Wednesday, January 4, 2023

నిశ్శబ్దం నుంచే విప్లవం

నిశ్సబ్దం నుంచే విప్లవం: FB post on 05.01.2015

"సముద్రం ఉపరితలంలో తరంగాలతో నాట్యమాడుతుంది. నురగతో నవ్వుతుంది, మెరుస్తుంది. గాలివాన వచ్చినప్పుడు  ఘోష పెడుతుంది.అయినా లోలోపల అగాధాలలో ప్రశాంతంగా, మౌనంగా, శాంతంగా ఉంతుంది.అటువంటి దివ్యమైన, ధార్శనికమైన అంతరాంతరమే లేకపోతే మ కార్యకలాపాలు, లక్ష్యహీనమూ, వ్యర్థమూ అవుతాయి..నిశ్శబ్ద విప్లవాలకు మనం శక్తిస్థానాలుగా నిలిచి, సడిలేని సెలయేరులా ప్రవహించినపుడే ముందు తరాలకు  మార్గదర్శకులం కాగలం.....
మనం ఏ రంగం తీసుకున్నా, ప్రచారానికి దూరంగా పరిశ్రమిస్తున్నప్పుడు తాత్కాలికంగా ఎలాంటి సహకారం లభించకపోవచ్చు. కొన్నిసార్లు సమీపంగా మెలిగే వ్యక్తులు కూడా మన శ్రమను గుర్తించకపోవచ్చు.పైగా ఆటంకాలు సృష్టించచ్చు. అంతమాత్రం చేత నిరుత్సాహ పడాల్సిన పనిలేదు.అశాంతికి గురికావాల్సిన అవసరం లేదు..." సహయోదులు లేని ఒంటరి పోరాటం వల్ల మన శక్తిసామర్ద్యాలు సంపూర్ణంగా బయటికొస్తాయని గుర్తెరిగి ముందడుగు వేయాలి. నిజానికి పటాటోపం, ప్రచారహోరుల మధ్య మన లక్ష్యం చాలా వరకు మసకబారుతుందని మరువకూదదు...
~👍👍👍👍

No comments:

Post a Comment