీర్చుకుందాం*. 

 నందివనపర్తి లో బడి ప్రారంభమై 60ఏండ్లకు పైనే అయి ఉండొచ్చు.. 
ఎందరికో ఓనమాలు దిద్దించి విద్యావంతులను చేసింది ఈ బడే..
 వారంతా జీవితంలో గొప్పగా ఎదిగిన వారుగా ఉన్నారు... అందరినీ మల్లా ఆ బడికి పిలిచి వారికి ఆనందం పెంచడంతో పాటు, ఆ బడికి కొండంత అండ వచ్చేలా చేయొచ్చు.

ఊరి బడి వజ్రోత్సం పేర  ఒక మంచి కార్యక్రమ నిర్వహణతో అత్యద్భుత ఫలితాలు రావొచ్చు.   
 *మానవ సంస్కార నిలయాలు అమ్మ ఒడి, బడి, గుడి* అని మన పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం.

ఈ క్షేత్రంలో అనేక గుడులన్నాయి, వాటి ద్వారా అనేక ఉత్సవాలు జరుగుతున్నాయి.. 
అదే విధంగా బడి ఉన్నది, అది ఎంతో మందికి చదువు నేర్పింది, బతుకు నేర్పింది. ఆ ఆ బడి ఋణం తీర్చుకునే అవకాశం తీసుకుందాం. 
 అందుకే ఈ బడిలో చదివిన అందరినీ కలిపి ఒక అద్భుత ఉత్సవం  చేసి ఒక గొప్ప ఆనవాయితీనీ ప్రారంభించవచ్చు. అది రేపటి తరం పిల్లలకు ఆసరా, అభయ హస్తం కావచ్చు.

అవకాశం ఉన్న కొందరు అప్పడప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనాల ద్వారా కలుస్తున్నారు..
దానిని సామూహికం చేసి నందివనపర్తి పాఠశాల వజ్రోత్సవం జరిపితే అద్భుతంగా ఉంటుంది.
ఈ ఆలోచన అందరి మనసుల్లో ఉంటుంది.
నాకైతే గత కొన్నేళ్లుగా ఏళ్లుగా నిరoతరంగా ఉంటుంది, కొందరి పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాం..
ఇప్పుడు సమయం వచ్చినట్టుంది..
 కావున గ్రామంలోని *యువజన సంఘాలు, ముఖ్యంగా జ్యోతి యూత్ అసోసియేషన్ మరియు గ్రామ పంచాయతీ మరియు ZPHS పాఠశాల సిబ్బంది  సహకార సమన్వయంతో ఈ ఉత్సవం జరిగి అద్బుత ఫలితాలుo టాయి.*

కొంత ఎక్కువ సమయం తీసుకుని, అద్బుత ప్రణాళికతో ఉత్సవం జరుపొచ్చు..
రాష్ట్రానికి ఒక గొప్ప మోడల్ ఇవ్వొచ్చు.

కావున యువజన సంఘాల పెద్దలు సమయం తీసుకుని, *పూర్వ  SSC Batches నుండి కొందరిని తీసుకుని ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తే ఒక అద్బుత ప్రణాళికతో ముందుకెళ్ళొచ్చు*..
వ్యక్తిగతంగా నా వైపు నుండి కూడా సమయం ఇవ్వగలను..
*ఊరి బడి వజ్రోత్సవం జరపుదాo - చదువు నేర్పిన ఋణం తీర్చుకుందాం*
జరగాలి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు - అవి కావాలి పల్లె ఆణిముత్యాల అభయ హస్తాలు.

:~ సదా వెంకట్,
B.A., LL.B, PGDCJ.
(ZPHS NWP పూర్వ విద్యార్థి)

Monday, December 22, 2025

మహాత్మా .... హే రామ్..

మహాత్మా.... ప్రపంచానికి  అహింస అనే అద్భుతమైన ఆయుధం ఇచ్చావ్...
 ఈశ్వర్ అల్లా తేరా నామ్ అనే మహాద్భుత నినాదం ఇచ్చాం. 
 దానితోనే నీ అనుకూయులకు గట్టిగా చెప్పండి..  మతం కన్నా ముందు మనిషిని మనిషిగా చూడమని..

ఒక మనిషిని బహిరంగంగా చెట్టుకు  ఉల్టా  కట్టేసి, బతికున్న మనిషి  తోలు తీసి, పెట్రోల్ పోసి నిప్పంటిస్తే వచ్చే అర్ధనాదంతో  ఆనందం పొందుతున్న వారి దగ్గరక కెళ్ళి ఈశ్వర్ అల్లా తేరే నామ్  అని గట్టిగా బుద్ధి చెప్పమను.   హే రామ్ అనమను...

స్నేహం.....

*స్నేహం అంటేనే అంతరాలు చూపనిది*..
*స్వచ్ఛమైన స్నేహం ఎప్పటికీ కాపాడబడాలి.*

అంతరాలు చూపని స్నేహమే సుగంధపు వాసనలా నలుదిశలా వ్యాపిస్తుంది.

