akhand_bharathdharshanyatra
Trip - 2025 @ SHIVAJIFORTS
Day3 @ 30.06.2025.
Visited #RAIGHAD
వర్షంలో #రాయగడ్ కోట సందర్శన – ఇది #ABDY బృందానికి అద్భుతమైన అనుభూతి.
రాత్రంతా 🚌 ప్రయాణం చేసిన మాకు రాయ ఘడ్ వద్ద ఉ. 4.30 కి వసతి గదిలో స్నానాలు పూర్తి చేసుకుని ఎప్పుడెప్పుడు
#రాయ్_ఘడ్🚩 కోట ఎక్కాలనే ఆత్రుత...
🚡 వర్షంలో #రోప్‌వే ప్రయాణం.
సహ్యాద్రి పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 820 మీటర్ల ఎత్తులో, 1737 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. మా బృందానికి సమయం తక్కువగా ఉన్న కారంగా #Ropeway ద్వారానే కోటపైకి వెళ్లాలని అనుకున్నాం.
కింద నుంచి కోటకి పైకి వెళ్లే #Ropeway దృశ్యం అసలు మరచిపోలేనిది...
టికెట్ తీసుకుని క్యాబిన్‌లో కూర్చోగానే మేఘాలు మమ్మల్ని చుట్టుముట్టాయి.
పది అడుగుల ముందూ కనిపించని మబ్బులలోకి మెల్లగా ఎక్కుతుంటే, మనం భూమిని వదిలేసి ఆకాశంలో తేలుతున్నామన్న భావన కలిగింది.
వెనక్కి చూస్తే #దట్టమైన_పచ్చని_అడవులు, ముందు చూస్తే మబ్బుల్లో కలిసిపోయిన #కొండలు.
వర్షపు🌨️ చినుకుల్లోనే తడుస్తూ గైడ్ తో కలిసి కొండపైకి..
🏰 కోటలో…
పైకి వెళుతున్నా కొద్ది వర్షం ఎక్కువ అవుతుంటే....
ఆ వర్షపు చినుకుల్లోనే గైడ్ సందీప్ వాగ్ధాటితో రాయ్ ఘడ్🚩 వివరాల్ని తెలుపుతుంటే అద్బుత ఆనందం కలిగింది. కోటలోని నిర్మాణపు వివరణల్లో బాగంగా మొదటి చూపుకే #నగారఖానా ద్వారం,
తడి రాళ్లతో మోసుకుంటూ శివకీర్తినిలా కనిపించింది.
చుట్టూ మబ్బులతో ముసుగు, కాళ్లు నేలపై కానీ హృదయం శతాబ్దాల వెనుకకి వెళ్లిపోయినట్టు అనిపించింది.
👑 #రాజసభమందిరం – శివరాయల రాజభవనం🚩
వర్షపు చల్లదనం మాకేమీ తెలియడం లేదు, ఎందుకంటే ఆ చోటు మమ్మల్ని మాంత్రికంగా ఆకట్టుకుంది.
#రాజసభమందిరం ముందు నిలబడ్డాము. ఎక్కడెక్కడి నుండో మధురమైన శబ్దంలా
#ఛత్రపతిశివాజీ మహారాజ్ కీ జయ్” అనే నినాదాలు మా చెవుల్లో వినిపిస్తునాయి.
చుట్టూ వర్షపు చిందులు రాళ్లపై తగిలి చిలిపిగా చిందులేస్తుననాయి...
వాటిలోనూ శివరాజ్యాభిషేక పు మురళీగానంలా అనిపించింది.
⚰️శివాజీమహారాజు సమాధి🙏…
ఇదే మాకు అత్యంత భావోద్వేగంతో నిండిన దృశ్యం. శివరాయల సమాధి వద్దకు వెళ్లినపుడు వర్షం బాగా ఎక్కువైoది. కోటంతా వర్షపు చినుకుల శబ్దమే.. గాలిలో మౌనం పుట్టింది. మట్టి గుబురుతో నిండిన ఆ స్థలం మాలో మాటలు మింగేసింది.
అక్కడ మా బృందమంతా నిల్చుని గైడ్ తో కలిసి
#శివాజీస్తుతి చెప్పినప్పుడు రోమాలు నిక్క పొడిచాడు. మనసు తన్మయత్వంతో నిండింది, ఆ #రాయగడకోటకు నమస్కరించింది.
చరిత్ర మమ్మల్ని ఆడించింది. “ఈ నేలపై నడిచిన శివరాయలు నిజంగా ఒక ప్రేరణా శక్తి అనిపించింది.
#ఛత్రపతి_శివాజీ సమాధికి ముందు ఉన్న శివాలయంలో కలిగి అనుభూతి మహా అద్భుతం.. #ABDYteam పాడిన శివయ్య భజన పాటలతో గర్భాలయం మారుమ్రోగింది. ఆ కొద్దిసేపు అక్కడున్న వారందరిలో ఆధ్యాత్మిక తన్మయత్వం ప్రస్పుటంగా కనిపించింది.
ఆ వెంటనే ఆలయం ముందున్న
శివాజీ సమాధి దగ్గరకు వెళ్లగానే అందరినీ మౌనం ఆవహించింది.
ఒక్కసారి ఆ #ఛత్రపతి పరాక్రమం, శౌర్యం మదిలో మెదిలి స్పూర్తి నింపింది.. శివరాయ సమాధి ముందరే ఉన్న ఆయన పెంపుడుశునకం #వాగీయాసమాధిని చూసి మళ్ళీ అంతా నిశ్శబ్దమయ్యారు.
🌿 వర్షంలో ప్రకృతి అద్భుతం
చుట్టూ నీటి జలపాతాలు ఏర్పడినట్టు చిన్న చిన్న ప్రవాహాలు. మబ్బుల మధ్య ఏ కొండ కనిపిస్తే అది నీలమణి దిబ్బలా మెరుస్తోంది. అడుగడుగునా ప్రకృతితో చరిత్ర కలిపిన ఆవేశం, ఆనందం కలగలిసి వచ్చాయి.
వర్షం వల్ల నేల తడి, కాని మనసు ఉత్సాహంగా నిండిపోయింది. చలిలో కూడా ఉష్ణతను తీసుకువచ్చినదేమిటంటే — అది శివభక్తి.
✅ వర్షంలో రాయగడ్ కోట అనుభవం అఖండ భారత్ యాత్రాబృందానికి జీవితాంతం గుర్తుండిపోయే స్మృతిలా మారింది.
ఇది కోట సందర్శన కాదు — ఇది నిత్య చైతన్యంలో మునిగిపోయే సామాజిక చైతన్య ✊యాత్ర.
#indianheritage
#SHIVAJIFORTS #Sahyadri
#RAIGHAD #adventure #trecking #PMOIndia Vishweshwar Reddy Konda