Monday, July 31, 2023

రాచకొండ హమారా షాన్ హై.

#రాచకొండ #హమారా #షాన్ హై..
#Rachakonda is our #heritage.
If it is recognized as a #national #treasure and developed without objection, it will be a #treasure for the #country.
ఎప్పటినుండో ఉన్న బలమైన కోరిక..
బాగా వర్షం పడుతున్న సమయంలో రాచకొండలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలి, పూర్వపు #రాచకొండదళం ఈ ప్రదేశంలో వర్షానికి ఎలా పనిచేసింది, వాళ్ళ స్థావరాలు ఎలా ఉండేవో తెలుకోవాలని...

ఈ రోజు భారీ వర్షం ఉన్నది అని వాతావరణ శాఖ చెపితే నమ్మి😀..
వర్షంలో #రాచకొండ పరిసరాలు చుట్టి వద్దామని.. కావాల్సిన తిండీ గట్రా సామాను తయారు చేసుకొని, ఓ 16మంది వెళ్ళాం..
కానీ వర్షం మాకు భయపడిoది😀 అసలు రాలే...ఇంకేం చేస్తాం తీసుకెళ్ళింది తిని, కొన్ని ప్రదేశాలు చుట్టి వచ్చాం.. కానీ ఇంకోసారి మోసపోయేది లేదు...ఇంకోసారి వర్షంలోనే వెళ్ళేది..
ఉన్న బండల కొనాలకు ఎక్కి #పోటోలు, వీడియోలు దిగి వస్తిమి.
కానీ అక్కడి ప్రతీ రాయి, బండ మనతో మమేకం అవుతాయి.
#రాచకొండ #హమార షాన్ హై.
ప్రతీ కార్తీకపౌర్ణమి రోజున ఈ పరిసర ప్రాంతాల వారి భాగస్వామ్యంతో ఓం #అఖండజ్యోతి #ప్రజ్వలన జరుగుతుంది. ఈ మహా కార్యం 2014 సంవత్సరం  నుండి  ప్రతి ఏడూ నిర్వహించ బడుతుంది.
ఆ కార్యం కోసమేమో మాకు రాచకొండ తో ప్రత్యేక అనుబంధo ఏర్పడి అవకాశం చిక్కినప్పుడల్లా వెళ్తాము.

రాచకొండ మన వారసత్వ సంపద.
జాతీయ సంపదగా గుర్తించి, అభ్యంతరం లేకుండా అభివృద్ధి చేస్తే దేశానికే ఒక మణిహారం అవుతుంది.
#రాచకొండ #హమారా #షాన్ #హై.
#Rachakonda is our #heritage.
If it is recognized as a #national #treasure and developed without objection, it will be a #treasure for the #country.

#Rachakonda  #సదావెంకట్

Friday, July 28, 2023

శ్రీ ఆంజనేయం శిరసా నమామి

#శ్రీ ఆంజనేయం.
మొదటి సందర్శనం....
29.07.2020.

 అనుగ్రహనికి ధన్యులం.
వీరపట్నం అఖండ ట్రస్ట్  ద్వారా సంకల్పించిన #108అడుగుల
 శ్రీ పంచముఖ ఆంజనేయస్వామిq విగ్రహ నిర్మాణ ప్రారంభానికి ముందే...
 #ఏకశిలగా నిర్మితమైన  ఆంజనేయస్వామి విగ్రహాలు కనీసం 5 సందర్సించి, సమాచారం సేకరించాలని #సంకల్పం..
వెంటనే అనుగ్రహించిన హనుమన్న....
1. #శంషాబాద్ దగ్గరలోని, అమ్మపల్లిలో  11వ శతాబ్దంలో నిర్మించిన అద్భుతమైన  #శ్రీకోదండరామాలయం వద్ద నిర్మించిన #35అడుగుల #ఆంజనేయస్వామి విగ్రహ #సందర్శన, #సమాచారసేకరన..  
స్థిరాస్థి వ్యాపారి, #నర్కుడ గ్రామవాసి
శ్రీ బుక్క గోపాల్ గారు స్వప్రేరితులై నిర్మించిన విగ్రహం అది.. 
#నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్దంగా ఉన్నది. #కరోనాకారణంగా #ప్రారంభం జరగలేదు. త్వరలో జరుగుతుంది.
సందర్శనకు సహకరించిన మిత్రలందరికీ #వీరపట్నంఅఖండట్రస్ట్  తరపున ధన్యవాదాలు.
మిగిలిన ,#నాలుగు విగ్రహాల సందర్శనకు త్వరలోనే #హనుమన్న అనుగ్రహిస్తాడని ఆశిద్దాం.
#శ్రీఆంజనేయం.