 పైసలు–పరపతి చూస్తూ,
రేపటి అవసరాలను బేరీజు వేసుకుని స్నేహాలు చేస్తున్న  ఈ రోజుల్లో...

నిజాయితీగా, కల్మషం లేని స్నేహమని వేనోళ్ళు పొగుడుతున్న వీరి స్నేహ బంధం నిజంగా ఆదర్శనీయం..

అవసరం కోసం స్నేహం చేసి ఆపదలో ముఖం చాటేసే నేటి స్నేహాల మధ్య అవసరంలో పక్కన ఆపదలో ముందు అని వీరిపై వేనోళ్ళ కురుస్తున్న అభిమానుల్లో మనము ఉందాం..

కృష్ణ కుచేలుల స్నేహమoత లేకున్నా స్నేహం ముసుగులో కుట్రలు కుతంత్రాలు చేయని వారిలో మనముందాం.

( గ్రామంలో జరిగిన భీకర ఎన్నికల పోరు వేళ అధైర్య పడక, ఒకటే మాటగా నిలిచి, గెలిచిన స్నేహమని ఊరంత అంటుంటే కేవలం స్నేహ విషయం కోసం ఇలా ✍️..వారే జయ్  విజయ్ లు).

Monday, December 15, 2025

సర్పంచ్ ఎన్నికలు - 2025

విషయం కొంత ఎక్కువ ఉన్నది.. అయినా చదవాలి👇.
రాజకీయం అంటే సేవ అనే సోయి ఉన్నోనికే ఓటు*

*కొనుక్కునే వాడెప్పుడు వ్యాపారే...            రాజకీయం వ్యాపారం కాదు, కాకూడదు.. అది  సేవ*.. సేవగానే ఉండాలి.
అలా ఉండాలంటే మనమే కారణం కావాలి. ఆలోచిద్దాం.

నందినాథ క్షేత్రం లోని ఓటర్లందరికీ విన్నపం.  
 అవును నందివనపర్తినే నందినాథ క్షేత్రం అంటున్నాం.  

 ఓటు హక్కు వేయడానికి ఇంకొక్క రోజు మాత్రమే ఉన్నది. ఒక్క నిమిషం ముందు కూడా ఆలోచన చేయొచ్చు.  ఓటు హక్కు ఉన్నొల్లంతా ఇందులో ఉన్నారని కాదు, ఉన్న వాళ్లందరూ చదువుతారనీ కాదు..  కానీ చదవాలి, చదివిన వారంతా ఇంకో  నలుగురిని, కనీసం మన కుటుంబ సభ్యులనైనా చైతన్యo చేయాలి..      

      ఈ ఊరికి ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుంది.  ఆ పేరు రావడానికి, వచ్చిన పేరు   అలాగే నిలవడానికి అనేక మంది పెద్దల త్యాగం ఉన్నది. అది అలాగే కాపాడుతూ భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ఇప్పటి వారిది.  ఈ క్షేత్రంలో అనేక మంది విద్యావంతున్నారు, సేవా తత్పరులు ఉన్నారు, యువజన సంఘాల పేరున తమ అమూల్యమైన సమయం ఇచ్చి గ్రామం కోసం సేవను బాధ్యతగా చేసిన వారు ఉన్నారు. ఇతర ప్రాంతాలలో మార్గదర్శకులుగా ఉన్నవారూ ఉన్నారు. ఇప్పుడు అందరూ ఆలోచన చేయాలి.
*మంచి కోసం ప్రపంచ దేశాలు భారత దేశాన్ని చూసినట్టు, పరిసర ప్రాంతాలు వనపర్తిని చూస్తాయి...చూడాలి*.

*ఆధ్యాత్మిక అంటే కేవలం పూజలు, అర్చనలు, యజ్ఞ యాగాలు,హోమాలు మాత్రమే కాదు. అదొక వ్యక్తిత్వ వికాసం, సామాజిక చైతన్యం*. అందరూ ఆనందంగా ఉండాలని ఆశిస్తూ.. తోటి వారికి సహకారం అందించాలనే తెలిపే వికాస సాధనం.  అది ఆచరణ జరగాలి.  కాల గమనంలో కొన్ని మార్పుల వలన ఆధ్యాత్మిక నిలయాలైన ఆలయాల వ్యవస్థను రాజకీయం చేయబడుతుంది..    ఆలయాల ద్వారా ఆధ్యాత్మిక విలువలతో పాటు సామాజిక చైతన్యం అందించబడింది.    అదే స్ఫూర్తితో నేను ఈ విషయం తెలుపోతున్నాను.

   అందరికీ తెలిసిన విషయాలే అయినా సమయానుసారం తెలపాల్సిన అవసరం కొన్ని సార్లు ఉంటుంది.

   రాజకీయం అంటే సేవ అనేది మరిచి, అధికార దర్పం పదర్శించడం, అనేక రకాలుగా దోపిడీలు చేయడం కొనసాగుతున్న విషయం అందరం చూస్తున్నాం. 
అది మారాలి అని అందరికీ ఉన్నా, మన ద్వారా చేయలేకున్నాం. 
కానీ  వీటికి మన ద్వారానే మార్పు జరగాలి. 

