Friday, March 31, 2023

శ్రీరామ నవమి -2023

*శ్రీరామ నవమి ఉత్సవాలు-2023*
అనుగ్రహనికి ధన్యులం🙏..
నాలుగు స్థలాలలో శ్రీరామ 🚩కళ్యాణ ఉత్సవాలలో పాల్గొనే అవకాశం..
ఆనవాయితీగా గుడిబండ శ్రీ రామలింగేశ్వర దేవాలయం, రంగాపూర్, మొదటి సారే బాగా నిర్వహించిన జయమ్మ గూడ, వైభవంగా జరిగిన ఆగపల్లి, రాత్రి పూట జరిగే రాచకొండలో రామకళ్యాణం...
ఒక గ్రామం @చిత్తాపూర్ లో భరాత్😃..
అన్ని గ్రామాలు మంచాల మండలంలో కావడం యాదృశ్చికం..

Wednesday, March 29, 2023

శ్రీరామ నవమి -2023

రాముడికి రాజ్య పట్టాభిషేకం అన్నారు. ఆ వార్త పూర్తిగా చెవిలో పడకముందే కాదు, అరణ్యవాసం అన్నారు. ఒక్క శ్రీ రాముని ముఖంలో తప్పా అక్కడున్న అందరి ముఖాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
శ్రీరాముడు మాత్రం కైకేయి వద్దకు వెళ్లి..
తల్లీ!భరతుని కోసం రాజ్యాన్నే కాదు, నా ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి నేను సిద్ధమే. నా సంగతి తెలిసి కూడా భరతుణ్ణి రాజుని చేయడం కోసం తండ్రి నుండి వరాలు కొరవలసిన అవసరం ఏముంది!  అయినా అయోధ్య కన్నా విశాలమైన అరణ్యం నాకు లభించినందుకు ఆనందంగా ఉన్నది తల్లీ! అని చెప్పి ప్రశాంతంగా అరణ్యానికి వెళ్ళాడు..
 రామున్ని అంతగా ఎందుకు ఆరాధించాలో చెప్పే ఒక చిన్న ఉదాహరణ ఇది.

శ్రీ రాముడు అరణ్యవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కైకేయి వద్దకు వెళ్లి ప్రణమిల్లి పచ్చాతాపంతో ఉన్న ఆమెతో 'తల్లీ! నీవే గనుక నన్ను అరణ్యవాసానికి పంపిoచకపోయినట్లయితే..
నా పట్ల తండ్రి దశరథునికి నా ఎడబాటుని భరించలేనంత ప్రేమ ఉండని తెలుసుoడేది kaadu; సీతకు నాపట్ల అపారమైన అనురాగం ఉన్నట్లు అర్థమయ్యేది కాదు; నేను లేకపోతె శ్వాస పీల్చుకోవడం కూడా సాధ్యం కాదన్నంత బంధం లక్ష్మణుడికి ఉందని నాకు తెలిసేది kaadu; భరతునికి నా పాదుకలనే నన్నుగా భావించి ఆరాదిoచేoత భక్తి ఉందని అర్థమయ్యేది కాదు అంటూ ఓదార్చాడు..
ఇందుకు కదా రామున్ను అంతగా ఆరాధిoచేoదుకు కావాల్సిన సంఘటనలు..
Always B+.

Sunday, March 26, 2023

వీర్ సావర్కర్

వీర్ సావర్కర్ 
ఒక కొబ్బరికాయ పీచుతీయాలంటే కత్తికోసం వెదుకుతాం! 
.
అదే గోళ్ళతో తీయమంటే!
 వామ్మో!  ఎంత కష్టం!
.
అట్లాంటిది ప్రతి రోజూ రెండు బస్తాల కొబ్బరికాయలు చేత్తో పీచుతీసి, గానుగలో వేసి ఎద్దుకు బదులుగా తాను గానుగాడి నూనె తీసి,ఒంటరిగా చీకటికొట్లో 
27 సంవత్సరాలు మగ్గిమగ్గి  ,
బొగ్గుతో గోడలమీద కవితలువ్రాసి, వ్రాసినదానిని కంఠస్తం చేసి తదనంతర జీవితంలో పుస్తకంగా అచ్చువేయడం మానవమాత్రుడికి సాధ్యమవుతుందా! 
.
దానికి ఎంత ఓర్పు! కావాలి!
ఎంత మానసిక దృఢత్వం కావాలి!
.
అసలు అలాంటి మనిషి పుట్టాడా?
.
లేకేం ఉన్నాడు !
.
అలాంటి మనిషొకడు మన స్వాతంత్ర్య సమరయోధుడని ఎంతమందికి తెలుసు? 
.
మన పాఠ్యపుస్తకాలు అసలు ఆయన గురించి చెప్పాయా!
.
అండమాన్ సెల్యులర్ జైలులో గాలి వెలుతురు దూరని గదిలో 27 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఏకబిగిన అనుభవించి జీవితంలోని యవ్వనాన్ని దేశంకోసం ధారపోసిన మహనీయుడు
" స్వాతంత్ర్య వీరసావర్కర్ "

 ఒకరిద్దరివల్లనే మనకు స్వాతంత్ర్యం రాలేదు !
.
అది ఎంతోమంది త్యాగధనులు జీవితాన్ని తృణప్రాయంగా భావించి స్వాతంత్ర్య కదనరంగంలో కొదమసింగాల్లా దూకటం వలన వచ్చింది !
.
 వారిలో సావర్కర్ అగ్రగణ్యులు !
.
వీరసావర్కర్ ఎంతోమంది వీరులలో స్ఫూర్తి రగిలించేవారు .ఆయన
చుట్టూ లండన్ లో ఎంతో మంది దేశభక్తులు గుమికూడేవారు ! వారికి గురుస్థానం ఈయనదే !
..
వారు ..భాయీపరమానంద్,వీరేంద్రనాధ్ చటోపాధ్యాయ, వి.వి.స్ అయ్యర్..,సర్దార్ సింగ్ రాణా ,మేడమ్ కామా !, బాపట్ , ఎమ్.పి.టి. ఆచార్య ,మదన్ లాల్ దింఘ్రా....... 
.
ఇలా ఎంతోమందికి ఉపదేశగురువు ఆయన !

మన దురదృష్టం ఏమిటో కానీ ఇంతమంది,ఇంకా ఎంతోమంది  అకళంక దేశభక్తుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్యం అని మన పిల్లలకు తెలియకపోవడం !
.
 వీరుల చరిత్ర మనం పిల్లలకు చెప్పక ఎవరో ఒకరిద్దరి వల్ల స్వాతంత్ర్యం వచ్చింది అనే అబద్ధాలు విరివిగా ప్రచారం చెయ్యడం ! వాటినే పిల్లలు నమ్మడం ! 
.
వీరసావర్కార్ ను చదవండి చదివించండి !!!
..
సావర్కర్ అంటే మొక్కవోని ఉక్కు సంకల్పం 
సావర్కర్ అంటే స్ఫూర్తి
సావర్కర్ అంటే రగిలే నిప్పుకణం
సావర్కర్ అంటే సాహసం
సావర్కర్ అంటే తలవంచని వ్యక్తిత్వం
సావర్కర్ అంటే నిజాయతి
సావర్కర్ అంటే నీతి 
సావర్కర్ అంటే ధైర్యవంతుల గుండె చప్పుడు...

25సంవత్సరాలు ఒంటరి జైలు జీవితం ఎంత కఠినమో అర్ధం అవుతుంది..
వీర్ సావర్కర్ లాంటి వారు లక్షల మంది జీవితాలను ధార పోయడంతో  వచ్చిన స్వాతంత్ర్యాన్ని చాలా సుఖంగా అనుభవించేస్తున్నాం మనం....

భారత మాతకు జయము

ఇంతటి దేశభక్తుడి ఆస్తిని బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసింది.. స్వాతంత్య్రం తరువాత వచ్చిన భారతీయ ప్రభుత్వం ఆస్తిని ఆయనకు అప్పగించలేదు కూడా..ప్రధాని ఎవరో చెప్పనక్కరలేదు కదా..

