Wednesday, June 29, 2022

శ్రీశైలం ట్రిప్ @ 2022.

శ్రీశైలం పోతే... ఆ శివయ్య అనుగ్రహం కోసం ఎంత ఆరాటపడుతామో.. అంతే ఆరాటంతో ఆ శివరాయ@ శివాజీ నుండి ప్రేరణ శక్తిని పొందాలని ఆశిస్తాం...
శివాజీ ధర్మపోరాటానికి భ్రమరాంభదేవి ఖడ్గం అందించి, శక్తిని ప్రసాధించిన పవిత్రస్థలం..
 అoదుకే  ఆ శివాజీ స్ఫూర్తి కేంద్రం తప్పక సదర్శిస్తాo... అందరూ సందర్శించాలి కూడా.  
శివాజీ జీవిత ముఖ్య ఘట్టాల వివరాలు 3D చిత్రాలతో ఆధునీకరించిన  స్ఫూర్తికేంద్రం ఆహ్వానం పలుకుతున్నది.

వీరపట్నం వాహినితో శ్రీశైల స్ఫూర్తికేంద్ర సందర్సన. @ 29.06.2022.
*********************
రాబోయే  అనేక తరాల నేతలకు, ఈ దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చాలని కోరుకునే వారందరికీ, శివాజీ ఒక ప్రేరణా శక్తి, ఒక మార్గదర్శి... ప్రణమిల్లుదాం... అనుసరిద్దాం..

Monday, June 27, 2022

మoచితనం, ఓర్పు, సహనం,

మంచితనాన్ని చేతగానితనంగా అనుకున్నప్పుడు, ఓర్పును-పోరు చేయలేని నిట్టూర్పు అనుకున్నప్పుడు, సహనాన్ని- సత్తాలేని ఉత్త  ఓపిక అనుకున్నప్పుడు,
అన్ని మంచి గుణాలను అవహేళనగా భావిస్తున్నప్పుడు...
వాటి శక్తిని ప్రదర్శించకపోతే ఆ గుణాలు మనను కూడా వదిలిపోతాయి..
అందుకే ధర్మంపట్ల చులకన భావం ఏర్పడ్డప్పుడు శక్తి ప్రదర్శన తప్పనిసరి.
రాముని వారసులమే అయినా కృష్ణుని అనుయూయులం అని గుర్తించుకోవాలి.
ఎవరికి ఏ భాషలో చెపితే బాగా అర్థం అవుతదో అదే బాషల చెప్పాలి.. అదే ధర్మం పట్ల నిష్ట. అనుసరిద్దాo.. ఆచరిద్దాం...   దేవాలయాలు కేవలం పూజలు, యజ్ఞ, హోమ- యాగాలకు మాత్రమే నిలయాలు కాదు, కాకూడదు..  ధర్మనిష్టా కేంద్రాలు, శ్రద్దా కేoద్రాలు, అవసరార్ధుల ఆపన్నాహస్తాలు కావాలి.     *మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం*. 

Sunday, June 19, 2022

*ఉన్నప్పుడు ఉట్లపoడగా- లేనప్పుడు లొట్ల పండగ*

గూట్లో దీపం- నోట్లో ముద్ద...
ఉన్నప్పుడు ఉట్లపండగ లేనప్పుడు లొట్లపండగ... పెద్దల ఈ
రెండు మాటలను ఈ రోజు నా తిండికి అన్వయిoచుకోవచ్చు..

ఒకటి ఈ 6 గం.లకే రాత్రి తిండి కథం.ఎప్పుడూ రాత్రి 10కి చేసేటోళ్లం ఈరోజు ఇట్లా... పొద్దుమూకే కథం.
ఎప్పుడు సాధకులు వంతులవారిగా వంట చేస్తే ఒక్క కూర,  ఇంత పచ్చిపులుసు అంతే..
ఇప్పుడు వంటలకు ఒకరు వచ్చారు.. దాని పర్యవసానమే ఈ 4 రకాల కూరల్, చట్నీ, మూడు కూరల్ @ గోకరకాయా, బెండకాయ, మీల్ మేకర్😀  & చపాతీలు..
ఉన్నప్పుడే ఉట్ల పండగ మరి. కానియ్యాలే మరి...