 *ఆలయాల దగ్గర అతిథి మర్యాదలు ఆశించే వారిని, ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా అనుకుంటున్న వారిని, ప్రతిఫలం ఆశించి ఆలయాలకు ఆర్థిక సహకారం, సేవలు  అందించి, అధికార దర్పం ప్రదర్శించే వారిని ఆమడ దూరం జరపాల్సిన అవసరం ఉన్నది*.  
 రాజకీయం అంటే విందు, మందుతో పాటు నోటు ఇచ్చి  ఓటు కొoటo అనుకునే వారికి తగ్గిన బుద్ధి చెప్పాల్సింది మనమే.  చెప్పక పోతే అనుభవిస్తాం.     

కొనుక్కునే వాడు ఎప్పుడూ ఉంటాడు అమ్ముడు పోయే వారే ఆలోచించాల్సిన అవసరం ఉంటది..  
 అమ్ముడు పోతే..
 హక్కుగా అడిగే హక్కే లేకుండా పోయినట్టే.. 
మన ఒక్క ఓటుతో ఏమైతది అనుకోవడం పెద్ద మానసిక జబ్బు. ఒక్క ఓటుతో నేడు అనేక ఫలితాలు తారుమారు అవుతున్నాయి. తరువాత ఐదేండ్లు ఏడిస్తే ఏమి లాభo లేదు.
ఓటు వేసే ఒక్క నిమిషం ముందైనా ఆలోచన చేయాలి.. 
 *నిజాయితీగా ఉండేతోడు ఎవడు, అధికార దర్పం చూపని వాడు ఎవడు, ధన దాహం, భూ దాహం లేనిది ఎవరికి, కులాల కుంపటి లేనిది ఎవరికి,  రాజకీయం అంటే సేవ, నేను సేవకుణ్ణి అనే సోయితో ఉండేవాడు ఎవరు,  తమ అవసరాల కోసం ఉసరవెల్లిలా రంగులు మార్చినట్టుగా తన వ్యక్తిత్వాన్ని  మార్చే వారెవరు  అని వెతికి మరీ ఓటు వేయాలి.          ముందే చెప్పినట్టు ఈ క్షేత్ర పవిత్రత కాపాడే వారికే మన అండగా ఉండాలి*.
                               *కొనుక్కునే వాడెప్పుడు వ్యాపారే... రాజకీయం వ్యాపారం కాదు సేవ*..  వ్యాపారి ఎప్పుడు సేవకుడు కాడు, వాడేప్పటికీ దోపిడి దారే..                    
పెట్టిందంతా వసూలు చేస్తాడు, కాకుంటే మార్గాలు వేరు..   అందుకే ఆలోచన చేయాలి..

 *మన కులపోడు, మన దోస్తు, మా పార్టీ వాడు, మనకు దగ్గరోడు, పైసలున్నోడు, పరపతి  ఉన్నోడు అని చూడకుoడా.... నిజాయితీగా, సేవకుడిగా ఉండేతోడిని, సొంత ఆలోచనలు మెండుగా ఉన్నా సమిష్టి నిర్ణయాలకు కట్టుబడి ఉండేతోడిని ఎన్నుకోవడానికి మన ఓటు వేయాలి. అది సార్ధకం కావాలి*... 

ముందే చెప్పినట్టుగా *ఆధ్యాత్మిక అంటే కేవలం పూజలు, అర్చనలు, యజ్ఞ యాగాలు, హోమాలు చేయడం మాత్రమే కాదు.. అదొక నిత్య చైతన్యం*  అని నమ్మి, వీలైనంత త్వరలో *నందివనపర్తిని నందినాథక్షేత్రంగా చూడాలనే ఆశయంతో ఉన్న వ్యక్తిగా అభ్యర్థన చేస్తున్నా*...

*మంచి, చెడు మీకూ తెలుసు... చెడు పైన సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆశిస్తూ*...
:~ సదా వెంకట్ రెడ్డి,

Thursday, December 4, 2025

రామాయణo by యండమూరి

“రామాయణం చదవమని నీ తండ్రికి, భర్తకి, కొడుక్కి... చివరకు నీ మనవడికి కూడా చెప్పు. ఎందుకంటే..." అన్నారు చిరునవ్వుతో.
ఆయన ఏమి చెపుతారా అని అందరం ఉత్సుకంగా వింటున్నాం. 
"భార్య గురించి చెడుగా విన్నా, పరీక్ష వద్దని పాఠం చెపుతుంది రామాయణం..! భార్య దూరమయినా, మరొక వివాహం ఆలోచన రాని రాముని కథ రామాయణం..! ఆత్మ గౌరవానికి అవమానం జరిగినప్పుడు తల వంచుకుని సేవ చేయటం కన్నా భూగర్భ ప్రవేశం మంచిదన్న సీత కథ స్త్రీలందరికీ ఒక పాఠం". 