సేకరణ: Social Media 

Saturday, March 25, 2023

ఏడు కొండలవాడ కనరా మమ్ము

Facebook post of 26.03.2018
ఏడు కొండల వాడా కనరా మమూ _ నీ నామంబు కొలిచేటి నిరుపేదమూ...
అంతా లీలా..
రావాలనే ఆలోచనే లేకుండే.. రమ్మంటే రాకుంటామా. 
ఏకాదశినాడు ఏకాంతంగా ఏగినందుకు ఏమి వరాలిస్తాడో తన సన్నిదిలో..
ఏదేమైనా మరోమారు బండిమీద కొండకు.
కొండలరాయుడి చెంతకు.
చీకూ, చింతలన్నీ ఎంకన్నకేసి తిరుగాలి తిరుమల కొండంతా..ప్రశాంతంగా. 
మోసుకొచ్చిన చింతల బరువంతా కొండల కొనేటి రాయుడికిచ్చి, నిశ్చింతగా నిలవాలనుకోవడం మన అత్యాశే..ఆశ దోస అప్పడం వడ...  
నిశ్చింతగా, నిరంతరాయంగా అపన్నులకు అండగా ఉండడమే ఆ ఎంకన్న సేవ. 
మనమూ గదే ప్రయత్నం చేద్దాo. 
ఆయన్ని అదే అడుగుదాం. ఏమంటాడో చూద్దాం మరి. 
అంతా లీల.
ఆపన్నహస్తా.. అనాద భాందవా... గోవిందా గోవింద..

అమ్మాయే పూజారి @ తిరుపతి

అమ్మాయే పూజారి..
FB post of 26.03.2018
ఆంజనేయుడి గుడిలో అమ్మాయే పూజారి.
శ్రీకృష్ణ దేవరాయుడి పాలనలో నిర్మించిన పంచముఖి ఆంజనేయుడి ఆలయం, #కృష్ణాపరఠాణ, #తిరుపతి. 
నిత్యం రద్దీగా ఉండే తిరుపతిలోని  #గోవిందరాయస్వామి దేవాలయానికి అతి సమీపంలో, చౌరస్తాలో ఉన్న ఈ ఆలయాన్ని అదికారులు తొలగిద్దామని చేసిన ప్రయత్నాలన్నీ వృదానే అయ్యాయంట. ఆ పంచముఖుడే అదికారులకు పంచ్ లిచ్చి, మాకు ఈ ఆలయ భాద్యతను అప్పజెప్పాడు అంటున్నారు నిర్వహకులు. 
అవుసరం కోసం కుటుంబం అంతా అయన సేవలో ఉంటాం అంటున్నారు. 
మరి మహిళలు ఆలయంలో, అదీ ఆంజనేయుడు ఆలయంలో పూజారిగా ఉండొచ్చా అని అడిగుతే .. ఎందుకుండ కూడదు, ఎవరన్నారు ఉండకూడదని ఎదురు ప్ర|శ్న..
నిజమే కదా భక్తికి, శక్తికి లింగ భేదం లేదని శాస్త్రాలను ఔపాసన పట్టిన మన పెద్దలు ఎప్పుడో చెప్పి ఉన్నారుగా.
అవును అవుసరాలు అవకాశాలు అందించి, అన్నీ నేర్పుతాయి. అన్నీ మరిచి అనుసరించడమే మనం చేయాల్సిన పని. 
మన శిరిషా అదే చేస్తుంది..  అక్క, బావలకు ( హరనాథ్, శాంతి) అండగా ఆంజనేయుడి గుడిలో, అవుసర నిమిత్తం పూజారి.  
B.Tech & Fashion designing చదివి, అదీ ఆంజనేయుడి గుడిలో పూజారిగానా అంటే... అవును తప్పేముంది.. అన్నీ ఆ స్వామివారే చేయించుకుంటున్నాడు మనదేముంది అని సమాదానం. 
అంతేగా మరి, భక్తికి లింగబేదం లేదు_ ఆవుసరాలు అన్నీ నేర్పుతాయి అన్న మాట నిజమే అనిపించింది.

#Tirupathi  #HanumanTemple 
 #NOGenderDiscrimination

Thursday, March 23, 2023

అవకాశాలు ఊరికే ఎందుకొస్తాయి?

మాతాపితరుల సేవాసదనం సందర్శన @24.03.2021 
అవకాశాలు ఊరికే ఎందుకొస్తాయి.. ఆశతోనో, ఆశయంతో ఉన్న కొందరిచే అవి సృష్టించబడతాయి.. ఆలోచనలకు ఆచరణ తోడైతే అద్బుతాయి జరగక ఇంకేం జరుగుతాయి...
ఓ పనిలో నిండా మునిగిన వారికి వయస్సుతో సంబందమే లేదు.. మనస్సుతోనే పని.. అదే ఆపనిలో ఆనందాన్ని ఇస్తుంది. వాల్లు అడవిలో ఉన్నా, జనావాసంలో ఉన్నా వాల్ల పనిలో వారు ఉంటారoతే..
 #కాన్సర్ రోగులకోసం ఓ రెండెకరాల స్థలంలో #ఆవాసం. కట్టకముందంతా అక్కడ బండరాళ్ళే.. ఇప్పుడు #ఆవగింజంత స్థలం #కాళీలేకుండా అన్నీ #మొక్కలే..  #కాయకూరలు, #పండ్లమొక్కలు, #పూలమొక్కలు, #ఔషదమొక్కలు...ఒకటేమిటి అన్ని రకాల మొక్కలు. అన్నీ 
#సేంద్రీయఎరువులతో వాడకమే...ఆ స్థలమే #మాతాపితరులసేవాసదనం  వారిచే నడపబడుచున్న Naturopathy Training center  #క్యాన్సర్ వ్యాదిగ్రస్తుల #ఆవాసం@ #వినోభానగర్, వీరపట్నం.
అది వృద్దులచే నడపబడుచున్న ఆవాసం..వారు వయసులో మాత్రమే వృద్ధులు..
ఆ కాయకూరల సాగు Gnana Saraswathi   #సాధనకుటీర్ లో   పండియ్యలేమా?...  అనే ఆలోచన సందర్సన తరువాత కలిగింది. 
ఇగ పని మొదలుపెట్టడమే..

Bharath Dharshan Yatra @March-2021

Bharath Dharshan Yatra
TamilNadu Trip.
Successfully Completed trip with 3280Kms, on road in week days and visited..
1.bhavani nagar 2.madhura
3.palani 4.kanyakumari
5.suchindram.6.thiruchendur
7.dhanuskoti 8. Rameshwaram
9. Srirangam 10.Jambukeshwaram

11.kumbhakonam 12.chidambaram
13. Arunachalam 14.kanchi
15.srikalahasthi
16.thirupathi (No Dharshanam Only Laddus).

 Thx  #God, #Nature & Health to Support our trip..
  Congratulations to team members for Good Cooperation.
అవి కేవలం పూజల కోసమే కట్టన దేవాలయాలు మాత్రమే కావు... అత్యద్భుత #కళాకండాలకు నిదర్శనాలు..
 కొండలమధ్య వెలసిన ఆ దేవదేవతలకన్నా, ఆ దేవతల అనుగ్రహాలను భవిష్యత్తు తరాలకు అందించాలని తపనపడ్డ నాటితరం దార్శనికుల #శ్రద్దాకేంద్రాలు...
 సుమారు 15 ఎకరాలు నుండి మొదలై 100 పైగా ఎకరాలలో, అద్భుత శిల్పకళ ను రాళ్లలో బంధించిన ఆ శిల్పుల #సమర్పణకు #ప్రణామాలు. 

సుమారు 30 అడుగుల ఎత్తు, 
100అడుగుల వెడల్పులతో ఆలయ లోపలి ప్రాకారాలు పూర్తిగా రాళ్లలో నిండిన #శిల్పాలు, 300/100 అడుగుల ఎత్తు, వెడల్పులతో,
ఒక్కో ఆలయానికి నాలుగు #ముఖద్వారాలు, #గోపురాలు..

