Sunday, October 28, 2018

Article in Enadu Book

Article in Enadu Sunday Magazine on. GNANA SARASWATHI TEMPLE, NWP.

మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో నిర్మితమనైన...

విద్యార్థి సమేత.. జ్ఞానసరస్వతి:
http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=28805.

Sunday, October 7, 2018

PRERANA

అవును...
పసి మస్తిస్కాలలో నింపాల్సింది ఆత్మవిశ్వాసం.

పరిస్థితులెలా ఉన్నా, ఉన్నంతలో ఉన్నతంగా ఆలోచించి ఉత్తమంగా ఎదగాలనే విశ్వాసాన్ని అందివ్వాలి.
ప్రతిభకు అర్ధిక బీదరికం అడ్డూ, పొడుగు ఎదీ కాదు, కారాదు, కాలేదు అని మనమే చెప్పాలి..

  లక్ష్యం పట్ల కసి, లక్ష్యాన్ని సాధించాలనే ప్రేరణను మనమే ఆ పసి పల్లలకు చెప్పాలి.

లక్ష్యం పట్ల తపన ఉండి "సాధన" కొనసాగిస్తే ప్రకృతి తప్పక సహకరిస్తుందనే "ప్రకృతి నియమాన్ని" మననే వారికి చెప్పాలి..

మీరు ఉన్నతంగా ఎదగటానికి సమాజ సహకారం తీసుకోవాలి, ఎదిగాక ఆ ఋణం తప్పక తీర్చుకోవాలనే "ప్రకృతి నియమాన్ని" పసితనాననే బలంగా చెప్పాలి.  అలా  ఎదిగిన అందరి జీవితాలను చెప్పాలి, చూపాలి.
ఉన్నతంగా ఎదగాలనే "సంకల్పం" అందుకోసం నిరంతర "సాధన" తప్ప ఇతర ఏ అంశాలు వారి ఎదుగుదలకు అండగా ఉండవని ఖచ్చితంగా చెప్పాలి...  కనీసం చెప్పే ప్రయత్నం చేద్దాం. GSF

Thursday, September 13, 2018

RachaKonda Vinayaka

కంకర్ కంకర్ మే శంకర్ శంకర్ హై..

బోలో గజానన భగవాన కీ జై....

జనావాసాల వాసనే లేని కొండల్లో, గుట్టల్లో సైతం ..ఆ రాళ్ళను రమణీయ మూర్తులుగా మలచి రాబోయే తరాలకు  సాంస్కృతిక, సాంప్రదాయ విలువలను అందించిన ఆ అజ్ఞాత శిల్పులకు శిరసా ప్రణామాలు.
దొరికిన ప్రతి అవకాశంలో రేపటి తరానికి ఉపయోగ పడాలనే పనికోసం తాపత్రయ పడిన నాటి తరం...       నిస్వార్థపు సేవలు, వాటి విలువల విలువలు కొలువలేని నేటి తరం..

ఒకప్పుడు రాచకొండను తమ అడ్డాగా చేసుకుని సాగిన "రాచకొండ దళం" ఇలాకాలో .. ఎవరో ..  ఏ అజ్ఞాత శిల్పో ... లేదా ఆ వినాయకుడే స్వంబుగా వెలిసాడో...రమణీయంగా ఆ రాయిలో..

ఎవరన్నారు నక్సలైట్లకు దేవుడంటే భక్తి లేదని,
వాళ్ళు పరమ నాస్తికులని...
లేకుంటే ఈ వినాయకుడేడా వెలిసేను...

తరతరాల వారసత్వ సంపదను కాపాడుదాం. బావి తరాలకు భాద్యతగా అందిద్దాం.
బొలో గజానన భగవాన కీ జై.

Monday, September 10, 2018

ప్రకృతి నియమం::

ఎవరు ఉన్నా, లేకున్నా చిట్టచివరి వరకు నీ దారిలో  అడుగులు నువ్వు వేస్తే..
ఎవరిని ఎప్పుడు కలపాలో, ఎవరిని ఎప్పుడు జరపాలో ఆ ప్రకృతి చూసుకుంటుంది అంతే.
అది నిజం.

Sunday, March 25, 2018

అమ్మాయే పూజారి..

అమ్మాయే పూజారి..

ఆంజనేయుడి గుడిలో అమ్మాయే పూజారి.

శ్రీకృష్ణ దేవరాయుడి పాలనలో నిర్మించిన పంచముఖి ఆంజనేయుడి ఆలయం, #కృష్ణాపరఠాణ, #తిరుపతి.