"మరణం మంచం అంచున నువ్వు సొమ్మసిల్లి, ‘ఆఖరి చూపుగా నిన్నొక్కసారి చూడాలని ఉందిరా’ అని  కబురు చేసినప్పుడు- తండ్రి మాట విని రాముడు సర్వం త్యజించినట్టూ- రాజభోగాలిచ్చే విదేశీ సుఖాన్నీ, అంతగా అవసరమైతే ఉద్యోగాన్ని పక్కన పెట్టి, నిన్ను చూడటానికి వచ్చేటంత ప్రేమను పెంచుకొమ్మని నీ కొడుక్కి చెబుతుంది రామాయణo..! నిర్హేతుకమైన కోరికల వెనుక వెళ్ళటం- బంగారు లేడి వెనుక పరుగెత్తటమ౦త ప్రమాదమని నీ కోడలికి రామాయణం చదివితే తెలుస్తుంది.  వనమున చదివి తండ్రిని మించిన తనయులైన లవకుశుల చరిత్ర,  చదువుకి సుఖసౌఖ్యాలు తప్పనిసరి కాదని నీ మనవలకి చెపుతుంది..! అందుకే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులూ... అందరూ చదవాలి ఆ పురాణ గ్రంధం" అన్నారు.  

ఈ అద్భుతమైన ప్రవచన౦ వింటూ ఉంటే, నా ఒళ్ళు అప్రయత్నంగా జలదరించింది.

"ఎన్నో జీవిత సత్యాలు తనలో నింపుకున్నది ఆ ఇతిహాసం. అమితమైన సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు చెయ్యవద్దని చెప్పేది కైకతో వ్యవహారం..! పరాయి స్త్రీ పై వ్యామోహం వలదని చెప్పేది లంకా దహనం..! ఇక పాత్రల  ప్రసక్తి  వస్తే, నిస్వార్థానికి ప్రతీకలు  లక్ష్మణ, భరతులు.  ప్రాణమున్నంత వరకూ నీతి వైపే నిలబడతానంటాడు విభీషణుడు. రెక్కలున్నంత వరకూ చెడుతో పోరాడమంటాడు జటాయువు..! ఉన్న౦తలో సాయం చేయమ౦టు౦ది ఉడుత..! నీలో తెలియని శక్తే ఆంజనేయ చరిత..! ఇంట్లో గానీ, ఆఫీసులో గానీ, వ్యాపారంలో గానీ- నీ ప్రత్యర్థులు నీకన్నా బలవంతులైనప్పుడు, వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే లౌక్యమే వాలి సంహారం..! ఇలా ఎన్నో జీవిత సూత్రాలూ, నీతి పాఠాలూ ఉన్న ఇతిహాసమే రామాయణ౦...!”.

ఆయన కొనసాగించారు: “దానిలో ఒకడికి బురద కనబడవచ్చు. మరొకడికి కమలం కనబడవచ్చు. అంతా నీ దృష్టి మీద ఆధారపడి ఉంటుంది...! చదివే అనుభవ౦ ఫలవంతం కావాలీ అంటే, నీరక్షీరాల్ని విడదీసే ప్రవృత్తిని అలవాటు చేసుకోవాలి” అని ఆయన చెపుతూంటే జనం కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి. ప్రశ్న అడిగిన ఆమె చేతులెత్తి నమస్కారం చేసింది. 
(కొత్త పుస్తకం నుంచి. జనవరి విడుదల)