 అత్యoత వైభవంగా జరిపిన నిర్మాణాలు మాత్రమే కాదు,
ఆ ఆలయాల #నిర్వహణ కూడా అత్యద్బుతం. లక్షలమంది భక్తులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు. అన్ని వర్గాల వ్యవస్థలు, అన్నివేళలా  అందుకు సిద్ధంగా ఉండటం #మాహాఅద్బుతం. 
 తెలుగు రాష్ట్రాల మాదిరిగా 
#ఎక్కువధరతో కొనుకున్న వారికి దగ్గరగా #దైవదర్శనం అన్న నిబంధనలు  లేకపోవడం #ఆనందదాయకం.
ఆలయాలలోని గర్భాలయంలో విద్యుత్ దీపాలు అసలు వాడకుండా,     #తైలదీపాలతో అలంకరణ దర్శనం #ఆలయాలకు అద్భుత ఆధ్యాత్మిక శోభను అందిస్తుంది... 
ఇలాంటి అద్భుత ఆలయాలను నిర్మించిన వారికి, నిర్వహణలో ఉన్నవారికి నమస్సులు..
తమిళనాడులోని ముఖ్య ప్రదేశాలలో వెలసిన ఆలయాలను బృందంతో కలిసి సందర్శించన సందర్బంగా కలిగిన వ్యక్తిగత  భావన/అభిప్రాయం..
#మానవవికాసకేంద్రాలుగా #విలసిల్లినవి #మనఆలయాలు,
 ఆ పరంపరను కొనసాగిద్దాం.

Wednesday, March 22, 2023

షహీద్ దివస్ @22rd March

భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడడం నా జీవిత లక్ష్యం.. అవుసరమైతే దేశంకోసం బలుదానం చేస్తా...ఇది నా  ప్రతిజ్ఞ -భగత్ సింగ్:
హింసను హింసతోనె ఎదుర్కోవాలని మాత్రుభూమి సేవలో నవ్వుతూ  నవ్వుతూ జీవితాన్ని బలిదానం చేయగల దృడసంకల్పంతో ఆంగ్లేయుల నెదిరించిన వీరుడు మన భగత్ సింగ్..
ఉరితీయడానికి కొన్ని గంటల ముందు "దేశ భక్తుడి కోరిక" (సర్ప్ రోషీ కీ తమన్నా - రాం ప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ) చదువుతూ  కూర్చున్న భగత్ ను  " సర్దార్జీ ఉరి తీయడానికి ఆర్డరొచ్చింది అన్న ఆంగ్లేయ అదికారిని...
కాస్త ఆగండి ఒక విప్లవకారుడు మరో విప్లవకారుడితో మాట్లాడుతున్నాడని  చెప్పి.....
నిర్మలమైన కళ్ళతో, నిశ్చయమైన నవ్వుతో, నిర్భయమైన గుండెతో, నిఖార్సయిన దైర్యంతో  ఉరికంబానెక్కేందుకు తొందరపడుతూ,  ""భగవంతుడా! నాకు మళ్ళీ విప్లవకారునిగానే జన్మనివ్వ్వు"  అని ప్రార్థించిన అగ్నికణం మన భగత్ సింగ్.
ఆ వీరుని పాటు రాజగురు, సుఖదేవ్ లను ఉరి తీసిన రోజు నేడు (మార్చ్ 23)... వీరులకు ప్రణామ్..
" త్యాగమూర్తులను స్మరించుకుందాం - భావితరాలకు స్ఫూర్తి నందిద్దాం".
## దేశంకోసం నవ్వుతూ  నవ్వుతూ   బలైన వారి ప్రేరణతో .. నవ్వుతూ   నవ్వుతూ  దేశం కోసం  జీవిద్దాం.. దేశంకోసమే పనిచేద్దాం###.

Tuesday, March 14, 2023

నాగలి కథ

#నాగలి_కథ
సేకరణ: Social Media 
నాగలి ఎలా తయారు చేస్తారు? ఆ రోజుల్లో పెద్దగా చదువుకోకపోయినా మన పూర్వీకుల పనితనం ఎలా ఉండేది.? వ్యవసాయ పనిముట్లపై వాళ్ళ శ్రద్ధా భక్తి ఎలా ఉండేవి? 

ఇలాంటి విషయాలు... నేను తప్ప ఎవరూ గ్రంథస్తం చేయరు...ముందు తరాలకు ఈ విషయాలు తెలియాలి అని సంకల్పించి మరీ #నాలుగో_ఎకరం పుస్తకం రాసారట #శ్రీరమణ గారు...
--------------------------------------------------
పక్కనే ఆనించి పెట్టిన అరకని తీసి దాని తల తన ఒళ్లో పెట్టుకున్నాడు పెద్దకాపు. నేను కళ్లు విప్పార్చి చూస్తూ కూర్చున్నాను. పక్కనే మంచి గుమ్మడిపండు తొడిమెమూతతో వున్న చిన్న నూనెసీసా అందుకున్నాడు. అందులోంచి ఏకుని ముంచి తీశాడు.

"ఇది అవిశనూనె. నాగలిదుంపకి అప్పుడప్పుడు రాస్తా ఉండాల. ఇదిగో ఈ చివర బిగించిన 'కర్రు' తుప్పట్టకుండా దీనికీ రాయాలి" అంటూ ఆ పని వైనంగా పూర్తిచేసి నాగలిని బుజం మీద వేసుకు తీసికెళ్లి పక్కనున్న గోడకి అమర్చాడు.

దానితో పని తీరిపోయినా ఆ రైతుకున్న శ్రద్ధ, మమకారం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నూనెచేతులు పాదాలకు రాసుకుంటూ, "ఇంకేంటి సామీ సంగతులు" అన్నాడు చనువుగా..

ఏం లేవంటూనే, "దీన్ని ఏ కొయ్యతో చేస్తా"రన్నాను ఆసక్తిగా.

"సాజెంగా తుమ్మకర్రతో చేస్తారు.”

నా వంక చూసి,  “నాగలి దుంపంటే బజార్లోనో సంతలోనో దొరికేది కాదు. దీని కత చెబుతా... విను" అని మొదలుపెట్టాడు.

"అబ్బో! ముందసలు దుంపకి దుంగ దొరకాల. ఫుల్గా చేవ పట్టి ఉండాలి. పది జానల తుమ్మ మొద్దుని నాలుగు అమావాశ్శల పాటు నీళ్లలో ఊరెయ్యాలి. దాన్ని బయటకు తీసి ఓ నెలపాటు ఎండలో పడెయ్యాలి. పై బెరడు సుబ్రంగా వొలవాల. అప్పుడు బెమ్మం బాబాయ్ దాన్ని తట్టి, తిప్పి అన్ని దిశల్నించీ చూసి, మాంఛి లగ్గం పెట్టి పనిలోకి దిగుతాడన్నమాట. అబ్బో! అదో పెద్ద అంగామా” అంటూ ఊపిరి పీల్చుకుని నా వైపు చూశాడు.

నా కళ్లు చెప్పమన్నట్టు చూశాయ్.

మళ్లీ కథ మొదలైంది.

"బెమ్మంగారి చూపులు తీవ్రంగా ఉండేవి. పిట్టలా గుప్పెడు మడిసి. గావంచా, కాసంత కుంకం బొట్టు, మెడలో వేలాడే పెద్ద రుద్రాచ్చ, చిన్న లింగం రాయితో ఉండే బెమ్మంగారిని, 'నువ్ మాంత్రికుడల్లే ఉంటావ్ బాబాయ్' అంటే, 'ఔనను... మాంత్రికుణ్ణే... నాగలిదుంపని చెక్కడమంటే మాటలా... ఓ దేవుడ్ని చెక్కడమే' అనేవాడు.

దుంగకి ఓ పక్కగా నిలబడి పెద బాడిసతో ఆయన చెక్కడం చిత్రంగా ఉండేది. ఎక్కడా కొలతలు, గీతలు ఉండవ్. బాబాయ్ మనసులో, కళ్లలో ఉంటాయంతే! రోజూ పొద్దుటిపూట వాలెండలో ఓ గంటసేపు మాత్రమే ఈ పనిలో ఉండేవాడు.

ఆ అరక ఆసామి అది పూర్తయే నెల్రోజులూ ఫ్లాస్కో నిండా కాఫీ తీసికెళ్లాలి. ఆరారగా కాఫీ తాగడం బెమ్మంగారికి అలవాటు.

రోజూ పొద్దున్నే ఎల్లేవాణ్ణి, సొంతగాడు శ్రద్ధ చూపించకపోతే బాబాయ్కి సెడ్డ కోపం వచ్చేది. నెల్రోలకి పెదబాడిస పని పూర్తయింది. చినబాడిసతో, చిత్రిగ్గులతో సవరింపులు చేశాడు.