Saturday, June 18, 2022

*సమాజానికి తిరిగి ఇవ్వడం*

చిన్న వయసులోనే అనుకున్నది సాధించడం, అందుకు తగ్గ సాధన చేయడం...
ఎదుగుతున్న క్రమంలో పొందిన సాయం తిరిగి సమాజానికి ఇచ్చేయడo అదృష్టం.. అది కొద్ది మందికే సాధ్యం..
ఆ కొందరిలో మనమూ, మనోళ్లుoటే మనకూ కొంత గర్వం...
అతికష్టమైన ఎవరెస్టు శిఖరాలకు అతితక్కువ వయసులో అధిరోహించిన తుకారాo.. తాను అనుభవించిన కష్టాల జ్ఞాపకంతో ఎదుగుతున్న ఆణిముత్యాలకు తనవంతు సహకారం ఇవ్వడం ప్రారంభిడం అభినందనీయం. గత సంవత్సరం జూన్ 18న
పల్లె ఆణిముత్యాల పండగ పేరున సాధన కుటీర్ ప్రారంభమైన రెండో  ఏడాది ముగ్గురు సాధకులకు ప్రోత్సాహం అందివ్వడం మనందరికీ స్ఫూర్తిదాయకo, గర్వకారణం, ఆచరనీయం...

GSF తరపున తుకారంకి శుభాబినoదనలు, శుభాకాంక్షలు💐

Friday, June 10, 2022

వ్యక్తి - వ్యవస్థ

*ఆజ్ కి బాత్ అజం కర్లో*

తన ప్రతి పనిని, ప్రతీ పరిచయాన్ని నమ్మిన వ్యవస్థ/ సంస్థ ఎదుగుదలకు నిస్వార్థంగా, నిజాయితీగా ఉపయోగించే వ్యక్తుల వల్లే ఆ వ్యవస్థ/సంస్థకు జీవం....
 వ్యవస్థలో చేరి ప్రతి పరిచయాన్ని తన స్వంత అవసరాలకు, ప్రతి పనిలో తన స్వంత లాభం ఎతుకులాడే స్వార్ధపరులూ ఉంటారు. వారితో వ్యవస్థకు ఎప్పటికీ నష్టమే... వారెక్కువకాలం వ్యవస్థలో ఇమడలేరు. అయినా.
 ఇరువైపులా జాగరూకత అవసరం.

ఆజ్ కి బాత్ అజం కర్లో



రామునికి
కష్టం వచ్చిందని 
రావణుని
సంహారం వెంటనే జరుగలేదు ...

సృష్టి అనబడే
కాలచక్రం కూడా 
శివాజ్ఞ కోసం
ఎదురు చూసింది...
అక్షరాలు పొందిక ఓదార్పు మత్తులాగా ఉన్నా అదే పచ్చినిజం కూడా.. జగమెరిగిన సత్యమే అది.

Thursday, June 9, 2022

ప్రకృతి _ జొర్రీగా

ఈ ప్రకృతికి వేరే  పనేముoడదు..
లేని ఆలోచనలు బుర్రల్లో  చొప్పించి, సంకల్పాలుగా మలచి, ఆచరణ వైపుగా ముందుకు తోస్తది. బుడి బుడి అడుగులు వేస్తూ తూలుతున్నప్పుడు ఎదో ఒక చేతివేలిచ్చి దారిన పెడుతది. నడకలో పట్టు సాధించి వడి వడి అడుగులేస్తున్నప్పుడు పరిగెత్తమని ఉసిగొల్పుతది..  నాతో కాదు, కూడదు అని నస పెడితే ఇంకోని బుర్రలో  జొర్రుతది..కానీ తన పని ఆపదే.. ఆపదు గాక ఆపదు.
ఒక కొత్త కార్యానికి జొర్రీగలా చెవి కొరుకుతున్న ప్రకృతి.. అవునందామా... మరి కాదందామా అనే ఆలోచన కూడా పదుగురితో చేదాం😀...

Wednesday, June 8, 2022

ధర్మంకోసం

ధర్మంకోసం నిజాయితితో నిటారుగా నిలబడాలి అనుకున్నవాన్ని ఎవరి అద్దె ధమ్కీలు, ఉద్దెరా కుట్రలు, నిలువెత్తు మోసాలు, నమ్మక ద్రోహాలు, మాయా మచ్చిoద్రాలు ఏమీ చేయలేవు, పొరపాటున ఏమన్నా చేసినా అవి తాత్కాలికమే.. కఠిన కష్టాలు అనుభవించినా సరే అంతిమoగా ధర్మానిదే విజయం. అది అన్ని యుగాలలో అంతే. ఈ యుగంలోనూ అంతే.