Tuesday, October 14, 2025

మారని వ్యక్తిత్వం @ శివధర్ రెడ్డి IPS

*ఎంత ఎత్తుకు ఎదిగినా మారని వ్యక్తిత్వం* —
పదవులు మారవచ్చు, బాధ్యతల పరిధి విస్తరించవచ్చు. కానీ మనసు మారకపోవడమే నిజమైన విజయo*.
 శివధర్ గారు, ఎన్ని ఉన్నత స్థాయిలకు వచ్చినా, సామాన్య ప్రజలతో కూడా సామరస్యంగా ఉండటం, ప్రజల వ్యాపారాల పట్ల సేవా భావం చూసేదే వారి గౌరవానికి మూలం.
అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) స్థాయిలో విశాఖపట్నం జిల్లాలో సేవ చేయడం మొదలుకుని, వివిధ స్థాయిలో  ఆయన బాధ్యతలు పెరిగాయి.  గౌరవనీయమైన విధుల్లో, Greyhounds యూనిట్‌లో చురుకైన పాత్ర వహించడం ద్వారా ఆయన తీవ్ర ప్రభావాన్ని చూపించారు. 
చిర్రూపమైన వ్యక్తిత్వం — చరిత్రలో నిలిచే ప్రమాణం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2014లో అట్రైరుగా ఏర్పడిన ఇంటెలిజెన్స్ శాఖ-చీఫ్‌గా నియమితులయ్యే అవకాశం పొందిన శివధర్ గారు, తమ విధుల్లో కఠినతను, నిబద్ధతను ప్రదర్శించారు.
*2025లో, శివధర్ గారిని తెలంగాణ DGP గా నియమితులైనారు. అయినా వారి వ్యక్తివంతో లో ఏమాత్రం మార్పు లేదు అదే ఓపిక, ఒద్దిక, వినయం, సహనం*.
గత పుష్కర కాలం( 12ఏళ్లుగా)  నుండి గుడి బడి కేంద్రంగా *జ్ఞానసరస్వతి సేవాసంస్థల ద్వారా విద్యార్థుల వికాసం కోసం జరుగుతున్న కార్యక్రమాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి, అంతే స్థాయిలో అభిమానం చూపారు.*
మీ లాంటి వారు పల్లె ఆణిముత్యాలను ఆశీర్వదించి, వారికి ప్రేరణ ఇవ్వాలి అని ఎప్పుడు ఆహ్వానం  పలికినా 2015 నుండి ప్రతీ సంవత్సరం జరిగే కార్యక్రమాలకు విచ్చేసి పల్లె ఆణిముత్యాలను ఆశీర్వదించారు.
వారు DGP గా నియమితులైన సందర్భంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మేము వెళితే, పుష్కర కాలం క్రితం నుండి మా పట్ల చూపుతున్న అభిమానం, వినయమే వారిలో స్పష్టంగా కనబడింది.
*ఎంత ఎత్తుకు ఎదిగినా మారని వారి వ్యక్తితానికి మరోసారి వినయ పూర్వక శుభాభినందలు తెలుపుదాం*.

*అత్యున్నత పదవిలో వారు తమ విధులను సంపూర్ణంగా నిర్వహించాలని, వారికి భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలను అందివ్వాలని జ్ఞాన సరస్వతి సేవాసంస్థల తరపున ఆశిద్దాం*.
:~ సదా వెంకట్, GSF.

Thursday, September 18, 2025

UNIVERCEL BROTHER Wood Day

VivekanandaKendra, Kanyakumari _ Dilushuknagar Branch Organised the 
#YOUTH_LEADERSHIP WorkShop for the Students who have Participated #Reelmaking Competition held on occasion of
 #UNIVERSAL #BROTHERHOOD_Day on 13 Sep, 2025.
Attended as a Guest to #PrizeDistribution Program.
On 18.09.2025, at Sri  Padmavathi Kalyana Mandapam SBH GA 1 Colony Gaddiannaram HYd. 
#Prizes were awarded to the winning teams and #Certificates were given to the students of the Participating colleges.
#loveBharath 
#servebharath 
#celebratebharath 

#swamyvivekanandathoughts 
#rockmemorial 
#vivekathoughts

Tuesday, July 15, 2025

త్యాగం, నిస్వార్థం, నిజాయితీ


త్యాగాలను ఎక్కిరించిన ఎవ్వడు సుఖంగా ఉండడు... నిజాయితీని ఎగతాళి చేసిన ఏ మొనగాడు ఆఖరి దాకా ఆనందంగా ఉండడు... జాగ్రత్త..
అగ్గిని అములుకొని కొందరు...
ఉరి కొయ్యలకు వేలాడి ఇంకొందరు..
గొంతులో గరళాన్ని పోసుకొని మరికొందరు..

ఒక్కరా... ఇద్దరా.. వందల సంఖ్యలో 
స్వరాష్ట్రం కోసం
ఆయువులొదిలి
ఊపిరులూదిన
అమరులు ఎందరో
ఆ త్యాగాల ఫలం
 ఈ తెలంగాణ.
అమరుల సమాధులపై
 పీఠమెక్కి.. ఖాందాన్ మొత్తం
పొలోమనీ రాజ్యమేలింది!  
గజదొంగలు కొందరు
భజన మండలి పెట్టుకొని
పదేండ్లలో
కోట్లకు పడగలెత్తిన్రు, ఇప్పుడు బీదలను ఎక్కిరిస్రండ్రు...త్యాగాలను ఏలన చేస్తుండ్రు..  పకృతి ఊరుకోదుగా.. ఉట్టిగనే వదులుగా..  ఇంటి బాధలు, ఒంటి బాధలతో పాటు, ఏడ్చిన ప్రతీ అణువు బాధను తానే సమతుల్యం చేస్తది.  ఎప్పటికీ అమ్ముకోకు నమ్మకాన్ని ... 
నమ్ముకో నిజాయితీని. నిటారుగా నిలబెడుతుంది.

Monday, July 14, 2025

కాలం చెప్పే పాఠం

కాలం చెప్పే పాఠం
కాలచక్రం ఎప్పటికీ ఒకేలా సాగదు,
సమయం ఎప్పుడూ ఒకే వైపు నిలవదు.
ఒకనాడు అహంకారంతో 
విర్రవీగిన వారిని,
తలదించుకుని నడిచేలా చేస్తుంది.
గత వైభవం మసకబారి,
గర్వం నేలపాలవుతుంది.

