Sunday, June 5, 2022

గడ్డు రోజులు... ఎప్పటికీ ఉండవు

కొన్ని రోజులు అతికష్టంగా,  మన ఓపికకు పరీక్షలాగా గడుస్తాయి.
చేతిలో చిల్లిగవ్వ లేక, అవసరాలు మాత్రం చాలా ఉండి, అవుతలోళ్ళను  అడగడానికి మనసొప్పక మనలో మనమే కుమిలే క్షణాలు ఎవరికీ తెలియవు.
ఒక వ్యవస్థను ముందుకు సాకే దిశలో జరగాల్సిన పనులకు, నమ్ముకున్న వాళ్లకు తిండీ తిప్పలు చూడాల్సిన సమయంలో ఆర్ధిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు చుట్టుముట్టి గేలి చేస్తుంటే   చెప్పలేని, చెప్పుకోలేని ఆవేదనను లోలోనే భరించాలి. పోన్ ద్వారా అన్ని సమస్యలు తీర్చుకునే మనం, ఆ పోన్ రీఛార్జ్ కోసం కూడా డబ్బులు లేని స్థితిలో ఉండడం మహాభాగ్యమే మరి.

అలాంటి సమయాల్లో
ఒక్కో పూట ఒక్కో యుగంలా కనిపిస్తుంది.. 
అయినా ఎదోరూపంలో మన అవసరాలు తీరుస్తాడు ఆ పైవాడు. అదే జీవితం.
అలాంటి సందర్భాలే GSF   నిర్వహకుడిగా చాలా సార్లు అనుభవంలోకి రావడం అదృష్టమో, దూరదృష్టమో తెలియని స్థితి...

No comments:

Post a Comment