హృదయంతో పని

 సానుభూతి కోసమో, సన్మానాల కోసం , గుర్తిoఫుకు   ఆశపడి ఏ ఒక్క మంచి పని చేయకు...అలా ఆశించి చేయడం అధముల ఆరాటం...
చేసే పని నిండు హృదయంతో నిజాయితీగా, నిస్వార్ధంగా చేస్తే రావాల్సినవన్నీ నీవేడ దాక్కున్నా వెతుక్కుoటా వస్తాయ్. అది ప్రకృతి నియమం. అందుకే చేసే పని నిండు హృదయంతో చేయు...

సమాజాహితం

సమాజాహితం కోరి సంకల్పించిన ఏ ఒక్క మంచిపని నీవు, నేను లేకున్నా ఆగదు గాక ఆగదు... 
అవకాశం తీసుకుని బాగస్తులమయితే మన అదృష్టo, లేదంటే దురదృష్టం...
ఈ ప్రపంచo నీ కోసమో, నాకోసమో వేచి చూడదు...ప్రతి వస్తువుకు, ప్రతి వ్యక్తికి బదులుగా మరొక వస్తువు, వ్యక్తిని ప్రకృతి సమకూర్చుకోగలదు.
అందుకే జాగ్రత్త అవసరం.

సంకల్ప శక్తి

సంకల్పశక్తి ఉంటే, ఏమీలేని పరిస్థితులలో నుంచి కూడా మనిషి అన్నిటినీ తయారు చేసుకోగలుగుతాడు.
సంకల్పశక్తికి కారణం శీలం.
మనం చేస్తున్న పనులను బట్టి శీలం తయారవుతుంది. పని చేయడానికి క్రమశిక్షణ కావాలి.
మనo చేసే పనులవల్ల సంకల్పశక్తి పెంపొందుతుoది.

నమ్మకమే ఓ శక్తి.

నమ్మకమే ఒక  శక్తి....
అవునిది పచ్చినిజం..స్వయానుభవం.
అనామకులనందలమెక్కిస్తుంది ఓ కిక్కిస్తుందీ..
నమ్మకమే నమ్మకమే నమ్మకమే...
పద పదరా సద అని తోసేసింది  - పదుగురిని  తోడిచ్చింది  ...నమ్మకమే మాకో తోడయ్యింది,

నమ్మకమే మాకో శక్తయ్యింది -  మాకై దారయ్యింది..
పదిమందిలొ మాట్లాడే పలుకయ్యింది - పదుగురినీ ఒప్పించే మాటయ్యింది...
అవునవును నమ్మకమే మాకో తోడయ్యింది. ..

#పసిపిల్లల పైసలతో చదువులమ్మకో గుడి కట్టిస్తుంది - మాకాశక్తిచ్చింది....నమ్మకమే మాకో తోడయ్యింది.

అవునా?  అన్నోళ్ళచె  హౌరా అనిపించింది- మాకో తోడయ్యింది...
అవునవును నమ్మకమే మాకో తోడయ్యింది
#  పల్ల్యాణిముత్యాలకాసరవ్వండని ప్రేరనిచ్చింది - మాలో శక్తి నింపింది...
మాలో భయాన్ని తోసే తోపయ్యింది 
 మాకో హోపయ్యింది.. సాదించండని తోసేసింది..
నమ్మకమే మాకో తోడయ్యింది. ..
అవునవును నమ్మకమే మాకో తోడయ్యింది-

#పద పదరా సద అని   తోసేసింది- పదుగురిని       తోడిచ్చింది
నమ్మకమే నమ్మకమే నమ్మకమే..
( Gnana Saraswathi Temple Nandiwanaparthy    దేవాలయ నిర్మాణం, దాని కేంద్రంగా, www.gsf.org.in ద్వారా జరురుతున్న పనికై  సహకారాన్నిఅడుగుతూ  మనసున్న మనుషులను కలిసే సమయంలొ... వారు మా లాంటి వారిపై చూపిన విశ్వాసానికై .నాలో కలిగిన భావనల అక్షర బద్దీకరన ఇది..🙏
 
https://www.facebook.com/100002143544899/posts/742164922531619/ 

మా పెరటి నిమ్మచెట్టు

మా   పెటరి నిమ్మ చెట్టు కాయలు కా సె న్...
అవి రంగులో  చాలా పచ్చగుండెన్- రుచిలో పుల్లగుండెన్....
ఎప్పుడెప్పుడా అని   ఎదురుచూస్తున్న నిమ్మకాయలు రానే వచ్చెన్...