'ఉక్కుముక్కలా ఉంది కాపూ... అంతా చేవే' అని మెచ్చుకున్నాడు. నాగలి దుంపని పదిసార్లు తడిమి చూసి, చేత సరిగ్గానే ఉందనుకున్నాడు.

'కుదిరిగ్గా వచ్చిందిలే.... ఏట్లో సొరశాపల్లే నేల్లో దూసుకుపోతంది రాగవా' అన్నాడు.

'అంతా నీ పనితనంమయిమ బాబాయ్' అంటే -

'నాదేవుంది... అది తుమ్మమానులో నీ కోసం కూకునుంది... దాన్ని సుతారంగా బయటకు లాగా... అంతే!" అన్నాడు, లోపల మురిసిపోతానే,

మిగతా నిలువుపీట, మేడి ఒక్క పూటలో సిద్ధం చేశాడు. కొలిమి పెట్టి ఉక్కుకర్రు పోత పోశాడు. దానికి 'వాయ' పెట్టాడు. పదునుతో బుసలు కొడుతున్న కర్రుని దుంపకొనకి ఇనపకట్టుతో గట్టిగా బిగించాడు. మళ్లీ ఒకసారి తడిమి చూసుకున్నాడు. కొత్త నాగలికి పసుపుకుంఖాలు పెట్టి నా బుజానికెత్తాడు బాబాయ్.

'వేయి ఏరువాకల పాటు మీ క్షేత్రాలు దున్ని, బంగారు పంటలు పండించాలి' అరకతో నించున్న నన్ను వెన్నుతట్టి దీవించాడు.

చకునం చూసి సాగనంపాడు... నాకు బాగా గుర్తు... యింకా కళ్లముందుంది.

ఓ బస్తా గింజలు పంపితే తీసుకునేవాడు.. లేదంటే అడిగేవాడు కాదు...

ఇదే మనూరి బెమ్మం గారు చెక్కిన ఆఖరి నాగలి దుంప...అది సామీ దీని కత...

అంతా విన్నాక నాకు దాన్నోకసారి తాకాలనిపించింది.. రెండు చేతులతో దాన్ని అద్దుకున్నాను...

ఫోటోలు : శ్రీనివాస్ రెడ్డి గారు

పనసపoడు @సాధన కుటీర్


ఈ బండ రాళ్లలో మొక్కలేడ ఎదుగుతాయి..
చేసిన శ్రమ, పోసిన నీళ్లన్నీ వృధానే..
 అని ఎక్కిరించిన స్థలంలోనే 
నాటిన విత్తు మొక్కయ్యి,  చెట్టుగా ఎదిగి పూలు పూసి, పిందలు కాయలుగా మారి పండ్లయ్యే వరకు జరిగే పరిణామం దగ్గరుండీ చూస్తుంటే అదో అనుభూతి..సాధన కుటీర్ వనంలో ఉన్న పనస చెట్లకు కాయలు కాయడం షురూ... తినడానికి మాత్రం ఇంకొన్నాళ్ళు ఆగాలి😋...

Monday, March 13, 2023

OSCAR to ELEPHANTS

కన్న పిల్లలని పెంచినంత ప్రేమ గా తమిళనాడు ముదుమలై ఫారెస్ట్ కి చెందిన బొమ్మన్ ,బెల్లీ  లు అనాథలైన ఏనుగు పిల్లల ని పెంచడం..ఇది మొత్తం ఒక డాక్యుమెంటరీ గా కార్తీకి అనే ఆవిడ డైరెక్ట్ చేసి  షార్ట్ ఫిల్మ్  క్యాటగిరిలో ఆస్కార్ పొందడం..అద్భుతం.

https://youtu.be/a0J0b_OVa9w

సొంతం ,బాధ్యత అనుకుంటే కొన్ని కష్టమైనా చెయ్యాలి అనిపిస్తుంది.
చిన్న ఏనుగు పిల్లకి రఘు అని పేరు పెట్టుకుని పిల్లాడికి అన్నీ నేర్పినట్టు నేర్పించడం,అలవాటు చెయ్యడం, ఇంతలో అటవీశాఖ వాళ్ళు ఇచ్చిన మరో  ఏనుగు పిల్ల అమ్ములు నీ కూడా పెంచుతూ... రఘు ,అమ్ములు ఇద్దరూ వాళ్ళ పిల్లలే అన్నట్టు ఆలనా పాలనా చూడటం ..ఇదంతా కష్టసాధ్యం సామాన్యులకి.

బొమ్మ న్, బెల్లీ కి మాత్రం ఇష్టం అంతే..

 ఒక చిన్న ఏనుగు పిల్ల ఐదేళ్ల తర్వాత ఎలా ఉంటుందో గ్రాఫిక్స్ లో చూపకుండా ఐదేళ్ల పాటు షూట్ చేసిన కార్తీకి పడ్డ శ్రమ నీ ఆస్కార్  శభాష్ అంది.

ఫోన్ లకి టెక్నాలజీ కి దూరం గా, ప్రకృతికి ,జంతువులకి, టైగర్  ఫారెస్ట్ అని పేరున్న ముదుమలై ఫారెస్ట్ లో ఉండే బొమ్మ న్ ,బెల్లీ లు   ....ఎదిగిన రఘు గాడు వెళ్లిపోతుంటే పడిన బాధ కి ఆస్కార్ సలాం కొట్టింది .

లక్ష్యం అంటే అనుకున్నది సాధించడం కాదు  లక్ష్యం కోసం  జీవితాన్ని  ఇవ్వడం అదే ఎలిఫెంట్ విష్పరర్స్ కధ.
సేకరణ : Social Media 

Saturday, March 11, 2023

Bidar Trip on 12.03.2015

One day Trip with  #YUVASHAKTHI
   #BIDHAR on 12.03.2015

 అదృశ్య శక్తి (దేవుడు) యొక్క శక్తి కంటే కూడా..అందరి మేలుకోసం, తమకున్న జీవిత కాలంలో కొంత/ జీవితాంతం శోదించీ, సాదించి భవిష్యతరాలకోసం తమ జీవితాలను సమర్పణ చేసిన జీవులకే జేజేలు కొట్టాలనిపిస్తుంది...
 హైదరాబాద్ నుండి సుమారు 150 కి.మీ దూరంలో ఉన్న బీదర్ లోని  నరసింహస్వామి దేవాలయం, గురుద్వార, పాపనాషనం, స్వయంభు సిద్దివినాయక ఆలయం, శైవ సంఘ  వంటి క్షేత్రాలను దర్శించినాక నాకు కలిగిన భావన ఇది....
వందల  సం.రా ల క్రితం... సరైన పనిముట్లు, ఆదునిక పరికరాలు లేకుండానే..జన సంచారాలకు దూరంగా అదీ ఎత్తైన ప్రదేశాల
లో స్వయంభుగా వెలసిన ఆ దైవ రూపాలను గుర్తించి భవిష్య తరాలకు అందిఛాలనుకున్న వారి ఆశయానికి, వారు పడ్డ శ్రమకి...వారి దార్శనికతకి ఏ రకంగా కృతజ్ఞతలు తెలపాలో...

Friday, March 10, 2023

మహాత్ముల విజయ రహస్యం

శిల శిల్పం కావాలంటే..
ఉన్నత స్థితికి చేరు కోవాలని ఆశించేవారెవరైనా విషాదాన్ని అమృతంలా సేవించేందుకు సిద్ధమవ్వాలి. ఇదే మహాత్ముల విజయ రహస్యం.
ఈ జీవిత సత్యాన్ని విశదపరిచే ఒక సన్నివేశం మీ ముందు ఉంచుతున్నాం…
ఓ నదీ తీరాన ఒక యువకుడు నిలబడి, నీళ్ళకోసం కడవ నెత్తిపై పెట్టుకొని వెళుతున్న స్త్రీని చూశాడు. ‘ఆహా! ఆ కడవ ఎంత హుందాగా ఆ స్త్రీ నెత్తిమీద కూర్చుంది’ అని అనుకున్నాడు. దగ్గరకు వెళ్ళి ఆ కుండతో ‘ఓ కడవోత్తమా! నీవు ఇలా ఈ స్త్రీ తలమీద కూర్చొని దర్జాగా వెళుతున్నావు. నీ పనే బాగుంది’ అని అన్నాడు.
అందుకు ఆ కడవ ”ఓ యువ మిత్రమా! నేను ఈనాడు ఇలా హాయిగా ఉండడానికి ముందు ఎన్ని కష్టాలు అనుభవించానో తెలుసా? 
మీ మానవులు మొదట నన్ను గునపాలతో పొడిచి నా తల్లి భూమాత నుండి వేరు చేసినప్పుడు ఎంతగానో కుంగిపోయాను.
ఆ తరువాత నన్ను పాదాలతో తొక్కుతూ హింసించినప్పుడు ఎంతో సహనం వహించాను. అది సరిపోదన్నట్లు బట్టీలో పెట్టి కాల్చినప్పుడు ఎంత బాధను అనుభవించానో నీకేం తెలుసు?
ఆ తరువాత అంగడిలో నన్ను అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారులతో తిన్న మొట్టికాయలు అన్నీ ఇన్నీ కావు. 
ఇలా ఎన్నో కష్టాలు అనుభవించబట్టే ఈనాడు ఈ స్థాయికి చేరుకోగలిగాను” అని తన విషాదగాధను వినిపించింది.
నిజమే కదా...అనుకున్నాడు ఆ యువకుడు.
ఎన్నో కష్టాల తరువాత గాని మట్టి.. కుండ అవ్వదు.. ఎన్నో దెబ్బలకు ఓర్చితే గాని రాయి శిల్పం అవ్వదు. బాధలకోర్వలేని మనిషి మహనీయుడు అవ్వలేడు
“కష్టాలు మన జీవన సౌధ నిర్మాణానికే గాని, వినాశానికి కాదు” అన్న హితోక్తిని అర్థం చేసుకున్న మహాత్ములు విషాదమనే చీకటి నుండే ఆనందమనే కాంతి కిరణాలు ఆవిర్భవిస్తాయని నిరూపించారు.

కాలం తయారు చేసుకున్న యోధులు

Facebook post of 11.03.2013.

కాలం తయారు చేసుకొన్న యోధుడు నరేంద్ర మోడీ.
తనకు కావలసిన యోధులను కాలమే తయారు చేసుకుంటుంది. ఆ యోధులు హీరోలు కావచ్చు, విలన్‌లు కావచ్చు. లక్షలాది మంది యూదులను హతమార్చిన హిట్లర్‌నైనా, ప్రపంచాన్ని పాలించే అమెరికాను గడగడలాడించిన లాడెన్‌నైనా .. కోట్లాది మందిలో స్వాతంత్రేచ్ఛను రగిల్చిన మహాత్మాగాంధీనైనా, ప్రపంచానికి మార్గాన్ని చూపించిన బుద్ధ్ధుడినైనా కాలమే తయారు చేసుకుంటుంది. అంత కన్నా ముందు ఆ తరువాత వీరికన్నా శక్తివంతమైన వారు పుట్టి ఉండవచ్చు కానీ కాలం సహకరించక పోవడం వల్ల వారి ఉనికే తెలియకుండా పోయింది. భారత రాజకీయాల్లో నడుస్తున్న కాలం రూపొందించుకున్న యోధుడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ప్రస్తాన లేకుండా భారత రాజకీయాలను అంచనా వేయలేం. ఆయన్ని వ్యతిరేకిస్తూనో, ఆయనకు అభిమానిస్తూనో, ఎలాగైతేనేం ఆయన పాత్ర లేకుండా రాజకీయాలు ఊహించలేని స్థాయికి మోడీ చేరుకున్నారు.
తాను ప్రధానమంత్రి పోటీలో ఉన్నానని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ప్రధానమంత్రి పోటీలో ఉన్న వారి జాబితా ఎవరు రూపొందించినా ఆయన పేరు ఉండి తీరాల్సిందే. తనను తాను గుజరాతీగా చెప్పుకోవడానికి, గుజరాత్ అభివృద్ధికి అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందడానికే మోడీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పునాదులు బలంగా ఉంటే భవనం ఎంత ఎత్తుకైనా కట్టవచ్చునని పునాదులు తెలిసిన నాయకుడాయన. అందుకే బిజెపిలో తాను ఎవరికీ పోటీ కాదని గుజరాత్ రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఒక జాతీయ పార్టీ నాయకుడైనా, గుజరాత్‌లో మాత్రం ప్రాంతీయ పార్టీ తరహాలోనే తన వ్యక్తిగత ఇమేజ్‌తో బిజెపికి ఎదురులేకుండా చేశారు. నరేంద్ర మోడీ స్థానిక నాయకుడు, రాహుల్‌గాంధీ జాతీయ నాయకుడు, రాహుల్‌తో మోడీకి పోలికేమిటి? అంటూ గుజరాత్ కాంగ్రెస్ నాయకులు విమర్శించినప్పుడు.

ఔను నేను స్థానిక నాయకుణ్ణే, ఈ విషయాన్ని నేను వినయంగా ఒప్పుకుంటాను. రాహుల్‌గాంధీ జాతీయ నాయకుడే కాదు అంతర్జాతీయ నాయకుడు కూడా. ఆయన ఇటలీ నుంచి కూడా పోటీ చేయగలరు అంటూ చురక అంటించారు. ఎదుటి వారిని ఆటపట్టిస్తూ, గుజరాత్ ఆత్మగౌరవాన్ని చాటిచెబుతూ, అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ మాట్లాడడంలో మోడీ స్టైలే వేరు. కార్యదర్శులు రాసిచ్చే ఉపన్యాసం కన్నా అప్పటికప్పుడు చమక్కులతో ప్రత్యర్థులను ఆటపట్టించడం మోడీకి భలే సరదా! మోడీ ముమ్మాటికీ కాలం తయారు చేసుకున్న హీరో.... మోడీని రాజకీయాల్లో విపరీతంగా అభిమానించే వాళ్లు ఉన్నారు. అదే విధంగా తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లు ఉన్నారు. నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర బిందువు. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభావం ఆ రాష్ట్రానికే పరిమితం అవుతుంది. కానీ మోడీ ప్రభావం మాత్రం మొత్తం దేశంపై కనిపిస్తోంది. కాబోయే ప్రధానమంత్రి మోడీ అని భావించే వాళ్లు కొందరు. రాహుల్‌గాంధీకి మోడీ నుంచే గట్టి పోటీ ఎదురవుతుంది.

ఒక్క ఫోటో మీ జీవితానే్న మార్చేస్తుంది. నిజమే రాజకీయ నాయకుల జీవితాలను ఏ సంఘటన ఎలా మలుపుతిప్పుతుందో తెలియదు. గుజరాత్ మత కలహాల సమయంలో ఒక ముస్లిం యువకుడు నన్ను ఏమీ చేయకండి అంటూ కన్నీళ్లు పెడుతూ వేడుకుంటున్న ఫోటో ప్రపంచ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేక ప్రచారాన్ని తెచ్చి పెట్టింది. చివరకు ఆయనకు అమెరికా, బ్రిటన్‌లు వీసాను సైతం నిరాకరించాయి. ఇది మొదటి ఫోటో కథ ఇక మరో ఫోటోలోకి వెళదాం.. అది మైనారిటీల సమావేశం. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వక్తలు ఆకాశానికెత్తుతున్నారు. మోడీ మెడలో శాలువ కప్పారు. అనంతరం ముస్లింలు సంప్రదాయ బద్ధంగా తలపై ధరించే టోపీని మోడీ తలపై పెట్టడానికి మత పెద్ద ముందుకు రాగానే మోడీ సున్నితంగా తిరస్కరించారు. పత్రికలు ఆ ఫోటోను ప్రచురించాయి. చానల్స్ హడావుడి చేశాయి. మోడీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సాధారణంగా మోడీ స్థానంలో మరే నాయకుడు ఉన్నా ముస్లింల కన్నా మిన్నగా ముస్లిం సంప్రదాయంలో టోపీ ధరించి ఆ సమావేశానికి వెళ్లేవారు. టోపీ పెట్టడానికి ముందుకు వస్తే మహాద్బాగ్యంగా భావించే వాళ్లు. మోడీ సైతం అలానే చేసి ఉంటే దేశంలోని కొన్ని వందల మంది రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరుగా ఉండేవారు. కానీ మనసులో ఒకటి పైకి ఒకటి అని కాకుండా ఇతరులు ఏమనుకున్నా, ఇతరులకు నచ్చినా నచ్చక పోయినా తాను అనుకున్నది చేయడం ద్వారా భారత రాజకీయాల్లో నవతరానికి ఆయన హీరోగా మారారు.

