కంకర్ కంకర్ మే శంకర్ శంకర్ హై..
బోలో గజానన భగవాన కీ జై....
జనావాసాల వాసనే లేని కొండల్లో, గుట్టల్లో సైతం ..ఆ రాళ్ళను రమణీయ మూర్తులుగా మలచి రాబోయే తరాలకు సాంస్కృతిక, సాంప్రదాయ విలువలను అందించిన ఆ అజ్ఞాత శిల్పులకు శిరసా ప్రణామాలు.
దొరికిన ప్రతి అవకాశంలో రేపటి తరానికి ఉపయోగ పడాలనే పనికోసం తాపత్రయ పడిన నాటి తరం... నిస్వార్థపు సేవలు, వాటి విలువల విలువలు కొలువలేని నేటి తరం..
ఒకప్పుడు రాచకొండను తమ అడ్డాగా చేసుకుని సాగిన "రాచకొండ దళం" ఇలాకాలో .. ఎవరో .. ఏ అజ్ఞాత శిల్పో ... లేదా ఆ వినాయకుడే స్వంబుగా వెలిసాడో...రమణీయంగా ఆ రాయిలో..
ఎవరన్నారు నక్సలైట్లకు దేవుడంటే భక్తి లేదని,
వాళ్ళు పరమ నాస్తికులని...
లేకుంటే ఈ వినాయకుడేడా వెలిసేను...
తరతరాల వారసత్వ సంపదను కాపాడుదాం. బావి తరాలకు భాద్యతగా అందిద్దాం.
బొలో గజానన భగవాన కీ జై.
No comments:
Post a Comment