మూడేళ్ళ క్రితం సాధన కుటీర్ లో నాటిన నిమ్మ మొక్క.. ఎదుగుతూ ఎదుగుతూ...   కాయలు కాయడం మొదలెట్టిoది..
*నింబూ కే ప్యారే హై హమ్ రోజాన కాయేoగే*         అబ్

వకీల్ సాబ్

న్యాయశాస్త్ర పట్టా చేతికొచ్చిన ఐదేళ్లకు అడుక్కున్న కోట్ వేసికుని దిగిన ఫొటో.... 
మన ద్వారా జరుగుతున్న పనికి ఓ స్థాయి, కొంత గౌరవం దక్కాలంటే మనకు సామాజిక హోదా తప్పక అవసరమని తన వాక్కుల ద్వారా చెప్పిన  బాస్ @ స్వామి వివేకానంద ముందే ఈ ఫొటో దిగి, ఇదో  పట్టా పుచ్చుకున్నా కానీ Practice చేయను అని ఖరాఖండిగా చెప్పి సాక్ష్యంకోసం దిగిన ఫొటో ఇది. 2013లో అనుకుంటా.. దాచిన బొమ్మలను ముఖపుస్తకం జ్ఞాపకo చేస్తే నెమరేసుకుంటున్న😀..

Tuesday, June 7, 2022

హృదయంతో పని చేయు..

ఇతరుల సానుభూతి కోసమో, సన్మానాల కోసం , గుర్తిoఫుకు   ఆశపడి ఏ ఒక్క మంచి పని చేయకు...అలా ఆశించి చేయడం అధముల ఆరాటం...
చేసే పని నిండు హృదయంతో నిజాయితీగా, నిస్వార్ధంగా చేస్తే రావాల్సినవన్నీ నీవేడ దాక్కున్నా వెతుక్కుoటా వస్తాయ్. అది ప్రకృతి నియమం. అందుకే చేసే పనేదైనా నిండు హృదయంతో చేయు.

Sunday, June 5, 2022

సంకల్ప శక్తి

సంకల్పశక్తి ఉంటే, ఏమీలేని పరిస్థితులలో నుంచి కూడా మనిషి అన్నిటినీ తయారు చేసుకోగలుగుతాడు.
సంకల్పశక్తికి కారణం శీలం.
మనం చేస్తున్న పనులను బట్టి శీలం తయారవుతుంది. పని చేయడానికి క్రమశిక్షణ కావాలి.
మనo చేసే పనులవల్ల సంకల్పశక్తి పెంపొందుతుoది.

గడ్డు రోజులు... ఎప్పటికీ ఉండవు

కొన్ని రోజులు అతికష్టంగా,  మన ఓపికకు పరీక్షలాగా గడుస్తాయి.
చేతిలో చిల్లిగవ్వ లేక, అవసరాలు మాత్రం చాలా ఉండి, అవుతలోళ్ళను  అడగడానికి మనసొప్పక మనలో మనమే కుమిలే క్షణాలు ఎవరికీ తెలియవు.
ఒక వ్యవస్థను ముందుకు సాకే దిశలో జరగాల్సిన పనులకు, నమ్ముకున్న వాళ్లకు తిండీ తిప్పలు చూడాల్సిన సమయంలో ఆర్ధిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు చుట్టుముట్టి గేలి చేస్తుంటే   చెప్పలేని, చెప్పుకోలేని ఆవేదనను లోలోనే భరించాలి. పోన్ ద్వారా అన్ని సమస్యలు తీర్చుకునే మనం, ఆ పోన్ రీఛార్జ్ కోసం కూడా డబ్బులు లేని స్థితిలో ఉండడం మహాభాగ్యమే మరి.

అలాంటి సమయాల్లో
ఒక్కో పూట ఒక్కో యుగంలా కనిపిస్తుంది.. 
అయినా ఎదోరూపంలో మన అవసరాలు తీరుస్తాడు ఆ పైవాడు. అదే జీవితం.
అలాంటి సందర్భాలే GSF   నిర్వహకుడిగా చాలా సార్లు అనుభవంలోకి రావడం అదృష్టమో, దూరదృష్టమో తెలియని స్థితి...

వీరపట్నం

ఇది వీరులపురం... అదే మన వీరపట్నం..
నిండైన చైతన్యంతో తులతూగిన పురం.. ఇప్పటికి నివురుకప్పిన నిప్పులాగే ఉంటది.. దానితో ఇంకో చైతన్య జ్యోతిని వెలిగిoచకోవాలంతే.. నీరు పోసి ఆర్పాలనుకుంటే ఆరేది కాదురోయ్...
మా ఊర్ల నుండి పారే వర్షపు నీరుకు ఇంత మన్ను పోసి కట్టపోసి.. దీన్ని ఇబ్రాహీంపట్నం అంటే ఎలా ఇబ్రాహీం పాషా బానిసలారా....
తప్పు చిన్నా అది చాలా పెద్ద తప్పు