కాలం చెప్పే పాఠం
✨ కాలం నిర్ణయం కాదనలేనిది ✨
కాలచక్రం ఎప్పటికీ ఒకేలా సాగదు…
సమయం ఎప్పుడూ ఒకే వైపు నిలవదు.
ఒకనాడు అహంకారంతో విర్రవీగిన వారిని,
తలదించుకుని నడిచేలా చేస్తుంది కాలం.
గత వైభవం మసకబారి,
గర్వం నేలపాలవుతుంది.
వంగి నడిచినవారిని…
వినయంతో జీవించినవారినీ…
కాలమే తన చేతులతో పైకి లేపి,
శిరస్సు ఎత్తుకునేలా చేస్తుంది.
వారి సహనమే గొప్ప ఆయుధం,
వారి మర్యాద ఆకాశానికి నిచ్చెన.
అదే జీవితం చెప్పే సత్యం…
అదే ప్రకృతి నియమం.
ఉన్నతమైనదంతా వంగుతుంది…
వినమ్రత ఉన్నత స్థానానికి చేర్చుతుంది.
అహంకారం అశాశ్వతం...
వినమ్రతే నిజమైన స్థిరత్వం.
ఆత్మాభిమానంతో నిలబడదాo... అహంకారిగా కాదు.
ఈ రెండింటి మధ్య తేడా తెలియని వారితో తగువులాడడం సమయం వృధా… వారిపై జాలి పడదాo..
నమ్మకానికి, నిజాయితీకి నిచ్చెనగా నిలబడదాo..
ఎక్కేవాడు ఎక్కుతాడు… పడేవాడు పడతాడు.
మన అసమర్థతకు, మన అలసత్వానికి,
మన చేతగాని తనానికి
ఇతరులను నిందించడం ప్రకృతి విరుద్ధం.
*ఉన్న దాంట్లో కొంతైనా పంచడం నేర్చుకుందాం…. అదే చివరికి మనకు ఊతకర్రగా అండగా నిలుస్తుంది*.
భగవంతుడు ప్రతి ఒక్కరికీ 3 విదాలుగా పంచే అవకాశం ఇచ్చాడు…
సమయం, సంపద, జ్ఞానం —
మనకు ఏది ఉన్నా,
ఉన్నదానిలో కొంత సమాజానికి పంచుదాo.
కానీ పంచిన దానికి ఫలితం ఆశించo…
నిస్వార్థ సేవకు విలువ కట్టకండి.
అంత ఓపిక లేకుంటే ఆ మార్గంలోకి రావద్దు/పోవద్దు...
*మన వల్ల కాకపోయినా, ఈ సమాజంలో ఏ మంచి పని ఆగదు.*
సమాజ హితం కోసం చేసిన ప్రతి కార్యం
మన వల్లనే జరుగుతుందనే భ్రమలో ఉండడం మంచిది కాదు… నీవు, నేను లేకున్నా ఏ మంచి పనీ ఆగదు..
కానీ అందులో భాగస్వాములు కావడం...మన అదృష్టం.
*చేసిన సేవకు గౌరవం ఆశించడం.. చేసిన దానికంటే ఎక్కువ ఆశించడం మూర్ఖపు ఆలోచనలు*.
కానీ ఒక నిజం మాత్రం ఖచ్చితం*…
ప్రకృతి తన పని తాను ఖచ్చితంగా చేస్తుంది.
నిజాయితీతో చేసిన నిస్వార్థ సేవకు
మన ఊహలకు అందని, వెలకట్టలేని ఫలితం తప్పక ఇస్తుంది.
*కాల నిర్ణయం కఠినమైనది, కనికరం లేనిది కూడా.మన చేసిన ప్రతి పనికి లెక్క వేసి,సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతుంది*.
అందుకే జాగ్రత్త అవసరం…
అదే కాలం చెప్పే పాఠం.
కాల నిర్ణయం కాదనలేనిది.
No comments:
Post a Comment