Thursday, November 26, 2026

అఖండ జ్యోతి -2026

రెండు చారిత్రక స్థలాల్లో చైతన్య జ్యోతులు...
https://www.instagram.com/reel/DgMuSwWtt1p/?dmpr=MW01Y2lkMDIzaWw1OA==
వీరపట్నం పెద్దచెరువులో గంగా హారతి – రాచకొండలో అఖండ జ్యోతి ప్రజ్వలన
400 ఏళ్ల చరిత్ర కలిగిన వీరపట్నం పెద్దచెరువులో గంగా హారతి... చారిత్రక రాచకొండలో అఖండ జ్యోతి ప్రజ్వలన... ఈ రెండు కార్యక్రమాలు ఆధ్యాత్మికతకు, ప్రకృతి ఆరాధనకు, సామాజిక చైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి*.
*ఈ రెండు చారిత్రక స్థలాలతో అనుబంధం ఉన్న ప్రతి హృదయాన్ని భాగస్వాములను చేస్తూ, ఈ ప్రాంతాలు సుభిక్షంగా, సస్యశ్యామలంగా వర్ధిల్లాలని కాంక్షిస్తూ నిర్వహిస్తున్న పవిత్ర కార్యక్రమాలివి.*
https://youtube.com/shorts/tR8UlrUwjNM?si=eghYZ_YtoFGDZFg_

*2015లో పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ కరకమలములచే వీరపట్నం పెద్దచెరువులో గంగా హారతి కార్యక్రమం ప్రారంభమైంది*. 
ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కాదు... *దైవానుగ్రహంతో ప్రకృతి మనకు ప్రసాదించిన బాధ్యతను గుర్తుచేసే మహత్తర సంకల్పం.*

*పెద్దచెరువులో గంగమ్మకు సమర్పించిన హారతి జ్యోతితో వెలుగులు నింపుకుని, ఊరూరా భక్తుల హారతులు అందుకుంటున్న రాచకొండ స్వయంభూ సదాశివుని సన్నిధిలో, శంకెళ్ల బావి వద్ద దీక్షతో అఖండ జ్యోతిని ప్రజ్వలింపజేసే అవకాశం లభించడం నిజంగా మహద్భాగ్యం.*

*చైతన్య జ్యోతులు🔥 వెలిగిద్దాం... ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి పరిరక్షణ, ప్రాంతీయ అభివృద్ధికి పునాదులు వేద్దాం!*

*అఖండ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా*...

*వీరపట్నం పెద్దచెరువులో గంగమ్మకు హారతి*

*ప్రతి సంవత్సరం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు భక్తుల సమక్షంలో గంగమ్మకు🕉️ హారతి సమర్పణ.*

*రాచకొండలో అఖండ జ్యోతి ప్రజ్వలన*🔥

గంగా హారతి అనంతరం ర్యాలీగా రాచకొండకు చేరుకుని, స్వయంభూ సదాశివుని సన్నిధిలో అఖండ జ్యోతి ప్రజ్వలన.

అందరికోసం... అందరం పాల్గొందాం!

*ఈ ఏడాదితో పుష్కర కాలం (12 సంవత్సరాల ప్రయాణం) పూర్తిచేసుకున్న ఈ ఉత్సవాల స్ఫూర్తితో, ప్రకృతే ఆదేశించినట్లుగా వచ్చే ఏడాది మరింత బాధ్యతతో, మరింత వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అఖండ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.*

*ఈ రెండు ఉత్సవాలు వెలిగించిన చైతన్య జ్యోతులు ఈ ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సామాజిక చైతన్యాన్ని వ్యాప్తి చేసే మహోద్యమంగా రూపుదిద్దుకోవాలి. ఈ మహత్తర సంకల్పంలో మనమందరం భాగస్వాములం కావాలి.*

*ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాల నిర్వహణకు తమ సహకారం అందిస్తున్న సహృదయులకు, ఇబ్రహీంపట్నం మున్సిపల్ సిబ్బందికి, ఇబ్రహీంపట్నం మరియు మంచాల పోలీస్ శాఖలకు, రాచకొండ సమితికి ప్రత్యేక అభినందనలు, హృదయపూర్వక ధన్యవాదాలు.*
https://www.facebook.com/share/r/1DMs7tZmLu/

అదేవిధంగా, *ఎలాంటి స్వార్థం, ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ మహత్తర సంకల్పంలో భాగస్వాములవుతూ, ప్రతి ఏటా తమ సమయం, శ్రమ, సేవలను సమర్పిస్తున్న నిస్వార్థ అఖండ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి సమర్పణే ఈ ఉత్సవాలకు నిజమైన బలం.*

*సంకల్పం మనది... అనుగ్రహం దైవానిది...      బాధ్యత మనందరిది!*
:~సదా వెంకట్,
*అఖండ ట్రస్ట్🔥*

No comments:

Post a Comment