ఈ ప్రకృతికి వేరే పనేముoడదు..
లేని ఆలోచనలు బుర్రల్లో చొప్పించి, సంకల్పాలుగా మలచి, ఆచరణ వైపుగా ముందుకు తోస్తది. బుడి బుడి అడుగులు వేస్తూ తూలుతున్నప్పుడు ఎదో ఒక చేతివేలిచ్చి దారిన పెడుతది. నడకలో పట్టు సాధించి వడి వడి అడుగులేస్తున్నప్పుడు పరిగెత్తమని ఉసిగొల్పుతది.. నాతో కాదు, కూడదు అని నస పెడితే ఇంకోని బుర్రలో జొర్రుతది..కానీ తన పని ఆపదే.. ఆపదు గాక ఆపదు.
ఒక కొత్త కార్యానికి జొర్రీగలా చెవి కొరుకుతున్న ప్రకృతి.. అవునందామా... మరి కాదందామా అనే ఆలోచన కూడా పదుగురితో చేదాం😀...
No comments:
Post a Comment