వంగి నడచినవారిని,
వినయంతో జీవించినవారిని,
కాలమే తన చేతులతో పైకి లేపి,
శిరస్సు ఎత్తుకునేలా చేస్తుంది.
వారి సహనమే గొప్ప ఆయుధం,
వారి మర్యాద ఆకాశానికి నిచ్చెన.

అదే జీవిత సత్యం,
అదే ప్రకృతి నియమం.
ఉన్నతమైనదంతా వంగుతుంది,
వినమ్రత ఉన్నత స్థానానికి చేరుతుంది.
అహంకారం అశాశ్వతం –
వినమ్రతే నిజమైన స్థిరత్వం.

ఉన్నదానిలో ఉన్నతంగా కొంచం  పంచుతుండడం మంచిది - అదే చివరాకరున ఊతకర్రగా అండగా నిలుస్తది.
ఆత్మాభిమానoతో నిలబడు - అహంకారిగా కాదు. రెంటిలో తేడా తెలవని వారితో తగువలాడకు - జాలి పడు.
నమ్మకానికి, నిజాయితీకి నిచ్చెనేలా నిలబడు - ఎక్కేతోడు ఎక్కుతాడు, పడేటోడు పడతాడు.., 

Wednesday, July 9, 2025

దిల్ సే కరో సేవా...

ఏడుస్తూ సేవ చేయడం ఎందుకు?    
   అదేమి తప్పనిసరిగా చేయాల్సిన Duty కాదు. కుదిరితేనే చేయాలి. ఓపిక ఉంటే  కుదిరించుకుని చేయాలి.
 సేవ అంటే బాధ్యత. లాభం ఆశించి చేసేది సేవ కాదు. సేవను, బాధ్యతను అదృష్టoగా బావించి, ఆనందంగా చేయాలి తప్ప భారంగా కాదు... నీవు, నేను సేవ చేయకున్నా ఈ లోకానికి  ఏమి నష్టం జరగదు.. అందుకే సేవను బాధ్యతగా భావిస్తేనే చేయాలి,  కానీ  ఏడుస్తూ, ఏతులకు చేయొద్దనేది విషయం.
సేవా కరో లేకిన్ రోతే మత్ కరో. సేవా కరో దిల్ సే... శాన్ సే కరో....

Monday, July 7, 2025

ADBYT@ PRATAPGHAD

akhand_bharathdharshanyatra 
SHIVAJIFORTS - 2025 Pratapghad fort on 30.06.2025
చరిత్రలో చారిత్రాత్మక ప్రదేశo..
 ఛత్రపతి శివాజీ మహరాజ్ అఫ్జల్ ఖాన్ అనే క్రూరున్ని వధించిన పవిత్ర స్థలం #ప్రతాపగఢ్🚩 సందర్శన 
మూడవరోజు @ 30.06.2025.
#రాయఘడ్ కోటలో కురిసిన బారీ వర్షంలో తడిసి ముద్దయిన #ADBY బృంద సభ్యులు ఏ మాత్రం అలసిపోక, అంతే ఉత్సాహంతో 70kms ప్రయాణం చేసి ప్రతాప్ ఘడ్ కోట సందర్శన కానిచ్చారు*.

#ప్రతాపగఢ్ కోట –  సతారా జిల్లాలో #మహాబలేశ్వర్ దగ్గర ఉన్న ఈ కోట వర్షాకాలంలో మరింత అందంగా, చైతన్యంగా మారింది. చరిత్ర, ప్రకృతి, మేఘాలు, జలపాతాలు అన్నీ కలిసి ఈ కోటను ఒక అద్భుత అనుభవంగా మార్చినాయి.
🏞️ #ప్రతాపగఢ్ వర్షాకాల సందర్శన*
🌫️ . #మేఘాలగోల_వర్షపుమోత
 • కోట పైకి చేరినప్పుడు చుట్టూ మంచు, మేఘాలు తిరుగుతున్నాయి.
 • *కొన్ని క్షణాలు కోట మొత్తం మేఘాలలో నిండిపోవడం అంతలోనే కొద్దిసేపు విపరీతంగా వర్షం కురవడం*... అలాగే *రెండు గంటలపాటు సాగిన ప్రతాప్ ఘడ్ సందర్శన ఒక అద్భుతమైన అనుభూతినిచ్చింది.*

🌧️ #జలపాతాలఆహ్లాదం:
 • వర్షాల్లో కోట చుట్టూ సన్నని జలపాతాలు ఏర్పడతాయి.
 • కొండల మధ్య నుంచి నీరు పారుతూ కనిపించడం మాతో పాటు ఇతర సందర్శకులను ఆకట్టుకుంటుంది.