సామాన్యులే అసామాన్యులు

ఆపదలు సమీపించినప్పుడు, ఉత్పాతాలు సంభవించినప్పుడు సాధారణ వ్యక్తుల్లో కూడా ఓ సహృదయుడు, ఓ సాహసి, ఓ సంఘసేవకుడు మెల్కోoటాడు...
*సాధారణంగా కనిపించే వక్తుల్లోనూ సమయానుకూలంగా సేవ, త్యాగం అవిష్కృతమవుతాయి*. 
*స్వార్థం లేకుండా, స్వప్రయోజనం ఆశించకుండా స్పందించేవారు సామాన్యులైనా దేవుడి దృష్టిలో అసామాన్యులే*...
*సామాన్య ప్రజల నుండే సాహసోపేతమైన కార్యాలను ఆశించగలం*..
:~ స్వావిన @RKP

సాధారణ కలాం

అందగాడు కాదు, ఆజానుబాహుడు కాదు. 
ఐశ్య్వర్య వంతుడు అంత కన్నా కాదు
అఖండ భారతంలో ధుర్భిని తో వెతికినా శత్రువు కానరాడు. 
ఏమిటయ్య నీ గొప్పతనం.. మేరు చిన్నబోయింది.

సిపాయి కాదు, కత్తి పట్టలేదు, క్షాత్రం కను చూపు మేరలో కానరాదు. 
రాముడు కాదు రహీము కాదు...పలుకులు నేర్చిన రామ చిలుకా కాదు. 
విల్లంబు లెత్తిన అర్జునుడు కాదు... సారథి కృష్ణుడూ కాదు.
శౌర్యం మాటే లేదు.... అయిననూ శత్రు దేశాన్ని భయపెట్టని క్షణం లేదు.

ఓడి ఆగింది లేదు, విజయ గర్వం లేదు... అసలు అలిసిన ఛాయ లేనే లేదు.
కూడ బెట్టింది లేదు...కలి అంటింది లేదు.
పదవీ గర్వం లేదు...పురస్కార వాంచ పుట్టుకతోనే లేదు. ఉన్నదంతా లక్ష్య సాధనే.
అంపశయ్య లేదు... ఆసుపత్రి సూది మందు లేదు. 
జుట్టు చెదరలేదు.... నవ్వు ఆగలేదు.
భవబందాలు లేవు... భయపడింది లేదు. 
ఎక్కడమ్మా ఓ మృత్యు మాతా... నువ్వు గెలిచింది. 
ఒక చుక్క కన్నీరు నువ్వు కూడా రాల్చి ఉంటావు... మాకు తెలియదంతే.

వాస్తవాలు ఎప్పుడైనా కటినమే @మణిపూర్


మణిపూర్ మీద పడ్డారు దొంగలు...
మణిపూర్ ఈ దేశంలోనే ఉందనీ.. అక్కడా మహిళలూ..పిల్లలూ...ఉంటారనీ...ఏం స్పృహ కలిగిందిరా నాయనా...

దశాబ్దాలు అసలు ఈశాన్యం వైపు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయని కూడా ఈ దేశానికి...ఇప్పుడు ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్న వారికి తెలీదు...