ఆయన పులుకడిగిన ముత్యం కాకపోవచ్చు, అలానే లౌకిక వాద మీడియా ప్రచారం సాగించినట్టుగా భయంకరమైన నాయకుడు కాకపోవచ్చు. కానీ నవ తరాన్ని ఆకట్టుకుంటున్న నిఖార్సయిన రాజకీయ నాయకుడు. ప్రధానమంత్రి పోటీలో ప్రాంతాలకు అతీతంగా మద్దతు పొందుతున్న నేత. అగ్రవర్ణాల పార్టీ అనే ముద్ర ఉన్న బిజెపిలో వెనుకబడిన వర్గాల నుంచి ప్రధానమంత్రి పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగిన నేత. గదిలో బంధించి అదే పనిగా పిల్లిని హింసించినా అది పులిలా తిరగబడుతుంది ఇది సహజం. అలానే హిందూమతం సహనాన్ని అసమర్థతగా భావించినప్పుడు మోడీ లాంటి వారిని తమ యోధునిగా నిర్ణయించుకోవడానికి కాలమే అవకాశం కల్పించింది. మతం అనే భావన పుట్టక ముందే పుట్టిన హిందూ మతంలోనే లౌకిక వాదం ఉంది. హిందూమతానికి మరెవరో లౌకిక వాదం నేర్పాల్సిన అవసరం లేదు, ఆ మతం పునాదే లౌకిక వాదం. కానీ ఓట్ల రాజకీయంలో, మైనారిటీల సంతృప్తీకరణ విధానాలతో మమ్ములను, మా మతాన్ని చులకన చేస్తున్నారు అనే భావన హిందువుల్లో బలంగా ఏర్పడింది. ఈ ఆలోచనలే మోడీని బలమైన నాయకుడిగా నిలబెట్టింది. దేశం మొత్తం మోడీకి వ్యతిరేకంగా మీడియా ప్రచారం సాగించినా, అమెరికా వీసా నిరాకరించినా ఇలాంటి ప్రతి చర్య మోడీకి హీరో ఇమేజ్‌ను తెచ్చి పెట్టాయి. 

అమెరికాలో గుజరాతీల సమావేశానికి హాజరు కావడానికి మోడీ వీసా కోసం దరఖాస్తు చేస్తే తిరస్కరించారు. దాంతో మోడీ గుజరాత్ నుంచే అమెరికాలోని గుజరాతీలతో సంభాషించారు. ఎంతో ఆర్భాటంగా పెట్టుబడుల సేకరణ కోసం కాళ్లరిగేలా అమెరికాలో తిరిగిన నాయకుల కన్నా మోడీ తన సొంత రాష్ట్రంలో ఉండే ఎక్కువ పెట్టుబడులు రాబట్ట గలిగారు. పెట్టుబడులతో పాటు గుజరాతీల మనసు దోచారు. గుజరాత్‌కు సింబల్‌గా మారారు. చివరకు ఆయన ప్రత్యర్థి పార్టీలు సైతం మాది మోడీ రాష్ట్రం అని చెప్పుకునే పరిస్థితి కల్పించారు.

రెండేళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహిస్తారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో నిర్వహించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు తమ తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటో? తమ రాష్ట్రం పెట్టుబడులకు ఏ విధంగా అనుకూలమైనదో వివరించారు. మోడీ వంతు రాగానే డబ్బు సంపాదన కోసం మీరు సొంత దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్లిన వారు. లాభం వస్తుందనే నమ్మకం ఉంటే తప్ప పెట్టుబడులు పెట్టరు. పెట్టుబడులు పెట్టమని నేనేమి మిమ్ములను బ్రతిమిలాడడం లేదు. లాభం ఉందనుకుంటే పెట్టుబడులు పెడతారు అంటూ తమ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఎలా ఉందో వివరిస్తూనే మీ నుంచి ఒక సహాయాన్ని కోరుతున్నాను అంటూ మీరున్న దేశంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక పది మందికి భారత దేశంలో దర్శనీయ ప్రదేశాల గురించి ఒక పది మందికి చెప్పండి. ఒక్కొక్కరు ఒక పది మందిని భారత్‌కు పర్యాటకులుగా పంపగలిగితే దేశానికి ఎంత విదేశీ మారక ద్రవ్యం వస్తుందో లెక్కలు చెప్పారు. అప్పటి వరకు మాట్లాడిన ముఖ్యమంత్రులంతా ఎన్‌ఆర్‌ఐలను బ్రతిమిలాడినట్టుగా మాట్లాడితే మోడీ మాత్రం ప్రాక్టికల్‌గా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.

తన ధరించే దుస్తుల నుంచి, తన ఉపన్యాసం, తన పాలన వరకు అన్నింటిలోనూ మోడీ మార్క్ కనిపిస్తుంది. అప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్న మోడీ 1987లో బిజెపి ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అంతకు ముందు అతనికి ఎలాంటి పాలనానుభవం లేదు. కానీ చిత్రంగా అనేక ఒడిదుడుకులను, వ్యతిరేకతను ఎదుర్కొని పాలనను గాడిలో పెట్టి వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి నాలుగవ సారి సైతం అధికారంలోకి రావడంలో ఎలాంటి సందేహం లేని పరిస్థితి తెచ్చుకున్నారు. 1995 నుంచి గుజరాత్‌లో బిజెపి అధికారంలో ఉంది. అయితే ఇప్పటి వరకు బిజెపి అధికారంలోకి ఉంచే విధంగా చేసింది మాత్రం మోడీనే. 2001 జనవరి లో భారీ భూ కంపం గుజరాత్‌ను అతలాకుతలం చేసింది. అలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 2001లో నరేంద్ర మోడీ గుజరాత్ పగ్గాలు చేపట్టారు. భూ కంపంలో భుజ్ పట్టణం సర్వనాశనం అయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకున్నారు. ఈ రోజు మీరు భుజ్ పట్టణాన్ని చూస్తే ఒకప్పుడు భూ కంపంలో నాశనమైన పట్టణం ఇదేనా? అని ఆశ్చర్యపోతారు. భుజ్ పట్టణం మోడీ పాలనా దక్షతకు నిదర్శనం అంటారు ఆయన అభిమానులు. ఒకవైపు భుజ్‌పై శ్రద్ధ పెడుతూనే మరోవైపు గుజరాత్ నవ నిర్మాణంపై దృష్టి సారించారు. ఇప్పుడు గుజరాత్ అభివృద్ధి రేటు రెండంకెల్లో ఉంది. గుజరాత్‌కు ఇప్పుడు రాష్ట్రాలతో కాదు దేశాలతోనే పోటీ అని మోడీ సగర్వంగా ప్రకటించారు. మతపరంగా మోడీని విమర్శించే వారు సైతం అభివృద్ధి విషయంలో, అవినీతి వ్యవహారాల్లో ఆయన్ని వేలెత్తి చూపించలేరు. మతపరంగా మోడీపై తీవ్రంగా విమర్శలు చేసే వారు ఉన్నారు కానీ పాలనలో అసమర్ధత, అవినీతి, అక్రమాలపై విమర్శించే వారు లేరు. చివరకు మైనారిటీ నాయకులు సైతం మోడీ కన్నా ముందు నుంచే గుజరాత్ అభివృద్ధి పథాన పయనిస్తోంది అని చెబుతున్నారు కానీ మోడీ అభివృద్ధి సాధించలేరు అని చెప్పడం లేదు. సహజంగా వేగంగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు కుంభకోణాలు, అవినీతి సైతం అదే స్థాయిలో బయటపడుతుంది. కానీ మోడీ పాలన మాత్రం దీనికి భిన్నంగా సాగుతోంది. 1950 సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని మెహసనా జిల్లాలోని వడనగర్ అనే చిన్న పట్టణంలో మోడీ జన్మించారు. సామాన్య కుటుంబం. మోడీ ఈ స్థాయిలో ఉన్నా ఏ ముఖ్య కార్యక్రమం అయినా తన గ్రామంలోని ఇంటికి వెళ్లి తల్లికి పాదాభివందనం చేసి ప్రారంభిస్తారు. 1967లో ఇండో పాక్ యుద్ధ సమయంలో చిన్న వయసులోనే సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌లో సైనికులకు యుద్ధ సమయంలో వాలంట్రీగా పని చేశారు. అఖిలభారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గుజరాత్‌లో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఎంఎ పొలిటికల్ సైన్స్ చదివిన మోడీ విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాల్లో ఉండేవారు. ఎంఎ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎక్కువ సమయం గడిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉండగా, 1974లో అవినీతికి వ్యతిరేకంగా నవనిర్మాణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో అజ్ఞాత వాసంలో ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. 1987లో బిజెపిలో చేరారు. ఏడాదిలోనే అతన్ని గుజరాత్ బిజెపి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1995లో గుజరాత్‌లో బిజెపి అధికారంలోకి వచ్చింది. 88 నుంచి 95 వరకు మోడీ తన కార్యకలాపాలతో గుజరాత్ బిజెపిలో మంచి వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. అద్వానీ రథయాత్రలకు ఏర్పాట్లు జరిగింది మోడీ నాయకత్వంలోనే. 

1998లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. 1995లో మోడీని బిజెపి జాతీయ కార్యదర్శిగా నియమించి, ఐదు రాష్ట్రాల్లో బిజెపి బాధ్యతలు అప్పగించారు. తరువాత ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వివిధ దేశాల్లో పర్యటించి, అక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి, బిజెపి జాతీయ నాయకులతో సన్నిహితం కావడానికి ఈ కాలంలో ఆయనకు ఎంతో ఉపయోగపడింది. ఈ పరిచయాలే ఆయన్ని 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిని చేశాయి. పంచమిత్ర యోజన పేరుతో ఐదు ప్రధాన అంశాలను గుర్తించి, వివిధ రంగాల్లో గుజరాత్ సమగ్రాభివృద్ధికి మోడీ ప్రాధాన్యత ఇచ్చారు.

22 డిసెంబర్ 2002లో రెండవ సారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం నుంచే మోడీ స్టైల్ చూపించారు. ఓపెన్ ఏయిర్ ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం చేశారు. గ్లామర్ రాజకీయాలను నమ్ముకునే ప్రాంతీయ పార్టీల నాయకుల తరహాలో ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ గవర్నెన్స్, పెట్టుబడులు, విద్య, విద్యుత్, ఎస్‌ఇజడ్, రోడ్లఅభివృద్ధి వంటి అనేక రంగాల్లో గుజరాత్ ఆశ్చర్యకరమైన అభివృద్ధి సాధిస్తోంది. మీడియా మొత్తం మోడీని వ్యతిరేకించిన కాలంలో సైతం సామాజిక సైట్స్‌లో మాత్రం మోడీ హవా కనిపించేది. దేశం మొత్తంలో అందరి కన్నా ఎక్కువగా సామాజిక సైట్స్‌తో అనుసంధానం అయింది మోడీనే. ఆయన ట్విట్‌ను కొన్నివేల మంది అనుసరిస్తారు. వివిధ అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ముస్లింలు సైతం మోడీకి మద్దతు ఇస్తున్నారు. మత రాజకీయాలు ఇంకెంత కాలం అభివృద్ధిపై దృష్టి సారిద్దాం అంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. బురఖాలను సైతం బిజెపి పంపిణీ చేసి సభలకు పంపిస్తున్నారు అంటూ గుజరాత్ కాంగ్రెస్ నాయకుడొకరు విమర్శించారంటే మోడీ సభల్లో ముస్లింల హాజరుపై ఆ పార్టీ కలవరపాటు కనిపిస్తోంది. కేవలం మతాన్ని నమ్ముకొని మోడీ అధికారంలోకి వచ్చి ఉంటే కేవలం ఒకసారి మాత్రమే గెలిచే వారు. నాలుగవ సారి అధికార పగ్గాలు చేపట్టడం అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా మోడీ పాలన గుజరాత్ ప్రజలకు నచ్చింది. అందుకే మళ్లీ మళ్లీఅధికారం అప్పగిస్తున్నారు. కేవలం ప్రచారం, మతం, ఉద్రేకాలు రెచ్చగొట్టే ఏదో ఒక అంశం ఒకసారి కన్నా ఎక్కువ సార్లు పని చేయదు. మోడీ మళ్లీ మళ్లీ గెలుస్తున్నారు అంటే ప్రజలు ఆమోదిస్తున్నారనే విషయాన్ని మోడీ వ్యతిరేకులు గుర్తించాలి. 

మోడీ స్టైల్

* మోడీ స్టైల్ నరేంద్ర మోడీ రాజకీయాల్లోనే కాదు ఆయన దుస్తుల్లోనూ ప్రత్యేకత కనిపిస్తుంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఒకే రకంగా తెల్ల రంగు దుస్తులు ధరిస్తారు. కానీ మోడీ స్టైల్ వేరు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆయన దుస్తుల్లో సైతం ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. మోడీ కుర్తా ఇప్పుడు గుజరాత్‌నే కాకుండా ఉత్తరాదిలో చాలా ప్రాంతాల్లో పాపులర్. మీ దుస్తుల డిజైనర్ ఎవరు? అని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన సమాధానం విని విస్తుపోయారు. ఎందుకంటే ఆయన దుస్తుల డిజైనర్ ఆయనే. ఇందులో వింతేమీ లేకపోవచ్చు. కానీ ఆ డిజైన్ వెనుక కథ మాత్రం ఆసక్తికరమైనదే. ‘‘ గత 40 ఏళ్ల నుంచి నా దుస్తులను నేనే ఉతుక్కుంటున్నాను. లాంగ్ కుర్తా ఉతుక్కోవడం కొంచెం కష్టం అనిపించేది. ఉతక డానికి సౌకర్యంగా ఉంటుందనే చేతులు లేని కుర్తాకు డిజైన్ చేశాను. అంటే కనీసం చేతుల వరకు ఉతకాల్సిన అవసరం ఉండదు. పైగా లగేజీలో తక్కువ స్థలం ఆక్రమించుకుంటుంది. అంటూ తన స్టైల్ రహస్యం విప్పి చెప్పారు. నా సింప్లీసిటీ కూడా ఫ్యాషన్ అయిపోయింది. మోడీ కుర్తా ఇప్పుడు అన్ని చోట్ల లభిస్తోంది అంటారు నవ్వుతూ. ఇక ఆయన ఇష్టపడి తినేది కిచిడి. ఈ తరం వాళ్లకు ఇది అంతగా ఇష్టం ఉండదు కానీ నాకు మాత్రం చాలా ఇష్టం అంటారు. నేను గత నాలుగున్నర దశాబ్దాలుగా పరివ్రాజకునిగానే జీవిస్తున్నాను, ఎక్కడ ఎవరింటికి వెళ్లినా వాళ్లు పెట్టింది తింటాను’’ అని చెబుతున్నారు. 

హిట్లర్ మోడీఔను హిట్లర్ కూడా అభివృద్ధి చేశాడు అభివృద్ధి విషయంలో మోడీని ఆకాశానికెత్తేవారు ఉన్నట్టుగానే తీవ్రంగా విమర్శించే వారు సైతం ఉన్నారు. వారు సైతం బలమైన వాదనలే వినిపిస్తారు. గుజరాత్, మహారాష్టల్రో విద్యారంగంలో విశేష కృషి జరిపిన మహమ్మద్ వస్తన్వీ వాదన మరో విధంగా ఉంది. 20 శతాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి జరిగింది. 1933నుంచి 1939 వరకు ఆరేళ్లు జర్మనీలో అత్యంత వేగంగా అభివృద్ధి జరిగింది. అయితే ఆ తరువాత 1939 నుంచి 1945 వరకు ఆరేళ్ల కాలంలో హిట్లర్ పాలనా కాలంలో జర్మనీ విధ్వంసం అయింది. అభివృద్ధి జరిగింది హిట్లర్ పాలనా కాలంలోనే విధ్వంసం జరిగిందీ హిట్లర్ పాలనలోనే. ఐదు కోట్ల మంది రెండవ ప్రపంచ యుద్ధం వల్ల బాధితులయ్యారు. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలను, షిప్ బ్రేకింగ్ యూనిట్స్‌ను అల్యూమినియం, అస్బెస్టాస్, కెమికల్ పరిశ్రమలను తమ దేశం నుంచి తొలగించి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం వీటిని చూసి అభివృద్ధి అని భావిస్తున్నామని గులాం మహమ్మద్ వాదిస్తున్నారు. 