🌿. పచ్చటి ప్రకృతి సోయగాలు:
 • *విపరీతంగా కురుస్తున్న వర్షం, మబ్బుల కారణంగా కోటపై ఇతర ప్రదేశాలను చూడలేకపోవడం కొంత నిరాశ.*
🚩. చారిత్రక ప్రదేశాలు మరింత ఆకర్షణీయంగా నిలుస్తాయి.
 •#అఫ్జల్_ఖాన్ సమాధి, *
#భవానీమాతామందిరం, తలాయ్ (తీర్థాలు) వర్షపు నీటితో మెరుస్తూ కనిపిoచాయి. 
 • వర్షపు నీటి ధ్వని, చల్లటి గాలి ఆ చారిత్రక ప్రదేశాన్ని మరింత ప్రేరణగా మార్చాయి.

🕉️  • తడిచిన మెట్లు, స్లిపరీ మార్గాలు సాహసికంగా అనిపిస్తాయి.
 • వర్షంలో ఎత్తులపై నడవడం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

🤝 ఒక #500గజాల్లో ఇంటిని నిర్మాణం చేయాలంటే శ్రామికులతో పాటు సమయం చాలా పడుతుంది. అలాంటిది #3500అడుగులఎత్తులో, 
#52ఎకరాల్లో  కొండపై శత్రు దుర్భేద్యైమైన కోట నిర్మాణం, కోట చుట్టూతా ప్రహారీ గోడ నిర్మాణం రెండు సంవత్సరాల్లో పూర్తి చేశారoటే ఆ పాలకుల శ్రద్ధకు మొక్కాలి*🙏.
 
💬 ప్రతాపగఢ్ వర్షంలో చూడటం అంటే చరిత్రను ప్రకృతి ఒడిలో దాగిన చరిత్రను ప్రత్యక్షంగా చూసినట్లే! 
కేవలం ఒక #విహారయాత్రలాగ ఇక్కడికి వస్తె రాతి గోడలు, కొండపై నీటి కొలనులను చూస్తూ పోటోలకు పోజులు ఇవ్వడం మాత్రమే అవుతుంది.. కానీ కొంత #శివాజీ చరిత్ర తెలుసుకుని వస్తె మాత్రం ఈ కోటల కట్టడాల కోసం వాడిన #ప్రతీరాయిలో ఒక #దేవుత కనిపిస్తుంది.. ఎలాంటి మర యంత్రాలు లేని కాలంలో, ఊహకందని విద్యుత్తు శక్తి, అంత ఎత్తున, అంతంత బారీ నిర్మాణాలు జరిపిన పాలకులకు, ఆ నిర్మాణంలో బాగస్తులైనా శ్రామికులకు మొక్కకుండా ఉoడలేము.
భారత దేశంలో పుట్టి, ఈ దేశ భవిష్యత్తులో బాగస్తులు కావాలనుకున్న వారు ఖచ్చితంగా గత చరిత్ర తెలుసుకోవాలి..
ఒకసారి వెళ్ళండి – జీవితంలో మరిచిపోలేని అనుభూతి పొందుతారు.
ఉత్సాహవంతులు, దేశభక్తులు అయిన #అఖండభారతదర్శన్_యాత్ర బృందంతో కలిసి ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలు చుట్టి రావడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి.
#IndianHerirage 
#Charrpathi_Shivaji #pratabghadfort 

  Vishweshwar Reddy Konda

Sunday, July 6, 2025

ADBYT @ RAIGHAD

akhand_bharathdharshanyatra
Trip - 2025 @ SHIVAJIFORTS 
Day3 @ 30.06.2025.
Visited #RAIGHAD 
వర్షంలో  #రాయగడ్ కోట సందర్శన – ఇది #ABDY  బృందానికి అద్భుతమైన అనుభూతి.
రాత్రంతా 🚌  ప్రయాణం చేసిన మాకు రాయ ఘడ్ వద్ద ఉ. 4.30 కి వసతి గదిలో స్నానాలు పూర్తి చేసుకుని ఎప్పుడెప్పుడు
 #రాయ్_ఘడ్🚩 కోట ఎక్కాలనే ఆత్రుత...

🚡 వర్షంలో #రోప్‌వే ప్రయాణం.
సహ్యాద్రి పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 820 మీటర్ల ఎత్తులో, 1737 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. మా బృందానికి సమయం తక్కువగా ఉన్న కారంగా #Ropeway ద్వారానే కోటపైకి వెళ్లాలని అనుకున్నాం.

కింద నుంచి కోటకి పైకి వెళ్లే #Ropeway దృశ్యం అసలు మరచిపోలేనిది...
టికెట్ తీసుకుని క్యాబిన్‌లో కూర్చోగానే మేఘాలు మమ్మల్ని చుట్టుముట్టాయి.
పది అడుగుల ముందూ కనిపించని మబ్బులలోకి మెల్లగా ఎక్కుతుంటే, మనం భూమిని వదిలేసి ఆకాశంలో తేలుతున్నామన్న భావన కలిగింది.
వెనక్కి చూస్తే #దట్టమైన_పచ్చని_అడవులు, ముందు చూస్తే మబ్బుల్లో కలిసిపోయిన #కొండలు. 
వర్షపు🌨️ చినుకుల్లోనే తడుస్తూ గైడ్ తో కలిసి కొండపైకి..