ఎందుకంటే..వారి మనసుల్లో ఈ రాష్ట్రాలు మనవి కాదు...

కొన్ని చైనావి..కొన్ని బంగ్లా దేశ్ వి..కొన్ని చర్చివి..అంటే అమెరికా వి...

సమ్మగా ఉంది ఇన్నాళ్లూ సన్నాసులకి...తటస్థ తాటకమ్మలకీ...

జమ్ము కశ్మీర్...బెంగాల్...ఈశాన్య రాష్ట్రాల్లో  ఇన్నాళ్లూ మానవులే లేరు...

మానవులు అంటే..ఆయుధాలు ఎత్తుకెళ్లి మసీదుల్లో ...చర్చిలలో దాచే వాళ్ళు మాత్రమే....

ఆ ఆయుధాల దొంగల్ని...

మహిళల్ని వివస్త్రల్ని చేసి..వక్షోజాల పై ఎర్రగా కాల్చి శిలువను ముద్రించిన వాళ్ళూ మాత్రమే మనుషులు.. 

అట్లాంటి ఉత్తమ మానవుల్ని మన సైన్యం హింసలు పెట్టేస్తోంది అని మాత్రమే ...ఈ పెద్ద మానవతా వాదులకు తెలుస్తుంది... అదేంటో...

తటస్థత పూసుకున్న మణులు మనకి కూడా ఉన్నారు...వాళ్ళకట పోలిక వద్దట...

ముందే ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయని మనం అరవలేదట...

స్త్రీలను నిలువునా చెక్క మెషీన్ లో  రంపపు కోతలు కోస్తుంటే ఆ ఆక్రందన తెలుగు రాష్ట్రాల వరకూ వినబడలేదట...

హిందూ యువతులను అపహరించుకు పోయి అత్యాచారాలు చేసి చంపేస్తుంటే...ఆ అరుపులు వీళ్ళకి చెవులకు సోకలేదట...

అదేంటో..ఇప్పుడు ఈశాన్యానికి..ఈయన రోడ్లు వేశాడు కదా...కమ్యూనికేషన్ ఇచ్చాడు కదా...

హాస్పిటల్లు..ఎయిమ్స్ ..ఐఐటీ లు తెచ్చాడు కదా...

ఇప్పుడు అన్నీ వినపడి పోతున్నాయి...

వీళ్ల మానాలు చలించి పోతున్నాయి... కవితలై... పెయింటింగులై కారి పోతున్నాయి...

కానీ.. తెలియందల్లా...

ఈ దారుణాలు వెనుక అమెరికా చర్చి ఉందని తెలీదు...

చైనా కుత్తే ఎక్కిస్తున్న మత్తు ఇదన్న సంగతి తెలీదు...

రోహింగ్యా రహీమ్లు...చర్చి కృసేడర్లు...ఇంత గందరగోళానికి కారణమనీ తెలీదు...

మూడు జాతీయ రహదార్లు కలుస్తున్న...

మనకి యుద్ధ పరంగా  వాణిజ్య పరంగా..మణిపూర్ కీలకమని తెలీదు...

ఈశాన్యం ముక్క కోసే భాగంలో జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర అనీ తెలీదు...

మంచిది..అలాగే ఉండండి...మీ మెదడుని అక్కడే..ఆ లేవెల్లోనే ఉంచండి...

మణిపూర్ ఏమీ అయిపోదు...మీరు ఏడవకండి..

చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది...ఎంపిక చేసుకున్న దొంగ సానుభూతిని మడిచి...మీ మానాన మీరు మీ మానాల్లో పెట్టుకోండి...

ఎప్పుడు ఎలా ఎక్కడ ఎవర్ని ఆపాలో కేంద్రానికి తెలుసు...

ఇప్పుడే...డొంక మొత్తం కదిలింది...

అంతర్జాతీయంగా పురుగులు ఒకటొకటిగా బయటకి వస్తున్నాయి...

ఇంట్లో చెద పురుగులు ఆల్రెడీ తెలుసు...