మేం భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించామని చెప్పుకోవడానికి నాయకులు ఇలాంటి ప్రమాదకరమైన పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతున్నారనేది ఆయన వాదన. ఇలాంటి ఇనె్వస్ట్‌మెంట్ ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వస్తోందని తెలిపారు. అభివృద్ధి సూచికలపై ప్రపంచ బ్యాంకు రూపొందించిన పారామీటర్స్‌నే మనం ఉపయోగిస్తున్నాం ఇది మారాలని ఆయన అంటారు. పారిశ్రామికంగా దేశంలో ఎక్కువగా అభివృద్ధి చెందిన మహారాష్టల్రోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే జమ్మూకాశ్మీర్‌లో అతి తక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. అయినా గుజరాత్ అభివృద్ధి మోడీ నాయకత్వంలో ఇప్పుడు మొదలైనదేమీ కాదు. పారిశ్రామిక వాతావరణం గుజరాత్‌లో 19వ శాతాబ్దం నుంచే ఉంది. పారిశ్రామిక వేత్త అబ్దుల్లా గుజరాత్ నుంచి మహాత్మాగాంధీని దక్షిణ ఆఫ్రికాకు పిలిపించుకున్నారు. పారిశ్రామిక వాతావరణం విషయంలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలతో గుజరాత్‌ను పోల్చడానికి అవకాశం లేదు. ఇక గుజరాత్‌లో అభివృద్ధి అని చెబుతున్నది మోడీ హయాంలో జరిగిందేమీ కాదు. నరేంద్ర మోడీ గ్రోత్ రేట్ అని ప్రచారం చేస్తున్నారు కానీ మోడీ లేక ముందు రెండు దశాబ్దాల క్రితమే ఇప్పటి కన్నా అభివృద్ధి రేటు ఎక్కువగా ఉందనేది మోడీ వ్యతిరేకుల వాదన. 

1990లో గుజరాత్‌లో అభివృద్ధి రేటు 12 నుంచి 13 శాతం. ఆ సమయంలో జాతీయ అభివృద్ధి రేటు ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే. ఇప్పుడు గుజరాత్‌లో అభివృద్ధి రేటు 11 శాతం కాగా,జాతీయ అభివృద్ధి రేటు దీని కన్నా ఒకటి రెండు శాతం మాత్రమే తక్కువ. ఇదీ మోడీ వ్యతిరేకుల వాదన. మీడియా ప్రచారం వల్ల మోడీకి అభివృద్ధికి చిహ్నం అనే ముద్ర పడిందనేది వారి వాదన. అయితే అభివృద్ధి విషయంలో మోడీ చేతలతో చూపించడం వల్ల వ్యతిరేక ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు.........

Tuesday, March 7, 2023

*మహిళా దినోత్సవం* : వివరణ

మహిళా దినోత్సవo గురించి 
*అద్భుత వివరణ*

చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నా మనసులో ఉన్న ఇలాంటి భావాలను  మహిళాదినోత్సవం జరుపుతున్న సందర్భంలో ఒక మహిళనే చెపితే బాగుండని.. ఇన్నాళ్లకు నెరవేరెను.
సూటిగా,సుత్తి లేకుండా, నిక్కచ్చిగా, మెండైన ఆత్మ విశ్వాసంతో చెప్పారు.. ప్రణామాలు🙏🏼.

https://m.facebook.com/story.php?story_fbid=pfbid07A1dzgaTvoZCMA71mNjgZccufbA6UL2X1Bw8btXnKbvaYZMBimGCN2mLMH9cpDGil&id=100008345863766&mibextid=Nif5oz

Thursday, March 2, 2023

చరితకు అందని స్థలాలు @గుడిబండ

మన చరితను మనమే రాసుకోవాలి.
చరిత్రకు అందివ్వాలి.... సమాజానికీ తెలపాలి.
Post of 03.03.2020
మన మన ప్రాంతాలలో ఉన్న చారిత్రాత్మకమైన ఎన్నో ప్రసిద్ద స్థలాలు గుర్తింపుకు నోచుకోక చరిత్రకు అందలేదు అనే కంటే అందివ్వబడలేదు అనుకోవచ్చు.  
దానికి అనేక కారణలు ఉండి ఉండవచ్చు... 
పరిస్థితులు అనుకూలించకపోవచ్చు...

అవకాశం ఉన్నప్పుడు కూడా అలాంటి విషయాల పట్ల సరైన శ్రద్ధ చూపక పోతె ఆ తప్పు మనదే అవుతుంది... 
చరిత్రతో పాటు మన ప్రాంతలోని రేపటి తరం మన పట్ల గౌరవం చూపకపోవచ్చు...

అందుకే మన మన ప్రాంతాలలోని ప్రసిద్ద స్థలాలను మనమే సమాజానికి పరిచయం చేయాలి.. 
చరిత్రకు అందజేయాలి.. సమాజనికీ తెలపాలి.
సుమారు 300 ఎకరాల సువిశాల స్థలంలో,
 500 అడుగుల పైన  ఏకశిలగా పరుచుకుని, 
నాలుగు వైపులా నిండుగా పరుచుకున్న కొండలమద్య రమణీయంగా కొలువైన ఆ గుడిబండ రామలింగేశ్వరాలయం మన ప్రాంతంలోని మంచాల మండలం రంగాపూర్ _చీదేడ్ గ్రామాలలో మద్యలో ఉన్నది*...

గత అనేక సంవత్సరాలుగా ఆయా గ్రామాల ప్రజలు తమకు అవకాశం ఉన్నకాడికి ఆ ప్రసిద్ద స్థలంలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు....

మహా శివరాత్రి మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తు తమ శక్తికొలది ప్రయత్నం కొనసాగిస్తున్నారు... 
కానీ క్షేత్రం చాలా పెద్దది..చరిత్రకు తప్పక అందాల్సిన స్థలం అది.  

*గత సంవత్సరం  శ్రీశ్రీశ్రీ హంపీ విరూపాక్ష #విద్యారణ్యస్వామీజి సందర్శించి క్షేత్ర పరిస్థితులను పరిశీలించి రాబోయే రోజులలో ఈ క్షేత్రం గొప్పగా వెలుగొందుతుందని ఆలయ నిర్వహకులను గ్రామస్థులను ఆశీర్వదించారు...
దానితో పాటు ప్రారంభ సూచకంగా గత సంవత్సర
 #శ్రీరామనవమి ఉత్సవాలకు #హంపీపీఠం తరపున పట్టు వస్త్రాలను పంపించారు.. 
ఇక ముందు కూడా వారి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాము. 

ఆలయాన్ని అభివృద్ది చేసి ఈ క్షేత్రాన్ని గొప్పగా వెలుగొందేలా చేయాలని #రంగాపూర్  & #చీదేడ్ గ్రామాల ప్రజలతో పాటు పరిసర గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు...
వారి కోరికకు పరిసర గ్రామల ప్రజలతో పాటు సామజిక అభిలాషులు, శ్రేయోభిలాషులు ఈ ప్రాంతంపై అభిమానం ఉన్న పెద్దలు తోడైతే అతి త్వరలోనే ఒక గొప్ప క్షేత్రంగా వెలుగొందుతుంది.
  మనమూ #సహకరిద్దాం...మనవంతు సహకారాన్ని అందిద్దాం*.

*ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించే  #శ్రీరామనవమి ఏర్పాట్ల కోసం ఈ రోజు సమావేశం అయిన ఆలయ నిర్వహణ బృదంతో పాటు, ఆయా గ్రామాల సర్పంచులు మరియు #హంపీపీఠం తరపున పాల్గొన్న #ప్రతినిదులు*.
*మనమూ బాగస్వాములం అవుదాం .. మన వంతు సహకరిద్దాం*. 
:~ వివరాలకు : 9121797513, 9618876646.
మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం.
:~ HVVMS.