"రాంప్రసాద్ బిస్మిల్" ను డిసెంబర్ 19 సాయంకాలం ఉరి తీసారు(1927 @30 yrs age).
డిసెంబర్ 18న ఆయన తల్లి తన కొడుకును ఆఖరు సారిగా చూసుకోవడానికి వెళ్ళింది.
తల్లిని చూసి ఆయన కళ్ళలో నీళ్ళు నిండాయి. 'తల్లి హరిశ్చంద్రుణ్ణి, దధీచిని గుర్తుకు తెచ్చి విచారానికి, పశ్చాత్తాపానికి అతీతంగా ఉండమని సలహా ఇచ్చింది' (కన్న కొడుకుని తెల్లారితే ఉరితీస్తారు అని తెలిసి చివరి క్షణంలో ఆ తల్లి పలికిన ధైర్యవచనాలకు వందనం).
దానికి మన బిస్మిల్ గారు....""" నేను మృత్యువుకు భయపడను.విచారం, పశ్చాతాపం నాలో లేవు. ఎందుకంటే నేను ఏ పాపం చేయలేదు కనుక.... (భారతమాత బానిస సంకెళ్ళు తెంచడానికి ఫోరాటం తప్పా...).
కాని ## అగ్నికి సమీపంలో ఉన్నప్పుడు నెయ్యి కరగడం తప్పదు. నీకు, నాకు మద్య ఉన్న సంబందమే అలాంటిది".చూడగానే కళ్ళలో నీళ్ళు నిండాయి (వందనం సార్).
ఉరికంబమెక్కిన బిస్మిల్ ఆఖరు మాటగా..# బ్రిటిష్ సామ్రాజ్యం పతనం కావాలని నా కోరిక".
------------------------------'----------
~దేశంకోసం నవ్వుతూ ...... గావింపబడ్డ మీ తల్లీ కొడుకుల ప్రేరణకు సలాం.
(వీలైతే జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా - అమర వీరుల ఉత్తరాలు..
దేశంకోసం పనిచేయాలనుకున్న వారికి ప్రేరణనిస్తాయి)
No comments:
Post a Comment