మన సైన్యం..ప్రభుత్వం కోసి మంట పెడతున్నారు...

పురుగులు చచ్చే సమయంలో...అనవసరంగా మీ కాయలు అక్కడ పెట్టకండి...

ఉక్కిరి బిక్కిరి అయి..పోతారు...

దేశం అంటే..మనుషులే కాదు..మట్టి కూడా మాకు...

మనుషుల్ని..మట్టిలో ఉండే కణకణాన్ని కాపాడుకోవడం మాకు తెలుసు...

రంకెలు ఆపండి...కుంకల్లారా..

జైహింద్!!!

:~Writer Srihari Mangalampalli

Wednesday, July 26, 2023

దేవ సైనికులు

దేవ సైనికులు
గుడిలో జీవ రక్షణకు దేవుడున్నాడు
సరిహద్దులో దేశరక్షణకు సైనికుడున్నాడు
గుడిలో భక్తులు నిలబడితే
సరిహద్దులో సైనికులు నిలబడ్డారు

గుడిలో భక్తుల ఆత్మనివేదన
సరిహద్దులో  సైనికుల ఆత్మ సమర్పణ

గుడి గోపురాలలో ఘంటల చప్పుడు
సరహద్దులలో మందుగుండు చప్పుడు

దేవుడి రక్షణకు ద్వారపాలకులు
దేశరక్షణకు వీరసైనికులు

యోగులద్వారా కళ్ళుమూసుకుని ధ్యానం
యోధుల ద్వారా కళ్ళు తెరుచుకునే  ధ్యానం 

పురాణాలలో శతృసంహారానికి దేవుడు అవతరిస్తే
ఈ యుగంలో శతృసంహారానికి సైనికులు అవతరించారు.

 :~ - by హీరేమగళూరు కణ్ణన్.

**************
🖕అక్షర సత్యాలు..
దైవభక్తితో నిండిన దేశభక్తి గుళికలు..
నిత్యo స్పృహతో ఉండేoదుకు కావలసిన ప్రేరణాత్మక అక్షర ప్రసాదం. ఆస్వా దిద్దాం.. ఆచరిద్దాం.

లోక కల్యాణం కోసం చైతన్యాన్ని ప్రసాదించడానికి  వెలసిన దేవదేవుడితో పాటు నిత్యం ఆయన సేవలో తరించే సేవకులకూ మ్రొక్కుదాం🙏🙏..
మన దేశం ఉంటేనే మనo ఉన్నాం, మన ఆలయాలు_ఆశ్రమాలు, పీఠాలు_ మఠాలు ఉన్నాయ్/ ఉంటాయ్.. 
వాటికి అండగా ఉండడం మనoదరి బాధ్యత.. అదీ దైవ సేవే, దేశ సేవే...

దైవకార్యంలో దేశకార్యంలో అందురు సమానులే, అందరూ సామాన్యులే ఆచరిద్దాం.
:~ సదా వెంకట్.

Thursday, July 20, 2023

ఆఖoడ సమావేశం@ 21.07.2020

#వీరపట్నంఅఖండట్రస్ట్ సమావేశం.
సంకల్పించిన #108అడుగుల #పంచముఖఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి 108 మంది సభ్యులతో బృందం ఏర్పాటు కోసం #వీరపట్నంఅఖండట్రస్ట్ మొదటి సన్నాహక సమావేశం నిర్వహించింది. 
#వీరపట్నంపెద్దచెరువు కేంద్రంగా ఆరు మండలాల నుంచి ఎంపిక చేసిన కొద్ది మందితో ఈ రోజు ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్స్ లో సమావేశం జరిగింది. 