నిత్యం రద్దీగా ఉండే తిరుపతిలోని  #గోవిందరాయస్వామి దేవాలయానికి అతి సమీపంలో, చౌరస్తాలో ఉన్న ఈ ఆలయాన్ని అదికారులు తొలగిద్దామని చేసిన ప్రయత్నాలన్నీ వృదానే అయ్యాయంట. ఆ పంచముఖుడే అదికారులకు పంచ్ లిచ్చి, మాకు ఈ ఆలయ భాద్యతను అప్పజెప్పాడు అంటున్నారు నిర్వహకులు.
అవుసరం కోసం కుటుంబం అంతా అయన సేవలో ఉంటాం అంటున్నారు.
మరి మహిళలు ఆలయంలో, అదీ ఆంజనేయుడు ఆలయంలో పూజారిగా ఉండొచ్చా అని అడిగుతే .. ఎందుకుండ కూడదు, ఎవరన్నారు ఉండకూడదని ఎదురు ప్ర|శ్న..
నిజమే కదా భక్తికి, శక్తికి లింగ భేదం లేదని శాస్త్రాలను ఔపాసన పట్టిన మన పెద్దలు ఎప్పుడో చెప్పి ఉన్నారుగా.
అవును అవుసరాలు అవకాశాలు అందించి, అన్నీ నేర్పుతాయి. అన్నీ మరిచి అనుసరించడమే మనం చేయాల్సిన పని.
మన శిరిషా అదే చేస్తుంది..అక్క, బావలకు(హరినాథ్, శాంతి) తోడుగా  ఆంజనేయుడి గుడిలో, అవుసర నిమిత్తం పూజారి. 
B.Tech & Fashion designing చదివి, అదీ ఆంజనేయుడి గుడిలో పూజారిగానా అంటే... అవును తప్పేముంది.. అన్నీ ఆ స్వామివారే చేయించుకుంటున్నాడు మనదేముంది అని సమాదానం.
అంతేగా మరి, భక్తికి లింగబేదం లేదు_ ఆవుసరాలు అన్నీ నేర్పుతాయి అన్న మాట నిజమే అనిపించింది.

#Tirupathi  #HanumanTemple
#NOGenderdiscrimination

Tuesday, November 7, 2017

అనుబంధ బంధాలు_Relations.

అనుబంద బందాలు::.
అనుబందం, ఆప్యాయత, ఆత్మీయత...
ఏ బందం లేకున్నా అల్లుకునే బందాలవి.
అడుక్కుంటే, ఆడంబరాలు చేస్తే, అతి వినయం చూపిస్తే వచ్చేవి కావు_ వచ్చినా నిలిచేవి కావు.
కొలతలతో కొలిస్తే తూకానికి అందనివి, మనసున స్వార్దం పెట్టుకుని నటిస్తే, మాటేసి కాటేసే నికార్సయిన నిజాయితీ బందాలవి.
నీతులు, సూక్తులూ ఊరికే అవుతలి వాళ్ళకి చెప్పడానికే కాకుండా, మనకు ఆచరించి చూపే అవకాశం అందించే బందాలవి. అవుసరాలు తీరాక దాటేసే తెప్పరులు కావవి.
బడ బడా కానుకలే కావాల్సిన పనిలేదు, మనసుంటె మట్టిని కూడా మణిపూసలుగా చేసి మణిహారంగా అందించగల బందాలవి.
మనసున స్వార్ధం, నటన లేకుంటే కలకాలం కల్మషం లేకుండా కలిసుండే బందాలవి.. బహుపరాక్..

Monday, November 6, 2017

AKHANDA HAARATHI_2017

సంకల్పించిన కార్యం చిన్నదా, పెద్దదా అన్నది కాదు విషయం.  ఎన్ని అభ్యంతరాలు, అవాంతరాలు ఎదురైనా, సంకల్పించిన కార్యం కోసం కొసదాక కొనసాగడమే అసలైన విజయం...
వీరపట్నం పెద్ద చెరువు నిండి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, రాచకొండ పరిసర ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షింస్తూ సంకల్పించిన మహాకార్యమే ""గంగమ్మకు అఖండ హారతి_శివయ్యకు అఖండ జ్యొతి" కార్యక్రమం.
3 సం.రాల క్రితం కార్తీక పౌర్ణమి రోజు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపీ విద్యారణ్య భారతీ స్వామీజీ కరకమలములచే ప్రారంభించబడి 2 సం. అందరి సహకారంతో రాలు దిగ్విజయంతో పూర్తిచేయబడింది.
3వ సంవత్సరం కూడా తమ అనుకూలతను బట్టి ఆ మహా కార్యాన్ని పూరిచేసిన "~వీరపట్నం అఖండ""  కార్యకర్తల బృందానికి హృదయపూర్వక శుభాభినందనలు... ఈ ప్రాంత వాసులందరి తరపున ధన్యవాదాలు..
హృదయంతో చేసే ఏ కార్యానికైనా కచ్చితంగా ఆ ప్రకృతి కనుకరిస్తది, అనుకూలిస్తది, ఆశీర్వదిస్తది. ..కాస్త ఆలస్యమైనా ఈ మహాకార్యం  యొక్క ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి...