కన్న పిల్లలని పెంచినంత ప్రేమ గా తమిళనాడు ముదుమలై ఫారెస్ట్ కి చెందిన బొమ్మన్ ,బెల్లీ లు అనాథలైన ఏనుగు పిల్లల ని పెంచడం..ఇది మొత్తం ఒక డాక్యుమెంటరీ గా కార్తీకి అనే ఆవిడ డైరెక్ట్ చేసి షార్ట్ ఫిల్మ్ క్యాటగిరిలో ఆస్కార్ పొందడం..అద్భుతం.
https://youtu.be/a0J0b_OVa9w
చిన్న ఏనుగు పిల్లకి రఘు అని పేరు పెట్టుకుని పిల్లాడికి అన్నీ నేర్పినట్టు నేర్పించడం,అలవాటు చెయ్యడం, ఇంతలో అటవీశాఖ వాళ్ళు ఇచ్చిన మరో ఏనుగు పిల్ల అమ్ములు నీ కూడా పెంచుతూ... రఘు ,అమ్ములు ఇద్దరూ వాళ్ళ పిల్లలే అన్నట్టు ఆలనా పాలనా చూడటం ..ఇదంతా కష్టసాధ్యం సామాన్యులకి.
బొమ్మ న్, బెల్లీ కి మాత్రం ఇష్టం అంతే..
ఒక చిన్న ఏనుగు పిల్ల ఐదేళ్ల తర్వాత ఎలా ఉంటుందో గ్రాఫిక్స్ లో చూపకుండా ఐదేళ్ల పాటు షూట్ చేసిన కార్తీకి పడ్డ శ్రమ నీ ఆస్కార్ శభాష్ అంది.
ఫోన్ లకి టెక్నాలజీ కి దూరం గా, ప్రకృతికి ,జంతువులకి, టైగర్ ఫారెస్ట్ అని పేరున్న ముదుమలై ఫారెస్ట్ లో ఉండే బొమ్మ న్ ,బెల్లీ లు ....ఎదిగిన రఘు గాడు వెళ్లిపోతుంటే పడిన బాధ కి ఆస్కార్ సలాం కొట్టింది .
లక్ష్యం అంటే అనుకున్నది సాధించడం కాదు లక్ష్యం కోసం జీవితాన్ని ఇవ్వడం అదే ఎలిఫెంట్ విష్పరర్స్ కధ.
సేకరణ : Social Media
No comments:
Post a Comment