ఆరు మండలాల నుంచి ప్రతినిధులు 30 మంది కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు..
 శ్రావణమాసం చివరి వరకు #108మందిసభ్యులను ఎంపిక చేసి పూర్తి స్థాయి బృందాన్ని ప్రకటిస్తుంది  #ట్రస్ట్.
ఈ 108 మంది బృందంలో ప్రత్యక్ష రాజకీయాలలో లెనివారు ఉంటారు. ప్రజాప్రతినిధులు,ఇతరులను వేరు వేరు  విభాగాలుగా విభజించి మహా సంకల్పానికి అనుగుణంగా కార్యాచరణ ఉంటుందని ట్రస్ట్  సభ్యులు తెలిపారు. 
ఈ సమావేశంలో ప్రముఖ వ్యాపారవేత్త కళ్లెం పెంటారెడ్డి , 
 జైని రాంరెడ్డి, బిక్షపతి, ఒరుగంటి శ్రీనివాస్, శేరిగూడా మాజీ సర్పంచ్ పాండు రంగా రెడ్డి, ఉప్పరిగూడ బీమ్ రెడ్డి,  చందర్ నాయక్, ప్రవీణ్ రెడ్డి, జంగయ్య, శ్రీదర్, శివశంకర్, కోటాచారి, శ్రీనివాస్, చందు,శశిదర్, భాను తదితరులు పాల్గొన్నారు. 
గౌరవ అతిథిగా శ్రీ మల్లికార్జున్ గారు పాల్గొన్నారు.
#వీరపట్నంఅఖండట్రస్టు సభ్యులు పాండు, శ్రీనివాస్, రమేశ్ ల ఏర్పాట్ల పర్యవెక్షనలో #ట్రస్ట్ #వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి విగ్రహ నిర్మాణానికి సంబందిoచిన పూర్తి వివరాలు, కార్యాచరణ విషయాలు సబ్యులందరికీ తెలిపారు.
*పూజ్య #శ్రీవిద్యారణ్యస్వామీజీ ఆశీస్సులతో సమావేశం ముగిసింది*.
:~ #వీరపట్నంఅఖండట్రస్ట్*.

Sunday, July 9, 2023

సరళ మైసమ్మకే తొలిబోనం

A post of 10.07.2017.
తెలంగాణకు రాజధానిగా వెలుగొందిన  మన రాచకొండలో ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందబోయే మన సరళ మైసమ్మ ఆలయం. #SARALAMAISAMMA
ప్రకృతి రమణీయత మధ్య, భాగ్యనగరానికి 60km ల దూరంలో ఒక గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు సఫలీకృతం కావాలని ఆశిద్దాం.
మరుగున పడ్డ మన చరితను మనమే సమాజానికి చాటాలే.. తెలంగాణకి తొలి రాజధానిగా వెలుగొంది తొలిబోనం అందుకొన్న  మన సరళ మైసమ్మ కే మల్లా  తొలిబోనం ఎక్కాలనేది సంకల్పం. 
స్వయంబుగా వెలసిన శివయ్యకు అతి సమీపంలో ఈ క్షేత్రం కూడా..  అన్ని పనులకు ఆద్యాత్మిక శక్తి అనుగ్రహం అవుసరం. ఈ రెండు గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలు కేంద్రంగా రాచకొండ పరిసరాలు గొప్ప అభివృద్ధిని, కీర్తిని పొందాలని ఆశిద్దాం.

Saturday, July 8, 2023

వక్తల కలయిక

ప్రతీ కలయిక కావాలొక మేలు కలయిక - సూదిలా సూత్రీకరణలా...శూన్యం నుండి సుశక్తి సాధనలా. ప్రతీ కలయిక కావాలొక మేలు కలయిక..  ఎవరన్నా, లేకున్నా నమ్మిన పనికోసం నిజాయితీగా ముందుకు సాగుతూ వెళుతుంటే...ఎవరిని ఎప్పుడు కలపాలో - ఎవరిని ఎప్పుడు జరపాలో ప్రకృతి చూసుకుంటుంది.. రేపటి వక్తల కోసం నేటి వక్తలే వకల్తా పుచ్చుకొని వక్త శిక్షణ అద్భుతంగా ముందుకు సాగాలని ఆశిద్దాం.