🏰 కోటలో…
పైకి వెళుతున్నా కొద్ది వర్షం ఎక్కువ అవుతుంటే....
ఆ వర్షపు చినుకుల్లోనే గైడ్ సందీప్ వాగ్ధాటితో రాయ్ ఘడ్🚩 వివరాల్ని తెలుపుతుంటే  అద్బుత ఆనందం కలిగింది. కోటలోని నిర్మాణపు వివరణల్లో బాగంగా మొదటి చూపుకే #నగారఖానా ద్వారం, 
తడి రాళ్లతో మోసుకుంటూ శివకీర్తినిలా కనిపించింది.
చుట్టూ మబ్బులతో ముసుగు, కాళ్లు నేలపై కానీ హృదయం శతాబ్దాల వెనుకకి వెళ్లిపోయినట్టు అనిపించింది.

👑 #రాజసభమందిరం – శివరాయల రాజభవనం🚩
వర్షపు చల్లదనం మాకేమీ తెలియడం లేదు, ఎందుకంటే ఆ చోటు మమ్మల్ని మాంత్రికంగా ఆకట్టుకుంది.
#రాజసభమందిరం ముందు నిలబడ్డాము. ఎక్కడెక్కడి నుండో  మధురమైన శబ్దంలా 
#ఛత్రపతిశివాజీ మహారాజ్ కీ జయ్” అనే నినాదాలు మా చెవుల్లో వినిపిస్తునాయి.
చుట్టూ వర్షపు చిందులు రాళ్లపై తగిలి చిలిపిగా చిందులేస్తుననాయి...
వాటిలోనూ శివరాజ్యాభిషేక పు మురళీగానంలా అనిపించింది.

⚰️శివాజీమహారాజు సమాధి🙏…
ఇదే మాకు అత్యంత భావోద్వేగంతో నిండిన దృశ్యం. శివరాయల సమాధి వద్దకు వెళ్లినపుడు వర్షం బాగా ఎక్కువైoది. కోటంతా వర్షపు చినుకుల శబ్దమే.. గాలిలో మౌనం పుట్టింది. మట్టి గుబురుతో నిండిన ఆ స్థలం మాలో మాటలు మింగేసింది.
అక్కడ మా బృందమంతా నిల్చుని గైడ్ తో కలిసి 
#శివాజీస్తుతి చెప్పినప్పుడు రోమాలు నిక్క పొడిచాడు. మనసు తన్మయత్వంతో నిండింది, ఆ #రాయగడకోటకు నమస్కరించింది.
 చరిత్ర మమ్మల్ని ఆడించింది. “ఈ నేలపై నడిచిన శివరాయలు నిజంగా ఒక ప్రేరణా శక్తి అనిపించింది.
#ఛత్రపతి_శివాజీ సమాధికి ముందు ఉన్న శివాలయంలో కలిగి అనుభూతి మహా అద్భుతం.. #ABDYteam పాడిన శివయ్య భజన పాటలతో గర్భాలయం మారుమ్రోగింది. ఆ కొద్దిసేపు అక్కడున్న వారందరిలో ఆధ్యాత్మిక తన్మయత్వం ప్రస్పుటంగా కనిపించింది.   
ఆ వెంటనే ఆలయం ముందున్న
 శివాజీ సమాధి దగ్గరకు వెళ్లగానే అందరినీ మౌనం ఆవహించింది.
 ఒక్కసారి ఆ #ఛత్రపతి పరాక్రమం, శౌర్యం మదిలో మెదిలి స్పూర్తి నింపింది.. శివరాయ సమాధి ముందరే ఉన్న ఆయన పెంపుడుశునకం #వాగీయాసమాధిని చూసి మళ్ళీ అంతా నిశ్శబ్దమయ్యారు.

🌿 వర్షంలో ప్రకృతి అద్భుతం
చుట్టూ నీటి జలపాతాలు ఏర్పడినట్టు చిన్న చిన్న ప్రవాహాలు. మబ్బుల మధ్య ఏ కొండ కనిపిస్తే అది నీలమణి దిబ్బలా మెరుస్తోంది. అడుగడుగునా ప్రకృతితో చరిత్ర కలిపిన ఆవేశం, ఆనందం కలగలిసి వచ్చాయి.
వర్షం వల్ల నేల తడి, కాని మనసు ఉత్సాహంగా నిండిపోయింది. చలిలో కూడా ఉష్ణతను తీసుకువచ్చినదేమిటంటే — అది శివభక్తి.
✅ వర్షంలో రాయగడ్ కోట అనుభవం అఖండ భారత్ యాత్రాబృందానికి జీవితాంతం గుర్తుండిపోయే స్మృతిలా మారింది.
ఇది కోట సందర్శన కాదు — ఇది నిత్య చైతన్యంలో మునిగిపోయే  సామాజిక చైతన్య ✊యాత్ర.
#indianheritage 
#SHIVAJIFORTS #Sahyadri 
#RAIGHAD #adventure  #trecking #PMOIndia Vishweshwar Reddy Konda