అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండి విన్న వీర గాథలు, ఉగ్గు పాలతో తాగిన ధర్మ నిష్ఠను కలగలిపి ఎదుగుతూ...
ఊహ తెలిసినప్పటి నుండి ఊపిరి పోయే వరకు కర్తవ్యంగా సాగించిన యోధుడు శివాజీ.
అర నిమిషం కూడా వృధా చేయక
క్షణం క్షణం ధర్మ రక్షణ కోసమే నిలిచిన ధర్మ వీరుడాయన. శత్రువుల ద్వారా వచ్చిన ప్రతీ ఆపదను తన యుక్తికి ఆ దైవ కృప తోడై చావు నోట్లో నుండి బయట పడ్డ సందర్భాలు అనేకo.
అవి చదివితేనే ఎంతో భయంగా ఉన్నది, అనుభవించిన వారి, సంగతి? దగ్గరగా చూసిన వారి సంగతి... అందుకే 400ఏండ్లయినా శివాజీ అనే పేరు వింటేనే ఒళ్ళుకు పూనకం వస్తుంది. రేపటి హిందూస్తాన్ కోసం ఆయన చేసిన పోరాటం అనిర్వచనీయం...
ఆయన ఆశయం కోసం మనo కొంతైనా ఆచరణలో చూపితే ధన్యమే..
గత కొన్ని రోజులుగా చదివిన ఈ కాస్త సాహిత్యంతో ఎంతో ప్రేరణ దొరికింది..
శివాజీ ధర్మం కోసం చేసిన పోరాటం, త్యాగంలో నేటి తరంగా మనకూ కొంతైనా అవకాశం ఇవ్వాలని దైవాన్ని కోరుదాం.
జై భవాని వీర శివాజీ.
No comments:
Post a Comment