Thursday, February 16, 2023

విజయం

నాయకుడైనా ప్రతి వ్యక్తి కొంగొత్త వ్యూహాలను తయారు చేస్తాడు. వాటిని విజయవంతంగా అమలు చేస్తాడు. ఈ సామర్ధ్యమే అతనికి విజయాన్నిస్తుంది...
విజయ అంటే 90% సన్నాహాలు, 10% ఉహించని సమస్యలను తట్టుకుని నిలవడం అని చెపుతారు..
:~ ఛత్రపతి శివాజీ జీవిత అధ్యయనంలో స్పష్టంగా కనిపించే విధానం.

శ్రీ కృష్ణుని రాజనీతియే శివాజీ యుద్ధనీతికి మూలసూత్రం అయిందా? 

విజయసాధనం శివాజీ యుద్ధనీతికి మూల సూత్రం. తన శత్రువు ఎవరు? అతడు ఎటివాడు? అనే విషయంలో శివాజీకి పూర్తి  ఆకళింపు ఉంది. అతడు ఎంతటి నీతి వంతుడో, ఇచ్చినమాటను ఎలా నిలబెట్టు కుంటాడో ఆయనకు తెలుసు. తనకు రాజ్యం
లభించడం కోసం తండ్రిని, సోదరున్ని, ఇతర బంధువులను చంపడానికి వెనుదీయని శత్రువుతో జరిపే యుద్ధంలో ధర్మయుద్ద నియమాలను పాటించటం అర్థం లేదని శివాజీ మొదట్లోనే గుర్తించాడు. 

రాజపుత్రుల ఉదాహరణ ఆయన ముందున్నది. వారి వీర మరణములు, బలిదానములు, వారి స్త్రీల జౌహార్లు ప్రశంసనీయములే అయినా విజయాలను సాధించలేకపోయాయి. 

విజయాన్ని ఎలా సాధించాలో ఆయన మహాభారతంనుండి నేర్చుకుని ఉండాలి. శ్రీకృష్ణుడు విజయాలను సాధించాడు. అర్జునుడు విజయుడే. శ్రీకృష్ణుడు యుద్ధరంగా లలో ఓడిపోలేదని కాదు. ఆయన యుద్ధ రంగాలలో ఓడిపోయినా యుద్ధం గెలిచాడు. ధర్మరాజు చేత "అశ్వతామా హతః " అని ఒక విధమైన అసత్యం పలికించాడు, భీమునిచేత దుర్యోధనుణ్ణి తొడపై గదాఘాతం చేయించాడు. జరాసంధుణ్ణి ఎలా రెండుగా చీల్చాలో చెప్పాడు. 
కపట - ద్యూతం ఆడేవారితో జరిగే యుద్ధం నూటికి నూరుపాళ్ళు ధర్మయుద్దంగా ఎలా ఉంటుంది? అభిమన్యుణ్ణి ఏకాకినిచేసి చంపిన వారికి, ఊడిన రథచక్రాన్ని తిరిగి అమర్చుకునే వ్యవధి ఎందుకివ్వాలి? శ్రీకృష్ణుని ఈ నీతి శివాజీకి పాఠం నేర్పింది.

శివాజీ చాణక్యుని అర్థశాస్త్రం, మహాభారతంలోని శాంతిపర్వం మననం చేసుకున్నాడా అనిపిస్తుంది ఆయన రాజనీతిని పరిశీలిస్తే. శివాజీకి తనయొక్క పరిమితి తెలుసు. శత్రువు యొక్క శక్తీ తెలుసు. ఈ రెండు బిందువుల మధ్య ఆయన విజయశీలమగు తన యుద్ధనీతిని రచించాడు.

No comments:

Post a Comment