Sunday, February 26, 2023

ఆజాద్ ప్రతిజ్ఞ @వర్ధంతి 27.02.1931

త్యాగమూర్తులను స్మరించుకుందాం- భావితరాలకు స్ఫూర్తినందిద్దాం      
         ♧ఆజాద్ ☆ప్రతిజ్ఞ 
హిందుస్తానీ పోలీసు బంధువుల్లారా! మీరు ఊరికే నా మీద ఎందుకు గుళ్ళు కురిపిస్తున్నారు. నేను మీ అందరి స్వాతంత్ర్యం కోసమే పోరాడుతున్నాను. కొంచం ఆలోచించండి" అన్న ఆజాద్ విజ్ఞప్తి పోలీసుల తలకెక్కలేదు. ఆజాద్ ప్రళయకాల రుద్రుడైనాడు.. అతని సింహనాదానికి పార్కులోని బండలు రోడ్డుపక్కనున్న భవంతులు ప్రతిధ్వనిస్తున్నాయి. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు ఆజాద్. ఒంటరిగా వందమంది శత్రువులతో ముప్పైరెండు నిమిషాలు సింహపరాక్రమంతో పోరాడాడు. విప్లవ చరిత్రకే  మకుట సమానమైన పోరాటమది. భారత యువజనుల సాహస పరాక్రమాలకు సముజ్వలమైన ఉదహారణ అది. పార్కు చుట్టూ గుమికూడిన వేలకొద్ది జనం ఆ సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు...
ఆజాద్ వద్దనున్న గుళ్ళన్నీ అయిపోవచ్చాయి. ఆ స్థితిలో కూడా అతని మనస్సు చురుకుగా పనిచేస్తుంది. అప్పటిదాకా మొత్తం ఎన్నిగుళ్ళు ఖర్చయినాయో అతని మనసులో ఖచ్చితమైన లెక్కవుంది సంస్థ డబ్బు లాగానే. తన వద్ద చివరిగుండు మిగిలింది. పదిసంవత్సరాల క్రిందట వారణాసిలో పోలీసులు తనను బెత్తంతో కొడుతున్నప్పుడు చంద్రశేఖర్ తన పేరు "ఆజాద్" అని చెప్పుకున్నాడు.☆తను ప్రాణాలతో ఉండగా ఏ పోలీసు వాడూ తనమీద చేయవేయలేడని తన విప్లవ సహచరులతో మీసం త్రిప్పిచెప్పాడు..ఆ ప్రతిజ్ఞ తన మనస్సులో మెదిలింది.
ఆజాద్ మనస్సులో ఒక నిశ్చయం చేసుకున్నాడు. ఆటోమాటిక్ పిస్తోలు చటుక్కున తలదగ్గరికెళ్ళింది డాం అని ప్రేలింది. అతని చివరి గుండు అతని తలను చేదించుమొని బయటికెగిరింది. అప్పటికి ఆ సర్వతంత్ర స్వతంత్ర వీరుడి వయస్సు 24 సంవత్సరాలే....
అవును నిజమే మన ఆజాద్ 1931, ఫిబ్రవరి 27న దేశంకోసం అమరుడయ్యాడు... అది నేటి దినం... ఆ త్యాగాల ప్రకంపనలు నేటి యువతకు చేరాలని ఆశిద్దాం.....  దేశంకోసం పనిచేయడానికి...
జైహింద్..భారత్ మాతాకి జై.

No comments:

Post a Comment