ప్రపంచమంతా మనకు వ్యతిరేకమైనా, పెద్ద పర్వతాలవంటి కష్టాలు బాటలో అడ్డుగా నిలిచినా, భయపడవద్దు. భగవంతుని సహాయహస్తం మొదట్లో అవరోధాల రూపంలో, కష్టాల రూపంలో మనకు ప్రత్యక్షమవుతాయి, భగవదిచ్చను అనుసరించి విశ్వాస పూరకంగా పాటించినట్లైయితే, భగవంతుడే మనలను ముందుకు నడిపించి లక్ష్యసిద్ది కలిగింపజేస్తాడు.
సమాజన్ని వదిలి ఎక్కడికో దూరంగా పోవద్దు. మనస్సును, హృదయాన్ని అర్పించి సమాజాన్ని సేవించు. సమాజసేవ అనేది సర్వవ్యాప్తియైన నారాయణుని సేవకు పర్యాయ పదం.
జీవితంలో మృత్యువు ఏ క్షణంలోనైనా ముంచుకొని రావచ్చు. అది ఎప్పుడు వచ్చినా స్వాగతిoచడానికి, స్వీకరిoచడానికి సిద్ధంగా ఉండాలి. ఎంత కాలమైతే జీవితం నడుస్తూ ఉంటుందో, అంతవరకు దానిని ఆత్మోద్దరణకు, సమాజ సేవకు వినియోగించు..
:~ మనో వికలుడైన శివాజీ.. నేను ఇక రాజ్యం చేయనన్న సందర్భంలో హిత బోధ చేసిన స్వామి సమర్ధ రామదాసు..
No comments:
Post a Comment