అవును...
పసి మస్తిస్కాలలో నింపాల్సింది ఆత్మవిశ్వాసం.
పరిస్థితులెలా ఉన్నా, ఉన్నంతలో ఉన్నతంగా ఆలోచించి ఉత్తమంగా ఎదగాలనే విశ్వాసాన్ని అందివ్వాలి.
ప్రతిభకు అర్ధిక బీదరికం అడ్డూ, పొడుగు ఎదీ కాదు, కారాదు, కాలేదు అని మనమే చెప్పాలి..
లక్ష్యం పట్ల కసి, లక్ష్యాన్ని సాధించాలనే ప్రేరణను మనమే ఆ పసి పల్లలకు చెప్పాలి.
లక్ష్యం పట్ల తపన ఉండి "సాధన" కొనసాగిస్తే ప్రకృతి తప్పక సహకరిస్తుందనే "ప్రకృతి నియమాన్ని" మననే వారికి చెప్పాలి..
మీరు ఉన్నతంగా ఎదగటానికి సమాజ సహకారం తీసుకోవాలి, ఎదిగాక ఆ ఋణం తప్పక తీర్చుకోవాలనే "ప్రకృతి నియమాన్ని" పసితనాననే బలంగా చెప్పాలి. అలా ఎదిగిన అందరి జీవితాలను చెప్పాలి, చూపాలి.
ఉన్నతంగా ఎదగాలనే "సంకల్పం" అందుకోసం నిరంతర "సాధన" తప్ప ఇతర ఏ అంశాలు వారి ఎదుగుదలకు అండగా ఉండవని ఖచ్చితంగా చెప్పాలి... కనీసం చెప్పే ప్రయత్నం చేద్దాం. GSF
No comments:
Post a Comment