అమ్మాయే పూజారి..
ఆంజనేయుడి గుడిలో అమ్మాయే పూజారి.
శ్రీకృష్ణ దేవరాయుడి పాలనలో నిర్మించిన పంచముఖి ఆంజనేయుడి ఆలయం, #కృష్ణాపరఠాణ, #తిరుపతి.
నిత్యం రద్దీగా ఉండే తిరుపతిలోని #గోవిందరాయస్వామి దేవాలయానికి అతి సమీపంలో, చౌరస్తాలో ఉన్న ఈ ఆలయాన్ని అదికారులు తొలగిద్దామని చేసిన ప్రయత్నాలన్నీ వృదానే అయ్యాయంట. ఆ పంచముఖుడే అదికారులకు పంచ్ లిచ్చి, మాకు ఈ ఆలయ భాద్యతను అప్పజెప్పాడు అంటున్నారు నిర్వహకులు.
అవుసరం కోసం కుటుంబం అంతా అయన సేవలో ఉంటాం అంటున్నారు.
మరి మహిళలు ఆలయంలో, అదీ ఆంజనేయుడు ఆలయంలో పూజారిగా ఉండొచ్చా అని అడిగుతే .. ఎందుకుండ కూడదు, ఎవరన్నారు ఉండకూడదని ఎదురు ప్ర|శ్న..
నిజమే కదా భక్తికి, శక్తికి లింగ భేదం లేదని శాస్త్రాలను ఔపాసన పట్టిన మన పెద్దలు ఎప్పుడో చెప్పి ఉన్నారుగా.
అవును అవుసరాలు అవకాశాలు అందించి, అన్నీ నేర్పుతాయి. అన్నీ మరిచి అనుసరించడమే మనం చేయాల్సిన పని.
మన శిరిషా అదే చేస్తుంది..అక్క, బావలకు(హరినాథ్, శాంతి) తోడుగా ఆంజనేయుడి గుడిలో, అవుసర నిమిత్తం పూజారి.
B.Tech & Fashion designing చదివి, అదీ ఆంజనేయుడి గుడిలో పూజారిగానా అంటే... అవును తప్పేముంది.. అన్నీ ఆ స్వామివారే చేయించుకుంటున్నాడు మనదేముంది అని సమాదానం.
అంతేగా మరి, భక్తికి లింగబేదం లేదు_ ఆవుసరాలు అన్నీ నేర్పుతాయి అన్న మాట నిజమే అనిపించింది.
#Tirupathi #HanumanTemple
#NOGenderdiscrimination
No comments:
Post a Comment